'నువ్వు నాకు నచ్చావ్' సినిమాలో ఆర్తీ అగర్వాల్ గురించి వర్ణిస్తూ 'ఓ నవ్వు చాలు ఎన్నెన్ని వలలు వేస్తూ అల్లుకుంటుంది... ముత్యాల జల్లు... మృదువైన ముల్లు మదిలో గుచ్చుకుంటుంది' అని వెంకటేష్ ఓ పాట పాడతారు. హీరోయిన్ రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth) గురించి చెప్పాలంటే ఆ సాంగ్ కరెక్ట్ ఏమో!? ఆమె నవ్వుకు, హావభావాలు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్నారు. గ్లామర్ షో చేయకుండా కేవలం అభినయంతో, ముఖారవిందంతో ఆకట్టుకుంటోంది రుక్మిణీ. ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది కానీ సరైన విజయాలు మాత్రం రావడం లేదు.
రుక్మిణీ వసంత్ ఖాతాలో హ్యాట్రిక్ ఫ్లాప్స్Rukmini Vasanth Flop Movies: రక్షిత్ శెట్టి సరసన నటించిన 'సప్త సాగరాలు దాటి' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది రుక్మిణీ వసంత్. ఆమె నవ్వు, రూపం అందరికీ నచ్చాయి. అప్పట్నుంచి రుక్మిణీ వసంత్ తెలుగు డెబ్యూ కోసం ఆడియన్స్ ఎదురు చూశారు. వాళ్ళకు నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'తో షాక్ తగిలింది.
'సప్త సాగరాలు దాటి'లో అవకాశం రావడానికి ముందు తెలుగు సినిమా చేసింది రుక్మిణీ వసంత్. ఆ చిత్రమే నిఖిల్ 'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో'. థియేటర్లలోకి ఎప్పుడు వచ్చిందో? ఎప్పుడో వెళ్లిందో? కూడా చాలా మందికి తెలియదు. అంత డిజాస్టర్ అన్నమాట. 'స్వామి రారా' హీరో, దర్శకుడు కలిసి మరోసారి అటువంటి మేజిక్ రిపీట్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ఆ ఫ్లాప్ పక్కన పెడితే... మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి 'ఏస్'తో తమిళ్ తెరపై అడుగు పెట్టింది రుక్మిణీ వసంత్.
'అప్పుడో ఇప్పుడో ఎప్పుడో' తర్వాత 'ఏస్' రూపంలో మరొక ఫ్లాప్ వచ్చింది రుక్మిణికి. ఆ సినిమా చేశాక కోలీవుడ్ రైజింగ్ స్టార్ శివకార్తికేయన్ సరసన ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో 'మదరాసి'లో నటించే అవకాశం వచ్చింది. బ్లాక్ బస్టర్ 'అమరన్' తర్వాత హీరోకి అటువంటి హిట్ ఇస్తుందని అనుకుంటే మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది మురుగదాస్ సినిమా. రెండు రోజుల్లో బాక్స్ ఆఫీస్ దగ్గర 50 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసినట్టు నిర్మాణ సంస్థ అనౌన్స్ చేసినా ఆడియన్స్ నుంచి అప్లాజ్ రాలేదు. బ్యాక్ టు బ్యాక్ మూడు ఫ్లాప్స్ రావడంతో హ్యాట్రిక్ నమోదు చేసింది రుక్మిణీ వసంత్.
చేతిలో పాన్ ఇండియా సినిమాలు...!రుక్మిణీ వసంత్ (Rukmini Vasanth Upcoming Movies)కు హ్యాట్రిక్ ఫ్లాప్స్ వచ్చినా ఆవిడ కెరీర్‌కు వచ్చిన ఢోకా ఏమీ లేదు. ప్రస్తుతం ఆవిడ చేతిలో రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి. పాన్ ఇండియా హిట్ 'కాంతార'కు ప్రీక్వెల్‌గా వస్తున్న 'కాంతార: ఏ లెజెండ్'లో రుక్మిణీ వసంత్ హీరోయిన్. అందులో రాణీ కనకావతిగా నటించారు. అక్టోబర్ 2న సినిమా విడుదల. ఇది కాకుండా ఎన్టీఆర్ 'డ్రాగన్' మరొకటి.
Also Read: ఘాటీ vs లిటిల్ హార్ట్స్... బాక్సాఫీస్ కలెక్షన్లలో మౌళి మూవీ ముందు అనుష్క సినిమా గల్లంతు!
అఫీషియల్‌గా అనౌన్స్ చేయలేదు కానీ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్న సినిమాలోనూ రుక్మిణీ వసంత్ హీరోయిన్. ఆ విషయాన్ని ఆవిడ పరోక్షంగా అంగీకరించారు. ఆ రెండూ విజయాలు సాధిస్తే హ్యాట్రిక్ ఫ్లాప్స్ మరుగున పడతాయి. ఎవరికీ ఈ సినిమాలు గుర్తుండవు. 'డ్రాగన్'లో అవకాశం ఇవ్వడానికి ముందు ప్రశాంత్ నీల్ కథతో ఆయన బావ శ్రీ మురళి హీరోగా నటించిన 'భగీర' సైతం ఫ్లాప్. కన్నడలో శివరాజ్ కుమార్ 'భైరాతి రణగళ్' డీసెంట్ హిట్ అయ్యింది.
Also Read: ఇప్పుడు పూకీ కాదు... 'బూకీ' - తెలుగు ఆడియన్స్ దెబ్బకు టైటిల్ మార్చిన విజయ్ ఆంటోనీ