రెబల్ స్టార్ కాదు... రొమాంటిక్ స్టార్... కాదు కాదు మన రొమాంటిక్ డార్లింగ్ ఈజ్ బ్యాక్ అంటున్నారు ఇండియాస్ బిగ్గెస్ట్ సూపర్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. ఆయన కొత్త సినిమా 'ది రాజా సాబ్' (The Raja Saab Movie) నుంచి తాజాగా విడుదల అయిన 'సహానా సహానా' పాట (Sahana Sahana Song) చూస్తే మీరు ఆ మాటే అంటారేమో!?
లవ్లీ & రొమాంటిక్‌గా ప్రభాస్ పాట!'ది రాజా సాబ్' నుంచి ఇంతకు ముందు 'రెబల్ సాబ్...' సాంగ్ విడుదల అయ్యింది. అది డాన్స్ నెంబర్. హీరో ఇంట్రడక్షన్ సాంగ్ అనుకోవచ్చు. ఇప్పుడు విడుదల చేసిన 'సహానా సహానా...' పాట రొమాంటిక్ డ్యూయెట్.
ప్రభాస్ (Prabhas New Movie Songs)తో పాటు నిధి అగర్వాల్ మీద 'సహానా సహానా...' పాటను తెరకెక్కించారు. యూరప్ లోని అందమైన ప్రదేశాలలో షూటింగ్ చేసినట్లు లిరికల్ వీడియో చూస్తుంటే అర్థం అవుతోంది. ఈ పాటకు తమన్ మంచి మెలోడియస్ ట్యూన్ అందించారు.
'సహానా సహానా' పాటలో ప్రభాస్ చాలా అందంగా కనిపించారు. ఆ అందాన్ని మించి గ్రేస్ & ఎనర్జీతో సింపుల్ స్టెప్స్ వేశారు. ఆయనకు జంటగా నిధి అగర్వాల్ అందంగా కనిపించింది. ఇద్దరి మధ్య కెమిస్ట్రీ బాగుంది. ఈ సాంగ్ ఇన్స్టంట్ చార్ట్ బస్టర్ అవుతుందని చెప్పవచ్చు.
సంక్రాంతి బరిలో 'ది రాజా సాబ్'The Raja Saab Release Date: సంక్రాంతి సందర్భంగా జనవరి 9న 'ది రాజా సాబ్' సినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో భారీ ఎత్తున సినిమా విడుదల అవుతోంది. మారుతి దర్శకత్వం వహించిన ఈ హారర్ ఎంటర్టైనర్‌ను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకం మీద టీజీ విశ్వప్రసాద్, ఆయన కుమార్తె కృతి ప్రసాద్ ప్రొడ్యూస్ చేశారు.
ప్రభాస్ సరసన నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటించారు. బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ కీలక పాత్ర పోషించిన ఈ సినిమాలో సప్తగిరి, వీటిని గణేష్ తదితరులు ఇతర ప్రధాన తారాగణం. హారర్ కామెడీ సినిమాలకు హిందీలోనూ ఇటీవల ఆదరణ బావుంది. తెలుగులో చెప్పాల్సిన అవసరం లేదు ఇంతకుముందు ప్రేమ కథ చిత్రం వంటి హారర్ ఫిలిం తీసి హిట్ చేసిన ఘనత మారుతి సొంతం. అందువల్ల ఈ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి.