Bad News Suriya Fans : కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ హీరో నటించిన 'కంగువ' షూటింగ్ పూర్తి చేసుకుని ప్రమోషన్ కార్యక్రమాలను మొదలు పెట్టుకోబోతోంది. ఈ సినిమా తర్వాత లేడీ డైరెక్టర్ సుధా కొంగరతో సూర్య ఓ సినిమా చేయనున్న విషయం అందరికీ తెలిసిందే. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన 'సూరారై పోట్రూ' బాక్స్ ఆఫీస్ వద్ద ఘన విజయం సాధించింది. తమిళంలోనే కాదు తెలుగులోనూ 'ఆకాశం నీ హద్దురా' పేరుతో విడుదలై సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు వీళ్ళిద్దరి కాంబినేషన్లో మరో సినిమా రాబోతుండడంతో ఈ ప్రాజెక్టు పై భారీ అంచనాలు నెలకొన్నాయి. సినిమాకి 'పురాణానూరు' అనే టైటిల్ ఖరారు చేశారు. కాగా మొదట 2024 లోనే ఈ ప్రాజెక్టుని విడుదల చేయాలని మూవీ టీం భావించగా.. తాజా సమాచారం ప్రకారం ఈ మూవీ రిలీజ్ విషయంలో ఫ్యాన్స్ మరింత కాలం వేచి చూడక తప్పదని మూవీ టీమ్ స్వయంగా వెల్లడించింది. 


'పురాణానూరు' కోసం మరింత సమయం కావాలి


సుధా కొంగర - సూర్య కాంబినేషన్లో తెరకెక్కుతున్న 'పురాణానూరు' సినిమాని ఇదే ఏడాది విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ కొన్ని అనివార్య కారణాలవల్ల ఈ ప్రాజెక్ట్ కి ఎంత టైం పడుతుందని మూవీ టీం అధికారికంగా వెల్లడించింది. ఈ మేరకు హీరో సూర్య తన ట్విట్టర్ వేదికగా ఓ స్పెషల్ నోట్ ని రిలీజ్ చేశారు. "పురాణానూరు సినిమా కోసం మరింత సమయం కావాలి. ఈ కాంబినేషన్ చాలా స్పెషల్ అందుకే బెస్ట్ కంటెంట్ ఇవ్వడం కోసం ఎంతగానో కృషి చేస్తున్నాం. అతి త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రొడక్షన్ పనులను మొదలు పెడతాం. మీ లవ్ అండ్ సపోర్ట్ కి మా కృతజ్ఞతలు" అంటూ ఆ నోట్ లో పేర్కొన్నారు.


కాలేజీ స్టూడెంట్ గా సూర్య


సుధా కొంగర సినిమాలో సూర్య కాలేజీ స్టూడెంట్ గా కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది. సినిమాలో వచ్చే కొన్ని సన్నివేశాల్లో సూర్య స్టూడెంట్ గా కనిపిస్తారట. ఈ ఎపిసోడ్ కోసం సూర్య బరువు కూడా తగ్గనున్నట్లు సమాచారం. సినిమాలో ఈ సీన్స్ ని సుధ కొంగర చాలా స్పెషల్ గా డిజైన్ చేసినట్లు తెలుస్తోంది.


కీలక పాత్రల్లో మళయాళ స్టార్స్


'పురాణానూరు' సూర్య కెరియర్లో 43వ సినిమాగా తెరకెక్కుతోంది. ఈ సినిమా కోసం డైరెక్టర్ సుధా కొంగర భారీ కాస్టింగ్ ని తీసుకున్నారు. ఈ సినిమాలో సూర్యతోపాటు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, మలయాళ హీరోయిన్ నజ్రియా నజీమ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇదే విషయాన్ని వాళ్ళిద్దరూ సోషల్ మీడియా ద్వారా అనౌన్స్ చేశారు. వీళ్ళిద్దరితోపాటు బాలీవుడ్ యంగ్ యాక్టర్, తమన్నా బాయ్ ఫ్రెండ్ విజయ్ వర్మ ఇందులో విలన్ రోల్ చేస్తున్నారు. జీవి ప్రకాష్ కుమార్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. సంగీత దర్శకుడిగా జీవి ప్రకాష్‌కు ఇది 100వ సినిమా కావడం విశేషం.


Also Read : అనుపమ 'ఆక్టోపస్' రీ-షెడ్యూల్? 'హను-మాన్' డైరెక్టర్ నెక్స్ట్ మూవీ 'జై హనుమాన్' కాదా?