Roshan Kanakala Interesting Comments on Mother Suma: యాంకర్‌ సుమ ఎనర్జీ, టైమింగ్‌ పంచ్‌లకు ప్రత్యేకమైన ఫ్యాన్‌ బేస్‌ ఉంది. ఎంతో కాలంగా టెలివిజన్‌ రంగంలో తనదైన యాంకరింగ్‌తో రాణిస్తుంది. సెలబ్రిటీస్‌ అయినా, సాధారణ ఆడియన్స్‌ అయినా అందరికి తన పంచ్‌ డైలాగ్స్‌తో ఇచ్చి పడేస్తుంది. యాంకరింగ్‌తో ఎంతో వినోదం పంచే సుమ నాలుగు పదుల వయసులోనూ అంతే ఎనర్జీతో స్టార్‌ యాంకర్‌గా కొనసాగతుంది. ఇప్పటికీ ఆమెకు బీట్‌ చేసే మేల్‌, ఫీమేల్‌ యాంకర్స్‌ లేరనడంతో సందేహం లేదు. ఎన్నో స్టేజ్‌లపై స్టార్‌ హీరో సైతం సుమ యాక్టివ్‌, ఎనర్జీకి సీక్రెట్‌ సర్‌ప్రైజ్‌ అవుతుంటారు. ఇక ఇండస్ట్రీలో చాలా మంది తమకు సుమ ఇన్‌స్పరేషన్‌ అని చెబుతుంటారు.


రాజమౌళి లాంటి దర్శక దిగ్గమే మాట అన్నారంటే సుమ డేడికేషన్‌ వర్క్‌ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తాజాగా సుమ కొడుకు రోషన్‌ కూడా తన తల్లి సుమ ఎనర్జీ గురించి చెప్పుకొచ్చాడు. రోషన్‌ కనకల ఇటీవల బబ్లుగమ్‌ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ యూట్యూబ్‌ చానల్‌తో ముచ్చటించిన రోషన్‌ తన తన తల్లి సుమ కనకాల, వారి ఆస్తుల గురించి ప్రస్తావించారు. తన తల్లి సుమను ఇండస్ట్రీలో చాలా మంది స్ఫూర్తిగా తీసుకుంటారని, తన నుంచి మీరేం నేర్చుకున్నారని హోస్ట్‌ ప్రశ్నించగా.. "మా అమ్మ నుంచి నేర్చుకునేవి చాలా ఉన్నాయంటూ బదులిచ్చాడు. "మా చిన్నతనం నుంచి చూస్తున్న ఇప్పటికి అమ్మ అదే ఎనర్జీతో షూటింగ్‌ చేస్తుంది, ఇంట్లో పనులన్ని చూసుకుంటుంది.


అమ్మ మాకు ఆ ఛాన్స్ ఎప్పుడు ఇవ్వలేదు: రోషన్


పొద్దున 6 గంటలకు షూటింగ్‌ వెళ్తే.. రాత్రి 7 గంటలకు వచ్చేది. ఎంత బిజీ ఉన్న మాతో టైం స్పెండ్‌ చేసేది. మాకు నచ్చిన వంటకాలు చేసి నన్ను చెల్లిని పడుకోబెట్టేది. మాకు ఇది చేయలేదు, చూసుకోలేదు అని కంప్లైంట్‌ ఇచ్చే చాన్స్‌ ఆమె మాకు ఏనాడు ఇవ్వలేదు" అన్నాడు. ఆ తర్వాత మాట్లాడుతూ.. "ఒక రోజు.. నాకు అప్పుడు తొమ్మిదేళ్లు అనుకుంటా. అమ్మ షూటింగ్‌ నుంచి వచ్చేసింది. నేను కూడా హోంవర్క్‌ పూర్తి చేసుకున్నాను. మా అమ్మతో నాకు పూరి కావాలి అన్న. అప్పుడు ఇంట్లో ఆ పిండి లేకపోయినా.. బయటకు వెళ్లి కొనుక్కుని వచ్చి నాకు పూరి చేసి పెట్టింది. అంత చేసి కూడా అదే ఎనర్జితో ఉండేది. అప్పుడు నాకు అర్థం అయ్యేది కాదు. ఇప్పుడు నేను కూడా షూటింగ్‌ చేస్తున్నా కదా. మాది సినిమా ఒక్కోక్కో రోజు మాకు బ్రేక్‌ దొరుకుంది. లేదా వేరే వాళ్ల సీన్‌ చేసేటప్పుడు సెట్‌లో కనీసం పది నిమిషాలైన విరామం ఉంటుంది. అయినా నేను ఒక్కోసారి ఫుల్‌గా అలసిపోతాను. ఇంటికి వచ్చాక నా వల్ల కాదు బాబోయ్‌ అని పడుకునేవాడిని.


ఆస్తుల గురించి అమ్మ ఎప్పుడు చెబుతుంది


కానీ, అమ్మది టెలివిజన్‌ కదా.. విరామం లేకుండా ఆమె షూటింగ్‌ చేస్తూనే ఉండాలి. పొద్దున్నుంచి సాయంత్రం వరకు చేస్తూనే ఉండాలి. అంత బిజీ షెడ్యూల్లో కూడా చెల్లికి నాకు టైం కేటాయించేది. చెల్లిని నన్ను పడుగోబెట్టి మళ్లీ పొద్దున్నే షూటింగ్‌ వెళ్లేది. ఇంత చేసి కూడా ఆమె ఒక్కశాతం ఎనర్జీ కూడా తగ్గకుండ ఉండేది. తన విల్‌ పవర్‌ అలాంటిది. అమ్మ దగ్గరి నుంచి అది నేర్చుకోవాలి" అంటూ చెప్పుకొచ్చాడు. సినిమా విషయంలో నాన్న రాజీవ్‌ కనకలా సపోర్టు కూడా చాలా ఉందన్నాడు. తమ ఆస్తులు, షేర్స్‌,ప్రాపర్టీస్ గురించి అమ్మ తమతో ఎప్పుడు చెబుతుందని, ఇంట్లో సాధారణంగా వాటిని గురించి మాట్లాడుకుంటామన్నాడు. తనకు, చెల్లి పేరుపై ఎలాంటి ఆస్తులు ఉన్నాయి, షేర్స్‌ ఎన్ని ఉన్నాయనే వివరాలన్ని చెప్పినట్టు చెప్పాడు.