గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటూనే తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ సంపాదించుకున్న స్టార్ హీరోయిన్ సాయి పల్లవి (Sai Pallavi). పక్కింటి అమ్మాయిలా కన్పించే ఈ అమ్మడి క్యూట్ నెస్ కి ఎవ్వరైనా ఫిదా కావాల్సిందే. ఇక సినిమాలలో ఆమె సెలెక్ట్ చేసుకునే పాత్రలు కూడా అద్భుతంగా ఉంటాయి. సాయి పల్లవి ప్రస్తుతం వరుస హిట్స్ తో దక్కిన సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోంది. ఇక త్వరలోనే ఈ బ్యూటీ పాన్ ఇండియా హీరోయిన్ గా తెరపై మెరవబోతోంది. ఈ నేపథ్యంలోనే రీసెంట్ గా 'అమరన్' మూవీ తో బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టిన సాయి పల్లవి తన నెక్స్ట్ మూవీ కోసం రెమ్యూనరేషన్ భారీగా పెంచేసింది అని వార్తలు వినిపిస్తున్నాయి. 

రెమ్యూనరేషన్ పెంచిన సాయి పల్లవి? గత ఏడాది దీపావళి సందర్భంగా రిలీజ్ అయిన హిట్ మూవీ 'అమరన్' మూవీతో పలకరించింది సాయి పల్లవి. శివ కార్తికేయన్ హీరోగా నటించిన ఈ మూవీ భారీ కలెక్షన్లు రాబట్టింది. అందుకు సాయి పల్లవి కూడా ఒక కారణం. ప్రస్తుతం సాయి పల్లవి తండేల్' అనే పాన్ ఇండియా సినిమాలో నటిస్తోంది. ఈ మూవీలో నాగ చైతన్య హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే 'అమరన్' వరకు తక్కువ రెమ్యూనరేషన్ ఛార్జ్ చేసిన సాయి పల్లవి 'తండేల్' మూవీకి మాత్రం భారీగా పారితోషికం పెంచిందని టాక్ నడుస్తోంది. 

'అమరన్' మూవీకి కేవలం 3 కోట్లు పారితోషికంగా తీసుకున్న ఈ అమ్మడు, 'తండేల్' మూవీకి డబుల్ చార్జ్ చేస్తోందని తెలుస్తోంది. ఈ మూవీ కోసం రెమ్యూనరేషన్ పెంచి, 5 కోట్లు తీసుకుందని అంటున్నారు. ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉంది అనేది తెలియదు. కానీ గతంలో 'పడి పడి లేచే' వంటి కొన్ని సినిమాల కోసం తన పారితోషికాన్ని కూడా వదులుకున్న ట్రాక్ రికార్డు ఉంది సాయి పల్లవికి. ఇక ఆమె యాక్టింగ్, డాన్స్, మార్కెట్ దృష్టిలో పెట్టుకొని చూస్తే, 5 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకోవడం పెద్ద విషయమేమీ కాదని అంటున్నారు అభిమానులు. అంతేకాకుండా ఇప్పటి తరం హీరోయిన్లతో పోలిస్తే సాయి పల్లవి చాలా బెటర్ అనే టాక్ విన్పిస్తోంది. 

Also Read: మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో విలన్‌గా మలయాళ స్టార్ బదులు హిందీ యాక్షన్ హీరో?

సాయి పల్లవి పాన్ ఇండియా ప్రయాణం సాయి పల్లవి స్క్రీన్ పై తన సింపుల్ లుక్ తో, ఎక్స్ప్రెషన్, ఎమోషన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మిగతా హీరోయిన్ల కంటే డిఫరెంట్ గా, గ్లామర్ రోల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ స్టార్ హీరోయిన్ గా దూసుకెళ్తోంది. ఇక ప్రస్తుతం రిలీజ్ అవుతున్న 'తండేల్' మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ మూవీ ఫిబ్రవరి 14న తెరపైకి రాబోతోంది. ఈ మూవీతో పాటు సాయి పల్లవి కిట్టిలో నితీష్ తివారి తెరకెక్కిస్తున్న 'రామాయణం' అనే మరో పాన్ ఇండియా మూవీ కూడా ఉంది. ఇందులో సాయి పల్లవి సీతా దేవిగా కనిపించబోతోంది. అలాగే దుల్కర్ సల్మాన్ తో కలిసి సాయి పల్లవి 'ఆకాశంలో ఒక తార' అనే మరో ప్రాజెక్టులో నటించబోతోంది.

Also Readడాక్యుమెంటరీ వివాదంలో నయనతారకు షాక్... నెట్‌ఫ్లిక్స్ పిటిషన్ రిజెక్ట్ చేసిన కోర్ట్