హాలీవుడ్ మీడియాలో ఇప్పుడు 'ఆర్ఆర్ఆర్' సినిమా (RRR Movie) పేరు ఎక్కువ వినబడుతోంది. దర్శక ధీరుడు రాజమౌళి తీసిన దృశ్య కావ్యం గురించి, అందులో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి హాలీవుడ్ సినీ ప్రముఖులు, అక్కడ విశ్లేషకులు చర్చలు పెడుతున్నారు. సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఆస్కార్ అవార్డులకు 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కొందరు, ఎన్టీఆర్‌కు ఉత్తమ నటుడిగా ఆస్కార్ వచ్చే అవకాశం ఉందని మరికొందరు ప్రెడిక్షన్స్ చెబుతున్నారు. లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే... ఈ ఏడాది ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 బెస్ట్ మూవీస్‌లో 'ఆర్ఆర్ఆర్' చోటు సంపాదించింది.


మూడు కొరియన్ సినిమాలు...
ఇండియా నుంచి 'ఆర్ఆర్ఆర్'
హాలీవుడ్ మీడియా సంస్థ ఫిల్మ్ స్కూల్ రిజెక్ట్స్ తాజాగా ఒక కథనం ప్రచురించింది. అందులో 2022లో ఇప్పటి వరకు వచ్చిన సినిమాల్లో టాప్ 10 బెస్ట్ యాక్షన్ మూవీస్ ఏవి? అంటూ పది సినిమాల జాబితా ఇచ్చింది. అందులో ఇండియన్ మాస్టర్ పీస్ 'ఆర్ఆర్ఆర్' చోటు దక్కించుకుంది. దీంతో పాటు కొరియన్ సినిమాలు మూడు ఉన్నాయి. రాజమౌళి సీజీ వర్క్స్ ఉపయోగించిన తీరు అద్భుతమని పేర్కొంది. హాలీవుడ్ సినిమాల కంటే ముందు 'ఆర్ఆర్ఆర్' సినిమా గురించి ప్రస్తావించింది. ఇది హాలీవుడ్ జనాలకు షాక్ అని చెప్పవచ్చు.
 
టాప్ 10లో హాలీవుడ్ మూవీస్ ఏం ఉన్నాయి?
'ఆర్ఆర్ఆర్'తో పాటు టాప్ 10 బెస్ట్ యాక్షన్ సినిమాల్లో 'అంబులెన్స్', 'ది బ్యాట్ మ్యాన్', 'ది ప్రిన్సెస్', టామ్ క్రూజ్ 'టాప్ గన్ : మావెరిక్' చోటు సంపాదించాయి. సౌత్ కొరియా నుంచి 'ది  విచ్ : పార్ట్ 2 - ది అదర్ వన్', 'ది రౌండప్', 'ది కిల్లర్' సినిమాలూ బెస్ట్ యాక్షన్ మూవీస్ అని ఫిల్మ్ స్కూల్ రిజెక్ట్స్ మీడియా సంస్థ పేర్కొంది.


Also Read : బీజేపీ హిందుత్వ ఎజెండాకు ఎన్టీఆర్ ఓకే చెబుతారా? - రజాకార్ ఫైల్స్‌లో తారక్?


'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వస్తుందా? లేదా?
విదేశాల్లో 'ఆర్ఆర్ఆర్ : రౌద్రం రణం రుధిరం' సినిమాకు లభిస్తున్న ప్రశంసలు, ఆదరణ భారతీయ ప్రేక్షకులకు సంతోషాన్ని ఇస్తోంది. అటు నందమూరి, ఇటు కొణిదెల ఫ్యాన్స్ కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే... అందరి మదిలో ప్రస్తుతం ఉన్న ప్రశ్న ఒక్కటే. 'ఆర్ఆర్ఆర్'కు ఆస్కార్ వస్తుందా? లేదా? తుది నామినేషన్ల జాబితాలో సినిమా ఉంటుందా? లేదా? అని! దీనికి సమాధానం తెలియాంటే ఇయర్ ఎండ్ వరకూ వెయిట్ చేయక తప్పదు. 


ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరిస్, రామ్ చరణ్ జోడీగా ఆలియా భట్... కీలక పాత్రల్లో అజయ్ దేవగన్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ తదితరులు నటించిన ఈ చిత్రానికి ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ చిత్రానికి కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫర్. 



Also Read : మెగాస్టార్ జీవితంలో 'చిరు' లోటు - అభిమానుల కోసం చేసిన త్యాగమా? అన్యాయమా?