Kriti Shetty Shocking Comments Movie Hits and Flops: 'ఉప్పెన'తో హీరోయిన్‌గా టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది కృతి శెట్టి. ఇందులో బేబమ్మగా తనదైన నటన, అందంతో ఆకట్టుకుంటుంది. డెబ్యూ చిత్రంతోనే వంద కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మూవీ బ్లాక్‌బస్టర్‌ హిట్‌ కావడంతో కృతి లక్కీ లెగ్‌గా ముద్ర వేసుకుంది. ఆ తర్వాత శ్యామ్‌ సింగరాయ్‌, బంగర్రాజు చిత్రాలతో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన కృతికి తెలుగులో స్టార్‌ హీరోయిన్ మారింది. వరుస హిట్స్‌ కెరీర్‌లో దూసుకుపోతున్న ఈ బేబమ్మకు 'ది వారియర్‌' మూవీకి బ్రేక్‌ వేసింది.


ఎన్నో అంచనాలతో మధ్య తెరకెక్కిన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఆ తర్వాత ఆమె నటించిన సినిమాలన్ని వరుసగా పరాజయం కావడంతో కృతికి ఆఫర్లు కరువయ్యాయి. దీంతో తెలుగులో ఈ బేబమ్మ సందడి కరువైంది. చాలా గ్యాప్‌ తర్వాత 'మనమే' సినిమాతో ప్రేక్షకులను పలకరించింది. ఇందులో శర్వానంద్‌ జోడిగా జతకట్టింది. ఈ సినిమా జూన్‌ 7న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో కృతి మూవీ డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య కలిసి ప్రమోషన్స్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా ఓ చానల్‌కు ఇచ్చిన ఇంటర్య్వూలో మూవీ హిట్‌,ప్లాప్స్‌పై ప్రశ్న ఎదురైంది. దీనికి డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య స్పందిస్తూ ఫస్ట్‌ షాట్‌లోనే ఈ మూవీ ఎలా రిజల్ట్‌ ఎలా ఉంటుందో తెలిసిపోతుందన్నారు.


వారి యాక్టింగ్‌, సీన్‌ వచ్చిన తీరు బట్టి చూసి అంచన వేయగలం అన్నారు. ఇక కృతి స్పందిస్తూ.. "అవును నేను కూడా అదే చెప్పాలకుంటున్నా. ఒక మూవీ హిట్‌ అవ్వాలంటే ఒక అద్భుతం జరిగాలి. కానీ అది అన్ని సినిమాలకు వర్కౌట్‌ కాదు. దానికి పర్టిక్యూలర్‌ థింగ్‌ అంటూ ఏం ఉండదు. స్క్రీన్‌పై చూస్తున్నప్పుడు దాన్ని మనం ఫీల్‌ అవుతాం" అంటూ చెప్పుకొచ్చింది. అలాగే మీ సినిమా విషయంలో అలాగే ఆలోచిస్తారా? ప్రమోషన్స్‌ చేస్తున్నప్పుడు ఈ మూవీ హిట్‌ అవుతుందా లేదా అని జడ్జీ చేస్తారా? అని యాంకర్‌ ప్రశ్నించగా.. కృతి స్పందిస్తూ.. "నేను ఎప్పుడు అలా ఆలోచించను. రిలీజ్‌కి ముందే మూవీ హిట్టా, ఫట్టా అనేది చెప్పలేం.


Also Read: కాజల్‌ అగర్వాల్‌ 'సత్యభామ' వచ్చేది ఈ ఓటీటీలోనే- రెండు భాషల్లో స్ట్రీమింగ్‌, ఎప్పుడు.. ఎక్కడంటే..


మూవీ రిజల్ట్‌ అనేది బేబీ లాంటింది. ముందే మనం ప్రిడిక్ట్‌ చేయలేం. నా వరకు నేను ఎప్పుడు మూవీ రిజల్ట గురించి ఆలోచించను. మూవీ చేస్తున్నంత సేపు పాజిటివ్‌గా  తీసుకుంటూ ముందు వెళతాను. నా సైడ్‌ నుంచి పాజిటివ్‌ ఎనర్జీని మాత్రమే ఇస్తాను. ఇక మూవీ రిజల్ట్‌ అనేది నా చేతుల్లో లేదు. మన చేతుల్లో లేని దాని గురించి మనం టెన్షన్‌ పడటం వేస్ట్‌. మన  కానీ వీలైనంత వరకు మన ఎఫర్ట్స్‌ అనేవి ఇస్తూ ముందుకు వెళ్లాలి. ఒకవేళ నేను ఈ సినిమా అంతగా వర్కౌట్‌ కాదు అని నేను అనుకున్న కూడా దాన్ని మార్చలేం కదా. మన చేతుల్లో లేని దాని గురించి వర్రీ అవ్వడం వేస్ట్‌. అందుకే అలా ఆలోచించకుండ పాజిటివ్‌ ఎనర్జీతో ముందుకు వెళతాను. మూవీకి కూడా నా నుంచి పాజిటివ్‌ ఎనర్జీ ఇస్తాను" అని పేర్కొంది. ‌