Balakrishna's Akhanda 2 Thaandavam Success Meet Update: గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణతో పాటు దర్శకుడు బోయపాటి శ్రీను సైతం 'అఖండ 2 తాండవం' విజయం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్ సిటీలో 'అఖండ 2' బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు. ఇప్పుడు ఏపీలోనూ ఓ సక్సెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.

Continues below advertisement

అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్Akhanda 2 success meet - Amaravathi: అమరావతిలో 'అఖండ 2 తాండవం' సక్సెస్ మీట్ నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నెల 18న... అంటే గురువారం ఏపీ రాజధానిలో సక్సెస్ మీట్ జరుగుతుందని తెలిసింది. 

Also Read: Jai Akhanda: 'జై అఖండ'కు కొత్త నిర్మాతలు... 14 రీల్స్ ప్లస్ నుంచి మరొకరికి!

Continues below advertisement

ఏపీ ప్రభుత్వంలో పెద్దలు కొందరు అమరావతిలో 'అఖండ 2' సక్సెస్ మీట్‌కు అటెండ్ అయ్యే అవకాశం ఉంది. సనాతన ధర్మం నేపథ్యంలో ఈ సినిమా రూపొందిన నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తే బావుంటుందని కొందరి ఆలోచన. మరి వర్కవుట్ అవుతుందో? లేదో? వెయిట్ అండ్ సి. 

వీకెండ్ తర్వాత వసూళ్లు కొంత తగ్గినా?'అఖండ 2 తాండవం'కు ప్రీమియర్స్ నుంచి మంచి టాక్ వచ్చింది. మొదటి రోజు భారీ వసూళ్లు వచ్చాయి. బాక్స్ ఆఫీస్ బరిలో 60 కోట్ల రూపాయలు కలెక్ట్ చేసింది. ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు వచ్చాయి. అయితే వీకెండ్ తర్వాత కొంత తగ్గాయి. సాధారణంగా ఏ సినిమాకు అయినా సరే సోమవారం నుంచి వసూళ్లు తగ్గుతాయి. అది పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ప్రేక్షకుల నుంచి సినిమాకు మంచి ఆదరణ లభిస్తోంది. 

'సింహ', 'లెజెండ్', 'అఖండ' తర్వాత 'అఖండ 2 తాండవం'తో బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో మరో బ్లాక్ బస్టర్ వచ్చింది. డబుల్ హ్యాట్రిక్ సినిమాకు శ్రీకారం చుట్టారు. దీని తర్వాత 'జై అఖండ' చేయనున్నారు. అది ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? అనేది తెలియాల్సి ఉంది.

Also ReadPawan Kalyan Gift To Sujeeth: 'ఓజీ' దర్శకుడికి పవన్ కళ్యాణ్ ఖరీదైన గిఫ్ట్... ఆ కారు రేటు ఎంతో తెలుసా?