Sam Bombay reacts to Poonam Pandey's death stunt : బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భాశయ క్యాన్సర్ కారణంగా చనిపోయినట్లుగా వచ్చిన న్యూస్ ఎంత సంచలనం రేకెత్తించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాను చనిపోలేదని, సర్వైకల్ క్యాన్సర్ పై మహిళ్లలో అవగాహన కల్పించేందుకు తాను మృతి చెందినట్టు ప్రచారం చేశానని మరునాడు స్వయంగా పూనమ్ పాండే వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఆమెపై సామాన్య ప్రజల నుంచి సినీ సెలబ్రిటీల వరకు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఒకవైపు ఈ విషయంలో పూనమ్ ని జనాలు తిట్టిపోస్తుంటే ఆమె మాజీ భర్త మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించారు.
సర్వైవల్ క్యాన్సర్ తో మరణించినట్లు ప్రకటన
పూనమ్ పాండే సర్వేకల్ క్యాన్సర్ తో మరణించినట్లు శుక్రవారం నాడు స్వయంగా ఆమె అధికారిక ఇన్ స్టాగ్రామ్ ఎకౌంట్ లో పోస్ట్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. 32 సంవత్సరాల వయసులోనే క్యాన్సర్ తో పూనమ్ పాండే మరణించినట్లు తెలియడంతో అందరూ బాధపడ్డారు. ఆమె మృతి వార్తను ఆమె మేనేజర్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. ఈ ప్రకటనతో చాలామంది ఆందోళన చెందారు. పలువురు సినీ ప్రముఖులు, సినీ అభిమానులు, నెటిజన్లు ఆమె మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె మృతికి నివాళ్ళు సైతం అర్పించారు.
నేను బతికే ఉన్నా.. అవగాహన కోసమే అలా చేశా
పూనమ్ పాండే చనిపోయిన మరునాడు బతికే ఉన్నాను అంటూ వీడియో రిలీజ్ చేయడంతో అందరూ షాక్ అయ్యారు. సర్వేకల్ క్యాన్సర్ పై అందరికి అవగాహన కలిగించేందుకే తాను చనిపోయినట్లు పోస్ట్ పెట్టినట్లు పూనమ్ పాండే క్లారిటీ ఇచ్చింది. సర్వేకల్ క్యాన్సర్ కారణంగా దేశంలో ఎంతో మంది స్త్రీలు ప్రాణాలు కోల్పోతున్నారని.. అటువంటి వారికి ఈ వ్యాధి గురించి అవగాహన కల్పించాలని ఆలోచనతో తాను చనిపోయినట్టు సోషల్ మీడియాలో ప్రచారం చేసినట్లు చెప్పింది. అంతేకాదు తన మరణ వార్తతో బాధపడిన, ఇబ్బంది పడిన వారందరికీ క్షమాపణలు తెలిపింది.
సోషల్ మీడియాలో పూనమ్ ని తిట్టిపోస్తున్న నెటిజన్స్..
పూనమ్ పాండే చేసిన పనిపై సోషల్ మీడియా అంతట తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి సర్వైకల్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించాలనుకోవడం మంచిదే ఉద్దేశమే అయినా, దానికోసం ఆమె ఎంచుకున్న విధానం కరెక్ట్ కాదని అంటున్నారు. నెటిజన్లు. ఇది ఒక చీప్ పబ్లిసిటీ అని ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. పలువురు సెలబ్రిటీస్ కూడా ఈమె చేసిన పనికి ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఓవైపు సోషల్ మీడియాలో పూనం పాండేకి అందరూ చివాట్లు పెడుతుండగా.. పూనమ్ మాజీ భర్త సామ్ బాంబే మాత్రం ఆమెకి అనుకూలంగా మాట్లాడాడు. పూనమ్ మరణ భూతకం గురించి తెలుసుకొని ఆశ్చర్యపోయారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగితే.." లేదు.. అలా చేసినందుకు చాలా సంతోషిస్తున్నా. ఆమె ఇప్పుడు ఇప్పుడు బతికే ఉంది. అది చాలు నాకు. నిజానికి ఈ వార్త విన్నప్పుడు నా మనసులో ఏమనిపించలేదు. ఎందుకంటే అది జరగదని నేను అనుకున్నాను. నాకెందుకు ఏమి అనిపించిందంటే, నేను ప్రతిరోజు ఆమె గురించి ఆలోచిస్తాను. ప్రతిరోజు ఆమె కోసమే ప్రార్థిస్తాను. అలాంటప్పుడు ఏదైనా తప్పు జరిగితే నాకు తెలుస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు.
Also Read : రెండో రోజు పెరిగిన కలెక్షన్లు - 'అంబాజీపేట మ్యారేజీ బ్యాండు'కు ఎన్ని కోట్లు వచ్చాయో తెలుసా?