Journalist Murthy About Sri Reddy Issue: తెలుగు సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ గురించి గట్టిగా మాట్లాడిన వ్యక్తుల్లో శ్రీ రెడ్డి కూడా ఒకరు. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక ప్రముఖ నిర్మాత కుమారుడు తనను లైంగికంగా వేధించాడని అప్పట్లో శ్రీ రెడ్డి స్టేట్‌మెంట్ ఇచ్చింది. ఆ స్టేట్‌మెంట్ వెనుక, ఫిల్మ్ ఛాంబర్ ముందు తను చేసిన ధర్నా వెనుక జర్నలిస్ట్ మూర్తి ఉన్నాడని అప్పట్లో చాలామంది అనుకున్నారు. ఇప్పటికీ అనుకుంటూనే ఉన్నారు. అయితే తను డైరెక్టర్‌గా మారి తెరకెక్కించిన ‘ప్రతినిధి 2’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న మూర్తి.. శ్రీ రెడ్డి కాంట్రవర్సీపై ఒక ఇంటర్వ్యూలో స్పందించారు. అంతే కాకుండా శ్రీ రెడ్డి అలా చేయడానికి తాను కారణం కాదని క్లారిటీ ఇచ్చారు.


మందలించాను..


‘‘నేను డబ్బులిచ్చి శ్రీ రెడ్డితో ఏం చేయించలేదు. ఫిల్మ్ ఛాంబర్ ముందు తను ధర్నా చేసే 2,3 రోజుల ముందు ఛానెల్‌లో చర్చలు జరుగుతున్నాయి. నాకు ఇలా అన్యాయం జరిగింది, నేను ఏదైనా చేసి నిలదీస్తాను అని శ్రీ రెడ్డి లైవ్‌లో అంటే నేను, కరాటే కళ్యాణి మందలించాం. నేను ఏదో ఒకటి చేస్తాను, రెచ్చిపోతాను అన్నప్పుడు ఏమైనా అర్థముందా మీరు చేసే పనులకు, అలాంటివి చేయకూడదు, కూర్చొని మాట్లాడాలి, ప్రతీదానికి పరిష్కారం ఉంటుందని కరాటే కళ్యాణి ఆమె మీద అరిచారు. నేను కూడా మందలించాను’’ అంటూ అప్పుడు జరిగిన విషయాలను గుర్తుచేసుకున్నారు మూర్తి. ఇక ఫిల్మ్ ఛాంబర్ ఎదురుగా శ్రీ రెడ్డి నగ్నంగా ధర్నా చేసే సమయానికి అసలు తాను హైదరాబాద్‌లో లేనని, తన తల్లి ఆరోగ్యం బాలేక ఊరికి వెళ్లాలని స్పష్టం చేశారు.


దానికే నా సపోర్ట్..


‘‘రెండు రోజుల తర్వాత నేను మళ్లీ హైదరాబాద్‌కు వచ్చాక శ్రీ రెడ్డి అలా చేసిందంటూ అందరూ నన్ను అనడం మొదలుపెట్టారు. నేను అలా ఎప్పుడూ చేయను’’ అని అన్నారు మూర్తి. శ్రీ రెడ్డి సమస్య వెనుక ఉన్న కారణాన్ని అప్పుడే కాదు ఇప్పటికీ సపోర్ట్ చేస్తానని స్టేట్‌మెంట్ ఇచ్చారు. శారీరకంగా దగ్గరయితే అవకాశాలు ఇస్తానంటూ మోసం చేయడం తప్పని అభిప్రాయం వ్యక్తం చేశారు. అలా ఎవరు చేసినా తప్పే అని అన్నారు. అలా శ్రీ రెడ్డికి అన్యాయం జరిగింది కాబట్టే తను పోరాడుతున్న సమస్యకు అండగా నిలబడ్డా. కానీ వేరేవాళ్లు నేను చేసినదాన్ని తప్పుదోవ పట్టించారు. నాకెందుకు అని తగ్గిపోతే సమస్యను ప్రశ్నించేది ఎవరు అనే ఉద్దేశ్యంతో నేను అవన్నీ పట్టించుకోలేదు’’ అని వివరించారు మూర్తి.


అది నా బాధ్యత..


తాను సపోర్ట్ చేసిన ఉద్యమంలోని వ్యక్తులు ప్రలోభాలకు గురయ్యి వెనక్కి తగ్గితే తన తప్పు కాదని చెప్పుకొచ్చారు మూర్తి. శ్రీ రెడ్డి విషయంలో అదే జరిగిందని ఇన్‌డైరెక్ట్‌గా స్టేట్‌మెంట్ ఇచ్చారు. మూర్తి ఎప్పుడు చూసినా కాంట్రవర్సీలే చేస్తాడు అని ప్రేక్షకులకు ఉండే అభిప్రాయంపై కూడా ఆయన స్పందించారు. ఒక జర్నలిస్ట్‌గా అవాస్తవాలను బయటపెట్టడం తన బాధ్యత అని, కానీ ప్రేక్షకులంతా దానిని కాంట్రవర్సీ అనుకుంటున్నారని క్లారిటీ ఇచ్చారు. అలాగే వేణు స్వామి, బిగ్ బాస్ కౌశల్ విషయంలో జరిగిందని గుర్తుచేసుకున్నారు. వారు పబ్లిక్‌గా ఇచ్చిన స్టేట్‌మెంట్స్ తప్పని ఒకానొక సందర్భంలో మూర్తి నిరూపించారు. దీంతో తన వల్లే వారి జీవితం నాశనం అయిపోయిందని కూడా అన్నారని మూర్తి బయటపెట్టారు. కానీ ఇదంతా ఆయన బాధ్యత అని సింపుల్‌గా చెప్పేశారు.



Also Read: 'వ‌కీల్ సాబ్' మళ్లీ వచ్చేస్తున్నాడు - రీరిలీజ్ ఎప్పుడంటే?