రలక్ష్మీ శరత్ కుమార్.. నిజానికి  ఈమె తమిళ నటి అయినా.. తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. నటనలో తండ్రిని మించిన తనయగా వరలక్ష్మి పేరుతెచ్చుకుంది. తెలుగు, తమిళ పరిశ్రమలో నెగెటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లు చేస్తూ.. అందరి చేత శభాష్ అనిపించుకుంటుంది. సినిమాల్లో మాదిరిగానే బయట కూడా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకుంది ఈ ముద్దుగుమ్మ. ఆమె మాట్లాడే మాటల్లో డొంకతిరుగుడు ఉండదు. ఏదైనా ఫేస్ టు ఫేస్. ముక్కుసూటిగా మాట్లాడుతుంది. అందుకే ఆమెను విమర్శించే వారికి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. విమర్శకులకు వరలక్ష్మి ఇచ్చే కౌంటర్ కూడా అంతే పదునుగా ఉంటుంది. తాజాగా తమిళ సీనియర్ నటి రాధిక 60వ బర్త్ డే సందర్భంగా ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు చెప్పింది. “60వ జన్మదిన శుభాకాంక్షలు ఆంటీ.. లవ్ యూ.. మీరు మా అందరికీ ఆదర్శం. వయసు అనేది కేవలం నెంబర్ మాత్రమే అనేదానికి మీరే ప్రూఫ్. హుమ్మ.. హ్యావ్ యే గుడ్ ట్రిప్ ఆంటీ.. సీ యూ సూన్” అని ట్వీట్ చేసింది.    


రాధికను.. ‘ఆంటీ’ అని సంబోధించడంతో నెటిజన్లు రెచ్చిపోయారు.. అమ్మను ఆంటీ ఆనడం ఏంటి? అంటూ క్లాస్ తీసుకుంటున్నారు. వరుసబెట్టి కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి రాధిక వరలక్ష్మికి పిన్ని అవుతుంది. కానీ, తనను ఆంటీ అని ఎందుకు పిలుస్తుందో గతంలోనే వివరణ ఇచ్చింది. ఓ ఇంటర్వ్యూ సందర్భంగా తన తండ్రి శరత్‌ కుమార్ రెండో భార్య రాధిక గురించి ఆమె కీలక వ్యాఖ్యలు చేసింది. చాలా మంది రాధిక నా తల్లి అని అంటారని చెప్పింది. నిజానికి ఆమె తన తల్లి కాదని వెల్లడించింది. ఆమె కేవలం తన తండ్రికి రెండో భార్య మాత్రమే అన్నది. ఈ విషయంలో తామంతా సంతోషంగానే ఉన్నామని వెల్లడించింది.  బయటి వ్యక్తులే కావాల్సినన్ని పుకార్లు పుట్టిస్తున్నారని మండిపడింది.


రాధికకు తనకు పడదని చాలా మంది అంటుంటారని.. అదంతా అవాస్తవం అని వెల్లడించింది. తమ ఇద్దరి మధ్య మంచి సంబంధం ఉన్నట్లు చెప్పింది. నువ్వు అమ్మను.. ఆంటీ అని పిలుస్తావేంటి? అని ఎవరో ట్వీట్ చేశారు. నేను ఆంటీ అనే పిలుస్తాను అని చెప్పింది. రాధిక నాకు అమ్మకాన్నప్పుడు ఏమని పిలవాలి?  ఎవరికైనా ఒక్క అమ్మే ఉంటుంది. అందుకే రాధిక నాకు ఆంటీనే.  


























తండ్రి శరత్ కుమార్ తో పాటు రాధికనూ అంతే గౌరవంగా చూస్తానని చెప్పింది. వాళ్లకు వ్యతిరేకంగా ఏమీ చేయను. కొంత మంది మొరిగే కుక్కల మాటలు అస్సలు పట్టించుకోనని గట్టి కౌంటర్ ఇచ్చింది.  వరలక్ష్మీ శరత్ కుమార్ తమిళంతో పాటు పలు తెలుగు సినిమాలు చేసింది. మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఆమె తండ్రి శరత్ కుమార్ సైతం పలు తెలుగు సినిమాల్లో నటించి మెప్పించారు. గ్యాంగ్ లీడర్  చిత్రంలో మెగాస్టార్ చిరంజీవికి అన్నయ్యగా.. బన్నీ సినిమాలో  అల్లు అర్జున్  తండ్రిగా నటించాడు. నటి రాధిక ను శరత్ కుమార్ రెండో వివాహం చేసుకున్నాడు.


Also Read: చిరంజీవి ‘పసివాడి ప్రాణం’ సినిమాకు 5 భాషల్లో 5 వేర్వేరు క్లైమాక్సులు, ఇదిగో ఇలా మార్చేశారు


Also Read: చిరంజీవి బాలీవుడ్ చిత్రాలివే, ఆ సినిమా తర్వాత ఉత్తరాదికి ఎందుకు దూరమయ్యారు?