Rishab Shetty: బుజ్జితో డ్రైవ్‌కి వెళ్లిన ‘కాంతార’ హీరో - ప్రభాస్ అభిమానుల మనసు దోచుకున్న రిషబ్ శెట్టి

Rishab Shetty: ‘కాంతార’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు కూడా దగ్గరయ్యాడు రిషబ్ శెట్టి. తాజాగా ‘కల్కి 2898 AD’కు చెందిన బుజ్జిని ట్రై చేసి తన ఎక్స్‌పీరియన్స్‌ను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

Continues below advertisement

Rishab Shetty: ప్రభాస్ అప్‌కమింగ్ మూవీ ‘కల్కి 2898 AD’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ప్రేక్షకుల్లో మాత్రమే కాకుండా సినీ సెలబ్రిటీల్లో కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ చేయడం కోసం మేకర్స్ కష్టపడుతున్నారు. ముఖ్యంగా బుజ్జి అనే కారునే తమ ప్రమోషనల్ స్ట్రాటజీగా ఉపయోగిస్తున్నారు. వేరే లెవెల్ టెక్నాలజీతో యంగ్ ఇంజనీర్స్ అందరూ కలిసి తయారు చేసిన ఈ బుజ్జిని అన్ని భాషల సినీ సెలబ్రిటీలతో ట్రై చేయిస్తున్నారు. ఈ లిస్ట్‌లోకి ఇప్పుడు కన్నడ హీరో రిషబ్ శెట్టి కూడా యాడ్ అయ్యారు. బుజ్జిని కర్ణాటకకు తీసుకెళ్లి మరీ రిషబ్ ట్రే చేయించారు ‘కల్కి 2898 AD’ టీమ్.

Continues below advertisement

కర్ణాటకలో బుజ్జి..

ఇప్పటికే బుజ్జిని నాగచైతన్య ట్రై చేశాడు. ‘కల్కి 2898 AD’ తెలుగుతో పాటు అనేక భాషల్లో రిలీజ్ అవుతోంది. అందుకే ఇతర భాషల్లో కూడా ఈ మూవీపై హైప్ క్రియేట్ చేయడానికి మేకర్స్ ప్రయత్నిస్తున్నారు. ముందుగా శాండిల్‌వుడ్‌ను వాళ్లు టార్గెట్ చేశారు. ‘కాంతార’ హీరో రిషబ్ శెట్టిని రంగంలోకి దించారు. దీనికోసం బుజ్జిని కర్ణాటకలోని కుందాపూర్ వరకు తీసుకెళ్లారు. అక్కడ బుజ్జితో ఒక రైడ్‌కు వెళ్లాడు రిషబ్ శెట్టి. ఆ తర్వాత తన ఎక్స్‌పీరియన్స్ ఎలా ఉందో షేర్ చేశాడు. అంతే కాకుండా ‘కల్కి 2898 AD’ టీమ్‌కు, ప్రభాస్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. ఈ వీడియోను ‘కల్కి X కాంతార’ అనే క్యాప్షన్‌తో సోషల్ మీడియాలో షేర్ చేశారు మేకర్స్.

అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్..

‘‘కల్కి 2898 ADలో బుజ్జి ఏ రేంజ్‌లో ఉండబోతుంది అని టీజర్‌లోనే అర్థమయ్యింది. బుజ్జిని డ్రైవ్ చేయడం ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్. బుజ్జి, భైరవకు ఆల్ ది బెస్ట్. జూన్ 27న కల్కి రిలీజ్ అవుతుంది. అందరూ థియేటర్లకు వెళ్లి సినిమా చూడండి. ప్రభాస్ సార్‌కు ఆల్ ది బెస్ట్’’ అంటూ బుజ్జి ఎక్స్‌పీరియన్స్‌ను షేర్ చేసుకున్నాడు రిషబ్ శెట్టి. దీంతో మరోసారి బుజ్జి గురించి టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయింది. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ సినిమా గురించి మాట్లాడుకుంటున్న ప్రేక్షకులంతా బుజ్జి గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. మూవీలో బుజ్జిది కీ రోల్ అని భావిస్తున్నారు.

ప్రీ బుకింగ్ బిజినెస్..

నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కల్కి 2898 AD’ గతేడాది విడుదల కావాల్సిందే. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం అవ్వడంతో ఈ ఏడాదికి పోస్ట్‌పోన్ అయ్యింది. ముందుగా మార్చిలో ఈ మూవీ విడుదల అవుతుందని ప్రకటించినా అప్పుడు కూడా వర్కవుట్ అవ్వలేదు. దీంతో ఏకంగా జూన్ 27కు ‘కల్కి 2898 AD’ రిలీజ్ డేట్ షిఫ్ట్ అయ్యింది. ఫైనల్‌గా హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కిన ప్రభాస్ మూవీ విడుదల అవుతుండడంతో ఆడియన్స్ అంతా ఈ సినిమా చూడడానికి పోటీపడుతున్నారు. అందుకే ప్రీ బుకింగ్స్ విషయంలో రికార్డులను క్రియేట్ చేసుకుంటూ వెళ్తోంది ‘కల్కి 2898 AD’.

Also Read: ప్రభాస్ ఫ్యాన్స్‌కు చేతులు జోడించి క్షమాపణలు చెప్తున్నాను, నన్ను తిట్టుకోవద్దు - అమితాబ్ బచ్చన్

Continues below advertisement