నందమూరి కళ్యాణ్ రామ్ కథానాయకుడిగా, టైటిల్ పాత్రలో నటించిన సోషియో ఫాంటసీ సినిమా 'బింబిసార'. ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ మధ్య ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు సినిమా చూశారని ABP దేశం పాఠకులకు చెప్పింది. 'దిల్' రాజుతో పాటు ఆయన సోదరుడు శిరీష్ కూడా సినిమా చూశారు. వీళ్ళిద్దరి కంటే ముందు కళ్యాణ్ రామ్ సోదరుడు, యంగ్ టైగర్ ఎన్టీఆర్ 'బింబిసార' చూశారు.


''ఇప్పటి వరకూ సినిమాను ముగ్గురు అంటే ముగ్గురు మాత్రమే చూశారు. ఎన్టీఆర్ గారు, రాజు గారు, శిరీష్ గారు'' అని ఓ ఇంటర్వ్యూలో 'బింబిసార' దర్శకుడు వ‌శిష్ఠ్ మల్లిడి తెలిపారు. 'దిల్' రాజు సినిమా విపరీతంగా నచ్చిందని, నైజాం రైట్స్ ఫ్యాన్సీ రేటుకు తీసుకున్నారనే విషయం తెలిసిందే. 'బింబిసార'ను నైజాంలో 'దిల్' రాజు డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు.


'బింబిసార' చూసిన తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఏమన్నారు? ఏం చెప్పారు? అనే విషయాల గురించి దర్శకుడు వ‌శిష్ఠ్ మల్లిడి మాట్లాడుతూ ''ఎన్టీఆర్ గారు సినిమా చూసి బాగా ఎగ్జైట్ అయ్యారు. ఆయన బ్లాక్ బస్టర్ అన్నారు. ఇది బ్లాక్ బస్టర్... కొట్టేశారు అంతేనని అన్నారు. ఆయన సినిమా చూసిన రోజున నుఎను వేరే వర్క్ లో ఉన్నాను. కళ్యాణ్ గారు ఫోన్ చేసి 'బ్లాక్ బస్టర్ కొట్టేశాం అంతే. ఫిక్స్ అయిపో' అన్నారు'' అని తన సంతోషాన్ని పంచుకున్నారు.






నందమూరి తారక రామారావు ఆర్ట్స్ ప‌తాకంపై హ‌రికృష్ణ‌.కె నిర్మించిన 'బింబిసార' ద్వారా వ‌శిష్ఠ్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. ఇప్పటికి సినిమాలో రెండు పాటలను విడుదల చేశారు.


Also Read : ‘థాంక్యూ’ రివ్యూ - నాగ చైతన్య వన్ మ్యాన్ షో, ప్రేక్షకులు థాంక్స్ చెబుతారా?


ఈ సినిమాలో కేథ‌రిన్ ట్రెసా, సంయుక్తా మీన‌న్, వరీనా హుస్సేన్ హీరోయిన్లు. చిరంతన్ భట్ స్వరాలు అందించారు. ఎం.ఎం. కీరవాణి నేపథ్య సంగీతం అందించారు. ఈ చిత్రానికి ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రాఫర్.


Also Read : దర్జా రివ్యూ: లేడీ డాన్‌గా అనసూయ, ఏసీపీగా సునీల్ - 'దర్జా'గా చూడొచ్చా? సినిమా ఎలా ఉందంటే?