Bharateeyudu 2 movie: తమిళ స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన దర్శకత్వంలో సినిమా అంటే ఓ రేంజ్‌లో ఎక్స్‌పెక్టేషన్స్‌ ఉంటాయి. దానికి తోడు విశ్వనటుడు కమల్‌ హాసన్‌తో కాంబినేషన్‌ అంటే ఆ మూవీకి ఉండే బజ్‌ వేరు. ఎక్కడ చూసి ఆ మూవీ గురించి టాక్‌ వినిపిస్తుంది. ఇక ఆ సినిమాను నుంచి వచ్చే అప్‌డేట్స్‌, గాసిప్స్‌ మూవీపై ఎక్స్‌పెక్టేషన్స్‌ని పీక్స్‌ తీసుకువెళతాయి. కానీ 'భారతీయుడు 2' విషయంలో అవేవి కనిపించడం లేదు. విక్రమ్‌ లాంటి బ్లాక్‌బస్టర్‌ తర్వాత కమల్‌ నటిస్తున్న చిత్రమంటే  ఈ క్రేజ్‌ వెరేలా ఉంటుంది.


దానికంటే ముందు ఒకప్పుడు సెన్సేషనల్‌ హిట్‌ చిత్రానికి సీక్వెల్‌ ఇది. 1996 సంవత్సరంలో శంకర్‌-కమల్‌ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తెలుగు, తమిళంలో విడుదలైన ఈ సినిమా ఊహించని రేంజ్‌లో వసూళ్లు చేసి ట్రెండ్‌ సెట్టర్‌గా నిలిచింది. అప్పట్లోనే ఈ చిత్రం రూ.50 కోట్లకు పైగా గ్రాస్‌ వసూళ్లు చేసి నిర్మాతలకు డబుల్‌ ప్రాఫిట్స్‌ ఇచ్చింది. అప్పట్లో ఎక్కడ చూసిన భారతీయుడు బజే కనిపించింది. దాదాపు 28 ఏళ్లకు ఈ చిత్రానికి సీక్వెల్‌ ప్రకటించారు. ప్రకటనతో భారతీయుడు 2పై విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయ్యింది. కానీ అదేది ఇప్పుడు కనిపించడం లేదు. మూవీ షూటింగ్‌ పూర్తయ్యింది.. రిలీజ్‌కు రెడీ అవుతుంది.


కానీ శంకర్-కమల్‌ లాంటి సినిమా అనిపించేంత బజ్‌ కనిపించడం లేదు, వినిపించడం లేదు. దీంతో ఇది అసలు శంకర్‌ సినిమానేనా అనే ఆశ్చర్యం వేస్తోంది. ఇక సినిమా నుంచి వచ్చిన అప్‌డేట్స్‌ కూడా పెద్దగా ఆకట్టుకోవడం లేదు. దీంతో ఫ్యాన్స్‌లో ఆందోళన మొదలైంది. ఈ సినిమా ఎలాంటి రిజల్ట్‌ ఇస్తుందా అని వర్రీ అవుతున్నారట.  నిజానికి భారతీయుడు 2 చిత్రానికి ముందు నుంచి ఆటంకాలే. షూటింగ్‌ మొదలుకాగానే సెట్స్‌లో‌ ప్రమాదం, ప్రొడక్షన్‌ బాయ్‌ చనిపోవడంతో మూవీకి బ్రేక్‌ పడింది. ఇక సినిమా మొత్తాని నిలిపేయాలని అనుకున్నాడు శంకర్. కానీ నిర్మాతలు ఫోర్స్‌తో షూటింగ్‌ మళ్లీ మొదలైంది. అది కోర్టు, కేసుల వివాదాల అనంతరం. ఇక అప్పటికే శంకర్‌ రామ్‌ చరణ్‌తో గేమ్‌ ఛేంజర్‌ షూటింగ్‌ స్టార్ట్‌ చేశాడు.


ఇక రెండు సినిమాలను వాయిదాల మీద వాయిదాలతో షూటింగ్‌ని ముందుకు నడిపించాడు. షూటింగ్‌ ఆలస్యం వల్ల విడుదల తేదీ కూడా పలుమార్లు వాయిదా పడుతూ వచ్చింది. దీంతో మూవీ ఆసక్తి కూడా క్రమంగా తగ్గుతుంది. ఇటీవల మూవీ ఆడియో లాంచ్‌ని ఈవెంట్‌ని కూడా నిర్వహించారు. కానీ పెద్దగా బజ్‌ లేదు. ఇప్పటికి రెండు పాటలు విడుదలైన అవేవి మూవీకి ప్లస్‌ అయ్యేలా కనిపించడం లేదు. అనిరుధ్‌ లాంటి స్టార్‌ మ్యూజిక్‌ డైరెక్టర్‌ సంగీతంలో వచ్చినా పాటలు పెద్దగా ఆకట్టుకోవడం లేదు. తమిళ వెర్షన్స్‌ బెటర్‌ అనిపించినా.. తెలుగు వెర్షన్‌ మాత్రం మరి దారుణంగా అనిపిస్తుంది. ఇటీవల తాత వచ్చాడు పాట రిలీజైంది. కానీ ఈ పాట ఎక్కడ వినిపించడం లేదు. దీంతో ఇది కమల్‌ లాంటి లెజెండరి నటుడి చిత్రమేనా అనే అని అంతా ఆశ్చర్యం పడుతున్నారు.


పైగా ఈ సినిమాకు మరో సీక్వెల్‌ కూడా ఉందని ఆడియో లాంచ్‌లో శంకర్‌ వెల్లడించడం.. పైగా హీరోయిన్ కాజల్‌‌ కూడా సీక్వెల్‌ కనిపించలని, పార్ట్‌ 3లో కనిపిస్తుందని చెప్పడంతో ఆమె ఫ్యాన్స్‌ ఆశలపై నీళ్లు చల్లినట్టు అయ్యింది. అప్పటి నుంచి సీక్వెల్‌లో కమల్‌ హాసన్‌ చివరిక వరకు కనిపించడనే రూమర్‌ వినిపిస్తుంది. క్లైమాక్స్‌ వరకూ రాడన్న ప్రచారం జరుగుతుంది. ఇది ఫ్యాన్స్‌ని మరింత నిరాశకు గురి చేస్తుంది. ఇలా మూవీ నుంచి వస్తున్న అప్‌డేట్స్‌, రూమర్స్‌ భారతీయుడు 2పై ఎలాంటి బజ్‌ లేకుండ చేస్తున్నాయి. మరి శంకర్‌ ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో చూడాలి. ఇకనైనా మెల్కోని టీజర్, ట్రైలర్‌లో అయిన ఆయన మ్యాజిక్‌ చూపిస్తే తప్ప భారతీయుడు 2పై బజ్‌ రాదంటున్నారు ఆడియన్స్‌