Salaar Collections : పాన్ ఇండియా హీరో ప్రభాస్ నటించిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల ప్రభంజనం సృష్టిస్తోంది. తొలిరోజే రూ.178 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ వీకెండ్ పూర్తికాకముందే రూ.500 కోట్ల క్లబ్ లో చేరి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది. పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయిన ఈ మూవీ అన్నిచోట్ల డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ముఖ్యంగా నార్త్ లో షారుక్ ఖాన్ లాంటి స్టార్ హీరో నటించిన 'డంకీ' సినిమాతో గట్టి పోటీ ఎదురైనా కూడా దాన్ని వెనక్కినెట్టి మరీ సలార్ రెట్టింపు వసూళ్ళు రాబడుతుండడం విశేషం. ఈ క్రమంలోనే ఏడు రోజుల్లో సలార్ కేవలం ఇండియాలో రూ.300 కోట్ల క్లబ్లో చేరడం విశేషం.


ఏడవ రోజు కలెక్షన్స్ లో కొంత డ్రాప్ కనిపించినప్పటికీ షారుఖ్ ఖాన్ 'డంకీ' కంటే మెరుగైన వసూళ్లు రాబట్టింది. ఆరో రోజు సలార్ ప్రపంచవ్యాప్తంగా రూ.500 కోట్లకు పైగా కలెక్షన్స్ తో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించగా ఏడవ రోజు మరో నయా రికార్డు క్రియేట్ చేసింది. ఈసారి ఇండియాలోనే కేవలం ఏడు రోజుల్లోనే రూ.300 కోట్లను దాటిన సినిమాగా సలార్ నిలిచింది. డిసెంబర్ 22న విడుదలైన ఈ సినిమా తొలి రోజు ఓపెనింగ్స్ ని అందుకొని ఆ తర్వాత డిసెంబర్ 25 క్రిస్మస్ వరకు భారీగా వసూళ్లు రాబట్టగా ఆ తర్వాత క్రమక్రమంగా కొంత తగ్గుతూ వచ్చాయి.


తొలిరోజు ఇండియాలో రూ.90.7 కోట్లతో రికార్డు క్రియేట్ చేసిన సలార్ రెండో రోజు రూ.56.35 కోట్లు మూడో రోజు రూ.62.05 కోట్లు నాలుగో రోజు రూ.46.3 కోట్లు ఐదో రోజు రూ.24.9 కోట్లు ఆరవ రోజు రూ.15.10 కోట్లు వసూలు చేయగా ఏడో రోజు మరో రూ.13.90 కోట్లు కాబట్టి ఏడు రోజుల్లో రూ.300 కోట్ల మార్కు దాటింది. వీటిలో తెలుగు రాష్ట్రాల నుంచే సుమారు రూ.190 కోట్ల వరకు కలెక్షన్స్ రావడం విశేషం. కాగా హిందీలో డంకి నుంచి పోటీ ఉండటంతో ఆశించిన స్థాయిలో కలెక్షన్స్ రాలేదు. అటు కర్ణాటకతోపాటు తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లోనూ సలార్ కలెక్షన్ల పరంగా కొంత నిరాశపరిచింది. ఇక ప్రపంచవ్యాప్తంగా ఆరు రోజుల్లోనే రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది.


దీంతో మూడుసార్లు 500 కోట్ల వసూళ్లు అందుకున్న ఏకైక సౌత్ హీరోగా ప్రభాస్ నిలిచాడు. ఆ తర్వాత రజనీకాంత్ 'జైలర్' (రూ.650 కోట్లు), '2.0' (రూ.800 కోట్ల)తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక ఇప్పుడు సలార్ కి లాంగ్ వీకెండ్ ఉండడంతో కచ్చితంగా కలెక్షన్స్ పెరుగుతాయి అని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలోనూ ఈ వీకెండ్ పెద్ద సినిమాలు ఏవి రిలీజ్ కావడం లేదు. దీంతో శని, ఆది, సోమ వారాల్లో సలార్ కి భారీగా కలెక్షన్స్ పెరిగే అవకాశాలున్నాయి. సుమారు రూ.250 కోట్ల బడ్జెట్తో హోంబలే ఫిలిమ్స్ నిర్మించిన ఈ చిత్రంలో ప్రభాస్ సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటించగా పృథ్విరాజ్ సుకుమారన్, జగపతిబాబు, శ్రీయా రెడ్డి, ఈశ్వరి రావు తదితరులు కీలకపాత్రలు పోషించారు.


Also Read : ‘కుర్చీ మడతపెట్టి..’ సాంగ్ ప్రోమో - ఆ బూతు మాటతో మహేష్ పాట, ఇరగదీసిన శ్రీలీల