సినిమా ఇండస్ట్రీలో యాంకర్ గా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సుమ కనకాల గురించి అందరికీ తెలిసిందే. ఇండస్ట్రీలో ఏ ఈవెంట్ జరిగినా ఖచ్చితంగా సుమ ఉండాల్సిందే. బుల్లితెరపై వరుస టీవీ షోలు చేస్తూ అగ్ర హీరోల సినిమాల ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్లకు హోస్ట్ గా వ్యవహరిస్తూ ఎంతో పాపులారిటీ సంపాదించుకున్నారు. సుమ ఆమె భర్త రాజీవ్ కనకాల నటుడిగా కొనసాగుతున్నారు. అగ్ర హీరోల సినిమాలతో పాటు చిన్న సినిమాల్లోనూ ప్రముఖ పాత్రలు పోషిస్తూ దూసుకుపోతున్నారు. ఇప్పుడు వీరి వారసుడు రోషన్ హీరోగా వెండితెరకు పరిచయం అవుతున్నాడు. గతంలో 'నిర్మల కాన్వెంట్' అనే సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన రోషన్ ఇప్పుడు 'బబుల్ గమ్'(Bubble Gum) అనే మూవీతో టాలీవుడ్ కి హీరోగా డెబ్యూ ఇస్తున్నాడు.


రీసెంట్ గానే ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ ని దర్శక ధీరుడు ఎస్. ఎస్ రాజమౌళి లాంచ్ చేసిన విషయం తెలిసిందే. ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఆడియన్స్ లో ఆసక్తి పెరిగింది. ఇదొక యూత్ ఫుల్ లవ్ ఎంటర్టైండర్ మూవీ అని ఫస్ట్ లుక్ తో మేకర్స్ చెప్పకనే చెప్పారు. ఈ ఫస్ట్ లుక్ ని రాజమౌళి విడుదల చేయడంతో ఈ సినిమాకి ఇండస్ట్రీలో మరింత బజ్ క్రియేట్ అయ్యింది. ఇక తాజాగా ఈ మూవీ టీజర్ ను న్యాచురల్ స్టార్ నాని చేతుల మీదుగా రిలీజ్ చేశారు. నాని విడుదల చేసిన 'బబుల్ గమ్' టీజర్ ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. టీజర్ లో రోషన్ తన స్క్రీన్ ప్రజెన్స్ తో ఆకట్టుకున్నాడు.


మొదటి సినిమాలోనే హీరోయిన్ కి ఏకంగా ఘాటుగా లిప్ లాక్ కూడా ఇచ్చేశాడు. టీజర్ చూస్తుంటే ఒక న్యూ ఏజ్ లవ్ స్టోరీ తో ఈ మూవీ ఉండబోతున్నట్లు స్పష్టం అవుతుంది. ఒక రిచ్ గర్ల్ అండ్ పూర్ బాయ్ మధ్య సాగే లవ్ స్టోరీని కొత్తగా చూపించే ప్రయత్నం చేశారు. టీజర్ లో రోషన్ కనకాల తన స్టైల్ అండ్ స్వాగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా తెలంగాణ స్లాంగ్ లో రోషన్ డైలాగ్స్ హైలెట్గా నిలిచాయి. "నిన్ను డ్రాప్ చేస్తా, పికప్ చేస్తా, నువ్వు పళ్లు తోముకోకపోయినా వచ్చి ముద్దు పెడతా" అంటూ టీజర్ లో రోషన్ చెప్పిన డైలాగ్ కూడా యూత్ ని ఆకట్టుకునేలా ఉంది. ఇంకా చెప్పాలంటే టీజర్ లో భారీగా బూతు డైలాగులు కూడా ఉన్నాయి. వాటిని మ్యూట్ చేయకుండానే చూపించారు. మరి సినిమాలో కూడా అలాగే చూపిస్తారా?? లేదా అనేది చూడాలి.


మొత్తంగా 'బబుల్ గమ్' టీజర్ యూత్ ని బాగా ఆకట్టుకుంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. టీజర్ లో రోషన్ స్క్రీన్ ప్రెజెన్స్ చూస్తుంటే కచ్చితంగా ఫస్ట్ మూవీ తోనే తన నటనతో ఆడియన్స్ ని ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. సినిమాలో రోషన్ కనకాల సరసన మనసా చౌదరి హీరోయిన్ గా నటిస్తోంది. 'క్షణం', 'కృష్ణ అండ్ హిస్ లీలా' వంటి సూపర్ హిట్ సినిమాలను తెరకెక్కించిన రవికాంత్ పేరేపు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. శ్రీ చరణ్ పాకాల సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ ఆడియన్స్ ముందుకు తీసుకురానున్నారు. డిసెంబర్ 29న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.


Also Read : లోకేష్ కనకరాజ్ చెప్పింది రామ్ చరణ్ గురించేనా? లియోలో కామియో అంటూ హైప్



Join Us on Telegram: https://t.me/abpdesamofficial