Sailesh Kolanu Post About Hit 3 Movie After Court Hit Talk: 'కోర్ట్' (Court: The State Versus Nobody) సినిమా హిట్ కాకుంటే నా 'హిట్ 3' సినిమా చూడొద్దు.' ఇవి నేచురల్ స్టార్ నాని (Nani) 'కోర్ట్' మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్. ఆయన నిర్మాతగా వ్యవహరించిన.. యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) కీలక పాత్ర పోషించిన 'కోర్ట్' ఈ నెల 14 నుంచి థియేటర్లలో సందడి చేయనుంది. తాజాగా దీని పెయిడ్ ప్రీమియర్స్ ప్రదర్శించగా మంచి టాక్ సొంతం చేసుకుంది. దీనిపై 'హిట్ 3' డైరెక్టర్ శైలేష్ కొలను సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ చేశారు.
'నా సినిమా సేఫ్'
'కోర్ట్' మూవీ హిట్.. నా సినిమా సేఫ్' అంటూ శైలేష్ కొలను (Sailesh Kolanu).. మిర్చిలో ప్రభాస్ 'నా ఫ్యామిలీ సేఫ్' అని చెప్పే డైలాగ్ ఇమేజ్‌ను జత చేశారు. ఇది వైరల్‌గా మారింది. 'కోర్ట్' (Court) సినిమాలో ఎన్నో ఎమోషన్స్ ఉన్నాయి. ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది. అందరూ ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన చిత్రమిది. మూవీ యూనిట్‌కు నా అభినందనలు. ప్రియదర్శి.. నువ్వు మరో విజయం సాధించావు. ఇక నా 'హిట్ 3' ఎడిట్ రూమ్‌కు వెళ్లాలి. అందరూ కోర్ట్ సినిమా చూడండి' అంటూ తన 'X' ఖాతాలో పోస్ట్ చేశారు. కోర్ట్ హిట్ కాబట్టి నా 'హిట్ 3' (Hit 3) సినిమా సేఫ్ అంటూ ప్రభాస్ ఇమేజ్‌తో కలిపి షేర్ చేశారు.
హిట్ యూనివర్స్‌లో భాగంగా తెరకెక్కుతోన్న 'హిట్ 3: ద థర్ట్ కేస్' మూవీకి శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తుండగా.. నాని పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో అర్జున్ సర్కార్‌గా కనిపిస్తున్నారు. దీని టీజర్ ఇటీవలే విడుదల చేయగా.. వయలెన్స్, యాక్షన్ వేరే లెవల్ అంటూ మంచి రెస్పాన్స్ వచ్చింది. 24 గంటల్లోనే 16 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మూవీ మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే.. హిట్‌లో విశ్వక్ సేన్, హిట్ 2లో అడవి శేష్ పోలీస్ ఆఫీసర్స్‌గా నటించగా.. మంచి విజయాన్ని అందుకున్నాయి. ఈ మూవీ అంతకు మించి అనేలా రూపొందిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.
Also Read: ఆ ఓటీటీలోకి 'బ్రహ్మా ఆనందం' - ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందో తెలుసా?
'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడి' స్టోరీ ఏంటంటే..?
నేచురల్ స్టార్ నాని (Nani) వాల్ పోస్టర్ బ్యానర్ సమర్పణలో ప్రియదర్శి లీడ్ రోల్‌లో నటించిన 'కోర్ట్: ది స్టేట్ వర్సెస్ నోబడీ' (Court: The State Versus Nobody) ఈ నెల 14న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమాతో రామ్ జగదీశ్ దర్శకుడిగా మారగా.. ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. మూవీలో హర్ష రోషన్, శ్రీదేవి జంటగా నటించగా.. శివాజి, సాయికుమార్, హర్షవర్ధన్, రోహిణి తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. విడుదలకు ముందే పెయిడ్ ప్రీమియర్లు వేయగా.. సినిమా బాగుందంటూ నెట్టింట కామెంట్స్ చేస్తున్నారు. కోర్ట్ బ్యాక్ డ్రాప్‌లో పోక్సో యాక్ట్, చట్టాలపై అవగాహన కల్పించేలా తెరకెక్కిన చిత్రం ఇది.
ఇంటర్ ఫెయిలైన ఓ పేదింటి కుర్రాడు.. డబ్బున్న ఓ అమ్మాయితో ప్రేమలో పడతాడు. ఇది తెలిసి పరువునే ప్రాణంగా భావించే అమ్మాయి మామయ్య అతనిపై పోక్సో కేసు పెట్టిస్తాడు. తన అధికారం, డబ్బుతో అమ్మాయి మామయ్య ఏం చేశాడు..?, పేదింటి అబ్బాయి కుటుంబం అతన్ని రక్షించుకునేందుకు ఏం చేసింది.? యువ లాయర్ చొరవ ఆ కుర్రాడిని కాపాడిందా.? అనేదే కోర్ట్ అసలు స్టోరీ.