సాయి పల్లవి... ఈ తరం కథానాయికల్లో చాలా అరుదైన ఇమేజ్, స్టార్ స్టేటస్ సొంతం చేసుకున్న తమిళ అమ్మాయి. సారీ... తనను తాను ఎప్పుడో ఎప్పుడో తెలుగు అమ్మాయిగా సాయి పల్లవి పేర్కొన్నారు. తెలుగు ప్రేక్షకులూ ఆమెను అలాగే చూస్తున్నారు. సాయి పల్లవికి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్ బేస్ ఉన్నాయి. ఒక సినిమా వేడుకలో దర్శకుడు సుకుమార్ ఆమెను 'లేడీ పవర్ స్టార్' అని పేర్కొన్నారు. అది నిజమేనని చాలా మంది అంటున్నారు. 'విరాట పర్వం' ప్రీ రిలీజ్ వేడుకలో కొంత మంది దాన్ని కంటిన్యూ చేశారు. అయితే... ఇప్పుడు ఆ ట్యాగ్ మీద సాయి పల్లవి స్పందించారు.


Sai Pallavi On Lady Power Star: 'మిమ్మల్ని లేడీ పవర్ స్టార్ అంటుంటే ఎలా అనిపిస్తుంది?' అని సాయి పల్లవిని తాజా ఇంటర్వ్యూలో అడగ్గా... ''అటువంటి వాటికి నేను కనెక్ట్ కాను. ఎందుకంటే... నా దృష్టిలో అలా పిలవడం కరెక్ట్ కాదు. ప్రేక్షకులు నాపై చూపించే ప్రేమ, అభిమానాన్ని మాత్రమే స్వీకరిస్తా. నేను చేస్తున్న పాత్రల కారణంగా ప్రేక్షకులు నన్ను అభిమానిస్తున్నారు. అందుకని, పాత్రల ఎంపికలో నేను జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. లేడీ పవర్ స్టార్ వంటి వాటిని తలకు ఎక్కించుకుంటే నాపై ఒత్తిడి పెరుగుతుంది'' అని అన్నారు.


Also Read : స్విస్, ఫ్రాన్స్ to గ్రీస్ - ప్రగ్యా జైస్వాల్ టూర్ ఫొటోస్, వీడియోస్ చూశారా?


సాయి పల్లవి నటించిన తాజా చిత్రం 'విరాట పర్వం' ఇటీవల విడుదల అయ్యింది. అందులో ఆమె పాత్రకు, నటనకు మంచి పేరు వచ్చింది. సినిమా విడుదలకు ముందు ఈ సినిమాలో నటనకు గాను ఆమెకు జాతీయ పురస్కారం వస్తుందని విక్టరీ వెంకటేష్ అన్నారు. 


Also Read : రామ్ చరణ్‌కు మాస్ హిట్ ఇచ్చిన దర్శకుడితో సాయి తేజ్ కొత్త సినిమా