బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మ (Anushka Sharma), టీమిండియా స్టార్ క్రికెటర్ - ఆమె భర్త విరాట్ కోహ్లీ (Virat Kohli)ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చూశాక ఈ జంటను చాలా మంది ట్రోల్ చేస్తున్నారు. వాస్తవానికి... ప్రేమానంద్ జీ మహారాజ్ ఆశ్రమం శ్రీ హిత్ కుంజ్, రాధా కేరాహ్ దర్శనం తర్వాత ముంబై విమానాశ్రయంలో అనుష్క, విరాట్ కనిపించారు. ఆ సమయంలో వారు అభిమానులతో దురుసుగా ప్రవర్తించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ సెలబ్రిటీ కపుల్ మీద ట్రోల్స్ వచ్చాయి.
అనుష్క - విరాట్ ట్రోల్ అవ్వడానికి కారణం ఏమిటంటే?సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ వీడియోలో... వాళ్ళిద్దరూ కట్టుదిట్టమైన భద్రత మధ్య రద్దీగా ఉండే విమానాశ్రయ టెర్మినల్ నుంచి వెళుతున్నట్లు కనిపిస్తున్నారు. తమ కారు వైపు వెళుతుండగా... ఓ వికలాంగుడు ఫోటో దిగడానికి, వారి దగ్గరకు రావడానికి ప్రయత్నించాడు. సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేశాడు. అయితే... చుట్టుముట్టిన కెమెరాలు, అభిమానుల కోలాహలం, భద్రతా సిబ్బంది హడావిడి మధ్య సెల్ఫీ ఇవ్వడానికి ఈ జంట ఆగలేదు. భద్రతా సిబ్బంది ఆ వికలాంగుడిని పక్కకు నెట్టారు. క్రికెటర్ విరాట్ తన కారు వైపు నడుస్తూనే ఉన్నాడు. ఆయన ప్రవర్తన కారణంగా ఇప్పుడు చాలా ట్రోల్ అవుతున్నారు.
విరాట్ కోహ్లీ అనుష్క శర్మ ప్రవర్తనతో అభిమానుల నిరాశవిరాట్ - అనుష్క ఎయిర్ పోర్ట్ వీడియో వైరల్ అయిన తర్వాత చాలా మంది నెటిజన్లు ఈ జంటపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వాళ్ళకు సున్నితత్వం లేదని ఆరోపించారు. "ఇది చాలా చెడు ప్రవర్తన" అని ఒకరు, "పాపం పిల్లవాడితో ఎంత చెడుగా ప్రవర్తించారు" అని మరొకరు, "ప్రేమానంద్ మహారాజ్ జీని కలిసినట్లు అనిపించడం లేదు" అని ఇంకొకరు రాశారు. "అంత అహంకారం మంచిది కాదు" అని మరొకరు పేర్కొన్నారు.
అదే సమయంలో, ఈ సంఘటనపై ట్రోల్ అవుతున్న అనుష్క, విరాట్ ఇప్పటివరకు దీనిపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.