Kajal Aggarwal Satyabhama OTT Partner and Streaming Details: టాలీవుడ్‌ 'చందమామ' కాజల్‌ అగర్వాల్‌ లీడ్ రోల్లో నటించిన లేటెస్ట్‌ మూవీ 'సత్యభామ' (Satyabhama Movie). మిస్టరి, థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా జూన్‌ 7న థియేటర్లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విడుదలైన ఫస్ట్‌ షో నుంచి పాజిటివ్‌ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా తొలి రోజే రూ. కోటికిపైగ గ్రాస్‌ వసూళ్లు చేసింది. కొత్త డైరెక్టర్‌ సుమన్‌ చిక్కాల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో నవీన్‌ చంద్ర(Naveen Chandra), ప్రకాశ్‌ రాజ్‌లు కీలక పాత్రలు పోషించారు.


ఈ క్రైం ఇన్వెస్టిగేషన్‌ థ్రిల్లర్‌ కథకు హ్యూమన్‌ ట్రాఫికంగ్‌, ట్రెర్రరిజం వంటి అంశాలను జోడించి ఆసక్తిగా తెరకెక్కించారు డైరెక్టర్‌ సుమన్‌ చిక్కాల. ఇక ఇందులో కాజల్‌(Kajal Aggrwal) సత్యభామగా పోలీసు ఆఫీసర్‌ నటించి యాక్షన్‌ సన్నివేశాల్లోనూ అదరగోట్టాడు. ఇక థియేటర్లో పాజిటివ్‌ రివ్యూస్‌ అందుకున్న ఈ సినిమా (Sathyabama Digital Streaming) డిజిటల్‌ ప్రిమియర్‌ డిటైయిల్స్‌ ఆసక్తిగా మారాయి. ఈ మూవీ ఓటీటీ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ ఫాం ఆహా సొంతం చేసుకుందని. విడుదలకు మూవీకి ఉన్న బజ్‌ ప్రకారం మంచి ఫ్యాన్సీ డీల్‌గా సత్యభామ ఓటీటీ రైట్స్‌ అమ్ముడైనట్టు తెలుస్తోంది.


ఇక థియేటర్లో రిలీజైన ఈ సినిమాను అతి త్వరలోనే ఆహా(AHA OTT) ఓటీటీకి తీసుకువచ్చేందుకు సన్నాహాలు చేస్తుంది. ఒప్పందం ప్రకారం థియేటర్లో విడుదలైన నాలుగు నుంచి ఆరు వారాల తర్వాత ఈ సినిమాను ఓటీటీకి రానున్నట్టు సమాచారం. జూలై ఫస్ట్‌ వీక్‌ లేదా సెకండ్‌ వీక్‌ సత్యభామ ఓటీటీలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక థియేటర్లో ఒక్క తెలుగులో రిలీజైన ఈ సినిమా ఓటీటీలో మాత్రం రెండు భాషల్లో అందుబాటులోకి రానుందని టాక్‌. ఆహాలో తెలుగుతో పాటు స్ట్రీమింగ్‌ తమిళంలోనూ ఈ మూవీ స్ట్రిమింగ్‌కి తీసుకువస్తున్నట్టు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందట. 


Also Read: నా భర్త మాథియాస్‌కు ముందు చాలామందితో డేటింగ్‌ చేశాను - తాప్సీ షాకింగ్‌ కామెంట్స్‌


స‌త్య‌భామ క‌థేంటంటే..


ఈ సినిమాలో సత్యభామ (కాజ‌ల్ అగ‌ర్వాల్‌) షీ టీమ్‌ ఏసీపీగా ప‌నిచేస్తుంది. ఈ క్రమంలో హ‌సీనా అనే యువ‌తి దారుణ హత్యకు గురవుతుంది. ఈ కేసును ఏసీపీ సత్యభామకు వస్తుంది. ఆ యువతిని ఆమె భర్తే హత్యే చేస్తాడనే ఆరోపణలు ఉన్నాయి. అయితే హసినా మర్డర్‌ తర్వాత ఆమె భ‌ర్త యాదు, ఆమె త‌మ్ముడు ఇక్బాల్‌ (ప్ర‌జ్వ‌ల్ యాద్మ‌) క‌నిపించ‌కుండాపోతారు. ఈ క్రమంలో హ‌సీనాను చంపిన యాదును ప‌ట్టుకోవ‌డంతో పాటు ఆమె త‌మ్ముడు ఇక్బాల్ మిస్సింగ్‌ వెన‌కున్న మిస్ట‌రీని ఛేదించే క్ర‌మంలో ఏసీపీ సత్యభామకు ఎదురయ్యే పరిణామాలు? ఆసక్తిగా ఉంటాయి. కేసు ఛేదించే క్రమంలో ఈ కేసులోకి ఎంపీ కొడుకు రిషితో పాటు విజ‌య్‌, నేహా ఎలా వ‌చ్చారు? అస‌లు హ‌సీనా ఎలా చ‌నిపోయింది? ఆమె మ‌ర‌ణం వెనుకున్న మిస్ట‌రీని స‌త్య‌భామ ఏ విధంగా ఛేదించింది అన్న‌దే ఈ మూవీ క‌థ‌.