‘ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం’ మళ్లీ థియేటర్లలో వచ్చేస్తోంది. సినిమా రీ రిలీజ్ కాదు.... సీక్వెలా? అస్సలు కాదు... ఈ సినిమాపై డాక్యుమెంటరీ రూపొందించింది నెట్ ఫ్లిక్స్. అదే ‘ఆర్ఆర్ఆర్: బిహైండ్ అండ్ బియాండ్’. సినిమా ఫస్ట్ క్లాప్ నుంచి ఆస్కార్ వేడుక వరకూ ఈ సినిమా మేకింగ్ కు సంబంధించిన ఆసక్తి కరమైన అంశాలను ఈ తాజా డాక్యుమెంటరీలో పొందుపరిచారు.


యాక్షన్ వెనుక కష్టమిదే!



ఎస్ఎస్ రాజమౌళి సినిమా అంటేనే ఒళ్లు గగుర్పొడిచే యాక్షన్ సన్నివేశాలు తప్పని సరిగా ఉంటాయి. 'సింహాద్రి' నుంచి 'ఆర్ఆర్ఆర్' వరకూ రాజమౌళి సినిమాల్లో యాక్షన్ సన్నివేశాలు నెవ్వర్ నెవ్వర్ ఆఫ్టర్ అన్నట్టుగా ఉంటాయి. సినిమాల్లో నటించిన హీరోలకూ గాయాలవుతూ ఉంటాయి. ‘బాహుబలి’ సమయంలో ప్రభాస్ (Prabhas)కు, 'ఆర్ఆర్ఆర్' సమయంలో జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR), రామ్ చరణ్ (Ram Charan) లకు యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలలో గాయాలు కూడా అయ్యాయి. సినిమా చూస్తున్న ప్రేక్షకులకు అసలు ఈ యాక్షన్ ఎలా తీశారో అనే క్యూరియాసిటీ కచ్చితంగా కలుగుతుంది. మరీ ముఖ్యంగా ‘ఆర్ఆర్ఆర్’లో యాక్షన్ బ్లాక్స్ ను రాజమౌళి తీసిన విధానం చూస్తే ‘వావ్’ అనాల్సిందే. ఇద్దరు హీరోలూ బ్రిడ్జ్ పై నుంచి కిందకు వేలాడుతూ పిల్లాడిని కాపాడే సన్నివేశం, ఇంటర్వెట్ ఫైట్ లో జంతువులు ఒక్కసారిగా దాడి చేసే సన్నివేశం, చరణ్ పాత్ర చిన్నప్పటి పోలీస్ షూటౌట్, క్లైమ్యాక్స్... ఇవన్నీ ఆర్ఆర్ఆర్ లో చాలా కీలక యాక్షన్ ఘట్టాలు. ఇలాంటి క్రేజీ సీన్స్ ను ఎలా చిత్రీకరించారో, వాటి వెనుక చిత్ర యూనిట్ పడిన శ్రమ... ఇవన్నీ ఆర్ఆర్ఆర్ డాక్యుమెంటరీ లో పొందుపరిచారు. ఎంపిక చేసిన కొన్ని థియేటర్లలో డిసెంబర్ 20న ఈ నెట్‌ఫ్లిక్స్‌ డాక్యుమెంటరీ విడుదల చేయనున్నారు.


Also Readబిగ్ బాస్ 8 విజేత నిఖిల్... అతని కంటే ముందు విన్నర్స్ ఎవరో గుర్తు ఉన్నారా? ఓ లుక్ వేయండి



‘నాటు నాటు’ వెనుక కష్టం!
సినిమాలోని ప్రతి షాట్ పర్ఫెక్ట్ గా వచ్చేంతవరకూ తీస్తూనే ఉంటారు రాజమౌళి. ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట డ్యాన్స్ విషయంలో ఇద్దరు హీరోలనూ బాగా కష్టపెట్టేశారు దర్శకుడు రాజమౌళి. ఈ కష్టమే సినిమాకు ఆస్కార్లను తెచ్చిపెట్టింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ల స్టెప్స్ కరెక్ట్ గా సింక్ అయ్యేంత వరకూ రాజమౌళి ఇద్దరు హీరోలనూ ఎంత కష్టపెట్టారో ఈ డాక్యుమెంటరీలో చూసేయచ్చు. అంతే కాదు, ఈ సినిమా విశేషాలనూ చిత్ర యూనిట్ పంచుకోబోతోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, అలియాభట్, ఆర్ట్ డైరెక్టర్ సాబుసిరిల్... ఇలా అందరూ తమ అనుభవాలను ప్రేక్షకులతో షేర్ చేసుకోనున్నారు. ఈ చిత్రానికి భవిష్యత్తులో సీక్వెల్ కూడా ఉండే అవకాశం ఉందని ఒక ఇంటర్వ్యూలో హింట్ కూడా ఇచ్చారు రాజమౌళి. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ లను పాన్ ఇండియా స్టార్ల గా నిలబెట్టింది ‘ఆర్ఆర్ఆర్’. థియేటర్ల లోనే కాదు, తర్వాత  నెట్ ఫ్లిక్స్ లో ప్రసారమైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చుకుంది. ఆ సందర్భంలోనే  నెట్ ఫ్లిక్స్ తొలిసారిగా దర్శకుడు రాజమౌళి పై ఓ డాక్యుమెంటరీ రూపొందించిన విషయం తెలిసిందే. ‘ఆర్ఆర్ఆర్’ పై రూపొందిన ఈ తాజా డాక్యుమెంటరీని ఎంపిక చేసిన థియేటర్లలో మాత్రమే ప్రదర్శిస్తారట. మరి నెట్ ఫ్లిక్స్ ఓటీటీ రిలీజ్ డేట్ ను ప్రకటించలేదు.


Also Readనిఖిలే విన్నర్... ట్రోఫీ ఇచ్చిన రామ్ చరణ్, స్టార్స్ సందడి - బిగ్ బాస్ 8 గ్రాండ్ ఫినాలే హైలైట్స్ ఏంటో చూడండి