RRR producer offers record remuneration for Vijay : ఈమధ్య మన టాలీవుడ్ లో ఉన్న అగ్ర నిర్మాతలు కోలీవుడ్ హీరోలపై దృష్టి సారించిన విషయం తెలిసిందే. గత ఏడాది స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు తమిళ అగ్ర హీరో విజయ్ తో 'వారిసు' సినిమాని నిర్మించి మంచి లాభాలు అందుకున్నాడు. ఆ తర్వాత మైత్రి నిర్మాతలు సైతం అజిత్ తో ప్రాజెక్ట్ చేయబోతున్నారు. ఇటీవలే చెన్నైలో ఆఫీస్ ఓపెన్ చేశారు. ఇక ఈ లిస్టులో మరో నిర్మాత కూడా చేరిపోయారు. 


'RRR' సినిమాతో భారీ లాభాలు అందుకున్న DVV దానయ్య తాజాగా దళపతి విజయ్‌తో ఓ సినిమా నిర్మించబోతున్నట్లు తెలుస్తోంది. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ ప్రాజెక్టు ఉంటుందట. గత ఏడాది 'లియో' సినిమాతో భారీ సక్సెస్ అందుకున్న విజయ్ ప్రస్తుతం వెంకట్ ప్రభు దర్శకత్వంలో 'గోట్' సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ ప్రాజెక్టు తర్వాతే విజయ్ - DVV దానయ్య కాంబినేషన్లో సినిమా ఉంటుందట. ఇందుకోసం దానయ్య విజయ్ కి భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టుకు డైరెక్టర్ ఎవరనే విషయం తెలియాల్సి ఉంది. ఓ కోలీవుడ్ డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్ కి దర్శకత్వం వహించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. గతంలో విజయ్ దిల్ రాజుతో చేసిన 'వారిసు' ప్రాజెక్టు కోసం భారీ రెమ్యూనరేషన్ తీసుకున్నాడు.


ఇప్పుడు దానయ్య ప్రాజెక్టు కోసం అంతకుమించి రెమ్యునరేషన్ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే ‘వారిసు’లా బై లింగువల్ ప్రాజెక్టు కాకుండా పాన్ ఇండియా స్థాయిలో ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక DVV దానయ్య ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో OG, నాచురల్ స్టార్ నానితో 'సరిపోదా శనివారం' వంటి క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. ఈ రెండు సినిమాలపై భారీ అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పవర్ స్టార్ 'OG' పై ఏ రేంజ్ అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సుమారు రూ.150 కోట్ల భారీ ఈ సినిమాని రూపొందిస్తున్నారు.


ప్రస్తుతం చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా మాఫియా గ్యాంగ్ స్టార్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. ఇందులో పవన్ కళ్యాణ్ మాఫియా లీడర్ పాత్రలో కనిపించబోతున్నారు. బాలీవుడ్ హీరో ఇమ్రాన్ హష్మీ విలన్ గా నటిస్తున్నాడు. అర్జున్ దాస్, శ్రీయ రెడ్డి, వెంకట్, ప్రకాష్ రాజ్, హరీష్ ఉత్తమన్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక విజయ్ గోట్ విషయానికొస్తే.. టైం ట్రావెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తలపతి విజయ్ డ్యూయల్ రోల్ లో నటిస్తున్నారు. మీనాక్షి చౌదరి కథానాయిక.. భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఈ ఏడాది వేసవి కానుకగా విడుదల చేయనున్నారు.


Also Read : 'అంబాజీ పేట మ్యారేజ్ బ్యాండు' ట్రైలర్ - మరోసారి ఏడిపించేసిన కలర్ ఫోటో హీరో సుహాస్!