Salman Khan : కండల వీరుడు సల్మాన్ ఖాన్ ప్రధాన పాత్రలో వస్తోన్న ‘కిసీకా భాయ్​ కిసీకీ జాన్​’ చిత్రంలో నటి పాలక్ తివారీ నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ సందర్భంగా ఆమె సల్మాన్ పై చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. సెట్ లో అమ్మాయిలు పద్దతిగా బట్టలు వేసుకోవాలని సల్మాన్ రూల్ పెడతాడంటూ ఆమె చెప్పుకొచ్చింది. నెక్ లైన్ పైకి ఉన్న దుస్తులే ధరించాలని ఆంక్షలు పెడతాడని తెలిపింది. 


నటి శ్వేతా తివారీ కుమార్తె అయిన పాలక్... సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ అందర్నీ ఆకర్షిస్తూ ఉంటుంది. ‘అంతిమ్: ది ఫైనల్ ట్రూత్’ (2021)లో నటించిన మంచి పేరు తెచ్చుకున్న పాలక్.. ప్రస్తుతం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాలో నటిస్తూ బాలీవుడ్ లోకి అరంగేట్రం చేస్తోంది. సల్మాన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కీ జాన్‌’లో నటించిన పాలక్.. ఈ సందర్భంగా జరిగిన మీడియా పోర్టల్ ఇంటరాక్షన్ లో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. హీరో సల్మాన్ ఖాన్ తో తన అనుబంధం గురించి, అమ్మాయిల డ్రెస్సింగ్ పై సల్మాన్ ఒపీనియన్ గురించి చెప్పుకొచ్చింది.


‘అంతిమ్’ సెట్‌లో సల్మాన్‌తో కలిసి నటిస్తున్నప్పుడు తాను చూసిన కొన్ని ఆసక్తికర విషయాలను ఆమె వివరించింది. మహిళలు ఎలా దుస్తులు ధరించాలి అనే విషయంలో సల్మాన్‌కు నిబంధన ఉందని పాలక్ చెప్పింది. ఈ విషయం చాలా మందికి తెలియదని అనుకుంటున్నానని.. సెట్ లో ఉండే మహిళలంతా నెక్ లైన్ కి తక్కువ కాకుండా దుస్తులు ధరించాలనే నిబంధన పెట్టాడని తెలిపింది. తన సెట్స్‌లో అమ్మాయిలందరినీ సరిగ్గా డ్రెస్ చేసుకోవాలని సల్మాన్ కోరేవాడని పాలక్ చెప్పింది. 'సల్మాన్ ఒక సాంప్రదాయవాది అని.. అతను తనతో పనిచేసే మహిళల భద్రత కోసం ప్రయత్నిస్తాడు' అంటూ సల్మాన్ పై ప్రశంసలు కురిపించింది.


సల్మాన్ సర్ తో షూటింగ్ అనగానే తన తల్లి అత్యంత ఆనందం వ్యక్తం చేసిందని పాలక్ తెలిపింది. ఎందుకంటే ఆమె కూడా తన దుస్తులపై ఎప్పుడూ కంప్లైంట్ చేస్తూ ఉంటుందని, సల్మాన్ నిబంధనలు విన్నాక ఆమె ప్రశాంతంగా ఉందని చెప్పుకొచ్చింది. చుట్టుపక్కల పురుషులెవరున్నా అతను నమ్మడని, మహిళలెపుడూ సురక్షితంగా ఉండాలని కోరుకుంటాడని చెప్పింది. ఇటీవల ఓ ఈవెంట్ లో పాలక్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. సల్మాన్ ఇంత చక్కని ఆలోచన కలవాడా అంటూ గర్ల్ ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తు్న్నారు. మన సల్లూ భాయ్ అంతే.. మహిళలంటే ఎప్పుడూ గౌరవిస్తాడు అంటూ మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా సల్మాన్ వ్యక్తిత్వం గురించి పాలక్ చెప్పి.. అతని క్యారెక్టర్ ను బయటపెట్టడం అందరికీ సంతోషాన్ని కలిగిస్తోంది.


డైరెక్టర్ ఫర్హాద్ సామ్జీ దర్శకత్వం వహించిన కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌ మూవీలో హీరో సల్మాన్ ఱాన్ తో పాటు హీరోయిన్ పూజా హెగ్డే, టాలీవుడ్ హీరో వెంకటేష్ దగ్గుబాటి, జగపతి బాబు, షెహనాజ్ గిల్, రాఘవ్ జుయల్, సిద్ధార్థ్ నిగమ్, విజేందర్ సింగ్, ఇతరులు కూడా నటించారు. కాగా ఈ సినిమా ఏప్రిల్ 21న సినిమా థియేటర్లలో విడుదల కానుంది.


Also Read : దేవుడి దయ వల్ల బావున్నా, గాయాలు కాలేదు - స్పందించిన సంజయ్ దత్