తెలుగు చలన చిత్ర పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. యువ దర్శకుడు హఠాన్మరణం చెందారు. సుమారు 15 ఏళ్ల తర్వాత మెగా ఫోన్ పట్టిన కిరణ్ కుమార్, కొత్త సినిమా విడుదలకు మృతి చెందడం పలువురిని బాధకు గురి చేసింది. వివరాల్లోకి వెళితే....
నాగార్జున కేడి దర్శకుడు ఇక లేరుకింగ్ అక్కినేని నాగార్జున కథానాయకుడిగా నటించిన 'కేడి' సినిమా గుర్తుందా? 15 ఏళ్ల క్రితం... అంటే 2010లో ఆ సినిమా విడుదల అయింది. ఆ చిత్రానికి కిరణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆయన ఇకలేరు. ఈ రోజు ఆయన తుది శ్వాస విడిచారు.
కిరణ్ కుమార్ కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యలతో సతమతం అవుతున్నారు. 15 ఏళ్ల విరామం తర్వాత 'కేజేక్యూ' (కింగ్... జాకీ... క్వీన్) సినిమా ప్రారంభించారు కొంత చిత్రీకరణ చేసిన తర్వాత ఆయన ఆరోగ్యం బారిన పడ్డారు. దాంతో చిత్రీకరణకు అంతరాయం ఏర్పడింది. ఆ తర్వాత కిరణ్ కోలుకోవడంతో కొన్ని రోజుల క్రితం మళ్లీ చిత్రీకరణ ప్రారంభించి పూర్తి చేశారు. ప్రస్తుతం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. 'కేజేక్యూ' విడుదలకు ముందు దర్శకుడు కిరణ్ కుమార్ మరణం చిత్ర బృందాన్ని కలచివేసింది
నటుడిగాను మెప్పించిన కిరణ్!కిరణ్ కుమార్ దర్శకుడు మాత్రమే కాదు... ఆయనలో ఒక నటుడు కూడా ఉన్నారు. కోలీవుడ్ హీరో అండ్ సంగీత దర్శకుడు విజయ్ ఆంటోని కథానాయకుడిగా నటించిన 'భద్రకాళి' సినిమాలో ఒక కీలకపాత్ర పోషించారు. ఆ సినిమాలో కిరణ్ కుమార్ నటనకు ప్రశంసలు లభించాయి. ఈ ఏడాది 'భద్రకాళి' విడుదలైంది.
Also ReadAlso Read: The Raja Saab BO Prediction: హిందీలో 'రాజా సాబ్' క్రేజ్ ఎలాగుంది? అక్కడ ప్రభాస్ హారర్ కామెడీ ఫస్ట్ డే ఎంత కలెక్ట్ చేయవచ్చు?