విజయ్ దేవరకొండతో 2026లో నేషనల్ క్రష్ - స్టార్ హీరోయిన్ రష్మికా మందన్నా (Rashmika Mandanna) ఏడు అడుగులు వేయనున్నారు. ఇప్పటి వరకు ఈ స్టార్ కపుల్ తమకు ఎంగేజ్మెంట్ అయిన విషయం అనౌన్స్ చేయలేదు. కానీ, అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్ అది. పెళ్ళికి ముందు స్నేహితులకు బ్యాచిలర్ పార్టీ ఇవ్వడం కొందరికి అలవాటు. ఇప్పుడు రష్మిక సైతం అదే పని చేశారా? అని ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రముఖులతో పాటు ప్రేక్షకులకూ సందేహాలు కలుగుతున్నాయి. ఆ సందేహానికి కారణం ఏమిటంటే?
శ్రీలంక వెళ్లిన రష్మిక... వెంట గాళ్స్ గ్యాంగ్!ఇటీవల తనకు రెండు రోజులు ఆఫ్ దొరికిందని (అంటే షూటింగుల నుంచి విరామం), వెంటనే గాళ్స్ తో కలిసి శ్రీలంక వెళ్లానని, ఇందులో కొంత మంది మిస్ అయ్యారని, షార్ట్ ట్రిప్ అయినా బెస్ట్ ట్రిప్ అని సోషల్ మీడియాలో రష్మిక ఓ పోస్ట్ చేశారు. అందులో కొన్ని ఫోటోలు ఉన్నాయి.
ప్రముఖ స్టైలిస్ట్, రామ్ గోపాల్ వర్మ మేనకోడలు శ్రావ్య వర్మ తెలుసుగా... రష్మిక సన్నిహిత మిత్రులలో ఆమె ఒకరు. దేవరకొండ ఇంటికి కాబోయే కోడలితో పాటు శ్రీలంక వెళ్లిన అమ్మాయిలలో ఆవిడ కూడా ఉన్నారు. అలాగే యంగ్ హీరోయిన్ వర్షా బొల్లమ్మ, మరొక ఇద్దరు మహిళలు ఉన్నారు. స్నేహితులతో కలిసి, అదీ కేవలం మహిళలతో కలిసి రష్మిక వెళ్లడంతో ఇదొక బ్యాచిలర్స్ ట్రిప్ అయ్యి ఉంటుందని భావిస్తున్నారంతా!
రష్మిక సినిమాల విషయానికి వస్తే... 2025లో ఆవిడ నటించిన ఐదు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. అందులో సల్మాన్ ఖాన్ 'సికిందర్' ఫ్లాప్ అయినప్పటికీ మిగతా నాలుగూ మంచి రిజల్ట్స్ అందుకున్నాయి. అందులో హిందీ 'ఛావా', తమిళ - తెలుగు 'కుబేర', రాహుల్ రవీంద్రన్ 'ది గర్ల్ ఫ్రెండ్' సినిమాలు విమర్శకుల ప్రశంసలతో పాటు ప్రేక్షకుల మన్ననలు అందుకున్నాయి.