యువ కథానాయకుడు కిరణ్ అబ్బవరం (Kiran Abbavaram) నటించిన తాజా సినిమా 'రూల్స్ రంజన్' (Rules Ranjan Movie). ఈ చిత్రంలో నేహా శెట్టి (Neha Shetty) కథానాయిక. 'డీజే టిల్లు', 'బెదురులంక 2012' చిత్రాలతో ఆమె విజయాలు అందుకోవడమే కాదు... యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జోడీ కారణంగా సినిమాపై ప్రేక్షకుల చూపు పడింది.


ఏఎం రత్నం సమర్పణలో స్టార్ లైట్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై తెరకెక్కిన ఈ చిత్రానికి ఆయన తనయుడు రత్నం కృష్ణ దర్శకత్వం వహించారు. కొంత విరామం తర్వాత ఆయన మెగాఫోన్ పట్టిన చిత్రమిది. దివ్యాంగ్ లవానియా, మురళి కృష్ణ వేమూరి నిర్మాతలు. సెప్టెంబర్ 28న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. 'సలార్' వాయిదా పడటంతో ఆ సినిమా తేదీ మీద 'రూల్స్ రంజన్' ముందుగా కర్చీఫ్ వేసింది. ఈ రోజు ట్రైలర్ విడుదల చేశారు. 


సినిమాలో కిరణ్ అబ్బవరం సాఫ్ట్‌వేర్ ఉద్యోగి పాత్ర పోషించారు. తన కాలేజీలో అమ్మాయి మళ్ళీ పరిచయం అయితే... ఆమెతో ప్రేమలో పడతాడు. ఆ తర్వాత ఏమైంది? అనేది కథగా తెలుస్తోంది. ఇందులో కథ, కథనం కంటే కామెడీకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చారని ట్రైలర్ చూస్తే అర్థం అవుతోంది. 


'రూల్స్ రంజన్' ట్రైలర్ ఎలా ఉందో చూడండి :   



సినిమాపై క్రేజ్ పెంచిన 'సమ్మోహనుడా' సాంగ్
తన సినిమాల్లో మంచి పాటలు ఉండేలా జాగ్రత్తలు కిరణ్ అబ్బవరం ఎప్పుడూ తీసుకుంటారు. సినిమా ఫలితాలతో సంబంధం లేకుండా ఆయన సినిమాల్లో పాటలు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. 'రూల్స్ రంజన్' సినిమా పాటలకు సైతం శ్రోతల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. ఆల్రెడీ విడుదలైన 'సమ్మోహనుడా' పాట సినిమాపై క్రేజ్ పెంచింది. 'నాలో నేనే లేను...', 'ఎందుకురా బాబు...'కు కూడా రెస్పాన్స్ బావుంది.


Also Read : 'తురుమ్ ఖాన్‌లు' రివ్యూ : ముగ్గురు హీరోలు నవ్వించారా? టార్చర్ పెట్టారా?



కిరణ్ అబ్బవరం గత సినిమాలకు భిన్నంగా...
'రాజా వారు రాణి గారు' సినిమాతో కిరణ్ అబ్బవరం కథానాయకుడిగా పరిచయం అయ్యారు. 'ఎస్ఆర్ కళ్యాణ మండపం'తో మరో విజయం అందుకున్నారు. ఆ తర్వాత ఆయన చేసిన సినిమాల్లో హిట్లు ఫ్లాపులు ఉన్నాయి. అయితే... కిరణ్ అబ్బవరం గత చిత్రాలకు భిన్నంగా 'రూల్స్ రంజన్' ఉంటుందని, సరికొత్తగా ఉండటంతో పాటు ప్రేక్షకులకు వినోదం అందిస్తుందని చిత్ర బృందం చెబుతోంది. 


Also Read : షారుఖ్ ఒక్కడికీ 100 కోట్లు - నయనతార, విజయ్ సేతుపతికి ఎంత ఇచ్చారో తెలుసా?


కిరణ్ అబ్బవరం, నేహా శెట్టి జంటగా రూపొందిన 'రూల్స్ రంజన్' సినిమాలో మెహర్ చాహల్ రెండో కథానాయిక. ఇంతకు ముందు ఎంఎస్ రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్'లో ఆమె నటించారు. ఇంకా ఈ సినిమాలో 'వెన్నెల' కిశోర్, 'హైపర్' ఆది, సుబ్బరాజు, 'వైవా' హర్ష (హర్ష చెముడు), అన్నూ కపూర్, అజయ్, అతుల్ పర్చురే, విజయ్ పాట్కర్, మకరంద్ దేశ్‌పాండే, 'నెల్లూరు' సుదర్శన్, గోపరాజు రమణ, అభిమన్యు సింగ్, సిద్ధార్థ్ సేన్ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కళా దర్శకత్వం : ఎం. సుధీర్, కూర్పు : వరప్రసాద్, ఛాయాగ్రహణం : దులీప్ కుమార్,   సహ నిర్మాత : రింకు కుక్రెజ, సంగీత దర్శకుడు: అమ్రిష్ గణేష్.


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial