Rukmini Vasanth Recent Bikini Video Controversy Latest Update: కన్నడ భామ, హీరోయిన్ రుక్మిణీ వసంత్ డీప్‌ ఫేక్ వీడియో వివాదం సంచలనం సృష్టించింది. ఓ బికినీ షూట్‌లో ఆమె పాల్గొన్న వీడియో నెట్టింట వైరల్ కాగా... అందులో ఉన్నది తాను కాదని క్లారిటీ ఇవ్వడంతో పాటు కంప్లైంట్ చేశారు. ఆ కేసుకు సంబంధించి బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్టు చేసినట్లు సమాచారం. ఆ వివరాల్లోకి వెళితే...

Continues below advertisement

ఏఐ సాయంతో బికినీ వీడియోలు...రుక్మిణీ పరువు తీసేందుకు వైరల్ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సాయంతో రుక్మిణీ వసంత్ బికినీ వీడియోలు క్రియేట్ చేసి, ఆమె ప్రతిష్టను దెబ్బ తీసేందుకు వాటిని సోషల్ మీడియాలో షేర్ చేశారని పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి మూడు మొబైల్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు.

మే (2026) నెలలో రుక్మిణీ వసంత్ ప్రొఫెషనల్ ఫోటోషూట్ సెటప్‌లో స్విమ్మింగ్ పూల్ దగ్గర బికినీ ధరించినట్లు వీడియోలో ఉంది. సోషల్ మీడియాలో ఆ విజువల్స్ స్పీడుగా వైరల్ అయ్యాయి. నెటిజనులు చాలా మంది వీడియోలో బికినీ ధరించిన అమ్మాయి రుక్మిణీ వసంత్ అని నమ్మారు. ఏఐ ద్వారా జనరేట్ చేసినవని రుక్మిణి స్పష్టం చేశారు. టెక్నాలజీని దుర్వినియోగం చేయడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు అందుకు కారణమైన బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Continues below advertisement

Also Read: Balan The Boy Review - 'బాలన్ ది బాయ్' రివ్యూ: 'మంజుమ్మేల్ బాయ్స్' దర్శకుడి కొత్త సినిమా - మలయాళం మూవీ ఎలా ఉందంటే?

రుక్మిణీ వసంత్ డీప్ ఫేక్ బికినీ వీడియో కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన ముగ్గురు నిందితులు ప్రస్తుతం జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు. కేసులో దోషులు వాళ్ళు మాత్రమేనా? లేదంటే మరికొంత మంది ప్రమేయం ఉందా? అనే కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు.

Also ReadDeewana Review - 'దీవానా' రివ్యూ: తెలుగులో ఇటువంటి ప్రేమకథ రాలేదా? 'శుభం' ఫేమ్ హర్షిత్ రెడ్డి సినిమా ఎలా ఉందంటే?

Rukmini Vasanth Upcoming Movies List: రుక్మిణీ వసంత్ సినిమాల విషయానికి వస్తే... రిషబ్ శెట్టి 'కాంతార: చాప్టర్ 1'తో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఆ తర్వాత యశ్‌ 'టాక్సిక్'లో నటించారు. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. అది కాకుండా ఎన్టీఆర్ సరసన 'డ్రాగన్'లో కథానాయికగా నటిస్తున్నారు. మరికొన్ని సినిమాలు ఆమె చేతిలో ఉన్నాయి.

Also ReadVanda Devullu Review - 'వంద దేవుళ్ళు' రివ్యూ: అమ్మకు మళ్ళీ పెళ్లి... 'బిచ్చగాడు' కాంబినేషన్‌లో లేటెస్ట్ సినిమా - ఎలా ఉందంటే?