హీరోయిన్ ప్రీతి జింటా (Preity Zinta) సినిమాల్లో నటించడమే కాకుండా క్రీడల్లో కూడా ఆసక్తి చూపిస్తారు. ఆమె ఐపీఎల్ జట్టు పంజాబ్ కింగ్స్ (Punjab Kings IPL Team)కు యజమాని. ప్రీతి జట్టు పంజాబ్ కింగ్స్ ఐపీఎల్ 2025లో ఫైనల్స్ వరకు చేరుకుంది. సినిమాల్లో నటించడం వల్లే కాదు... ఐపీఎల్ ద్వారా ఈ హీరోయిన్ భారీగా సంపాదిస్తున్నారు. ఆమె నికర ఆస్తి ఎంత ఉందో తెలుసుకుందాం.

Continues below advertisement

ఐపీఎల్ ద్వారా ప్రీతి జింటా సంపాదనప్రీతి జింటా ఐపీఎల్ ద్వారా భారీగా సంపాదిస్తున్నారు. ఐపీఎల్ టికెట్ల అమ్మకం ద్వారా ఆమె భారీగా ఆర్జిస్తున్నారు. ఐపీఎల్ జట్టు యజమానులకు 80 శాతం వరకు వాటా లభిస్తుంది. దీనితో పాటు ఆమె స్పాన్సర్ షిప్ ద్వారా కూడా సంపాదిస్తున్నారు.

ప్రీతి జింటా 2008లో పంజాబ్ కింగ్స్ కు సహ యజమానిగా మారారు. 2008లో ఈ జట్టును 76 మిలియన్ డాలర్లకు కొనుగోలు చేశారు. 2022లో ఈ విలువ 925 మిలియన్ డాలర్లకు పెరిగింది. 2008లో ప్రీతి ఈ జట్టులో 35 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఇప్పుడు మనీ కంట్రోల్ నివేదిక ప్రకారం, ఆ జట్టు పెట్టుబడి విలువ 350 కోట్లకు పెరిగింది.

Continues below advertisement

Also Read: విజయ్ దేవరకొండతో పెళ్ళికి ముందు రష్మిక బ్యాచిలర్ పార్టీ?

ప్రీతి జింటా ఆస్తి ఎంతో తెలుసా?

ప్రీతి జింటా హిందీ చిత్ర పరిశ్రమలో పెద్ద హీరోయిన్ అనేది తెలిసిన విషయమే. తెలుగు సినిమాలు కొన్నిటిలోనూ ఆమె నటించారు. ప్రీతి ఇప్పుడు విలాసవంతమైన జీవితాన్ని ఆనందిస్తున్నారు. ఓ ప్రముఖ ఇంగ్లిష్ దినపత్రిక నివేదిక ప్రకారం ఆమె నికర ఆస్తి రూ 183 కోట్లు. ప్రీతి ఒక బ్రాండ్ ను ఎండార్స్ చేయడానికి 1.5 కోట్ల రూపాయలు వసూలు చేస్తారని సమాచారం. ఆమె నటన, బ్రాండ్ ఎండార్స్మెంట్, వ్యాపారం ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. ప్రీతికి ముంబైలో 17 కోట్ల రూపాయల ఇల్లు కూడా ఉంది. దీనితో పాటు ఆమెకు సిమ్లాలో కూడా మరొక ఇల్లు ఉంది. ఆ ఇంటి ధర 7 కోట్ల రూపాయలు అని టాక్.

Also ReadThe Raja Saab BO Prediction: హిందీలో 'రాజా సాబ్' క్రేజ్ ఎలాగుంది? అక్కడ ప్రభాస్ హారర్ కామెడీ ఫస్ట్‌ డే ఎంత కలెక్ట్‌ చేయవచ్చు?

జీన్ గుడ్ఎనఫ్ ను ప్రీతి వివాహం చేసుకున్నారు. ఆమె తన భర్తతో కలిసి లాస్ ఏంజిల్స్ లో నివసిస్తున్నారు. ఆమెకు బెవర్లీ హిల్స్ లో కూడా బంగ్లా ఉంది. ప్రీతి ఇద్దరు పిల్లలకు తల్లి కూడా. సినిమాలకు వస్తే... త్వరలో ప్రీతిని లాహోర్ 1947 సినిమాలో చూడవచ్చు. ఆ సినిమాలో ఆమె సన్నీ డియోల్ సరసన కనిపించనున్నారు. ఆ సినిమాను ఆమిర్ ఖాన్ నిర్మిస్తున్నారు. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహిస్తున్నారు.