KCR Biopic | వివాదాలు ఎక్కడనున్నా అక్కడ రామ్ గోపాల్ వర్మ ఉంటారు. రామ్ గోపాల్ వర్మ ఎక్కడున్నా అక్కడ వివాదాలు ఉంటాయి. సంచలన ప్రకటనలు చేయడంతో ఆర్జీవీ ఎప్పుడూ ముందుంటారు. తన సినిమాకు డబ్బులు వచ్చినా, రాకపోయినా.. ప్రజలకు నచ్చినా నచ్చకపోయినా.. ప్రేక్షకులపై దండయాత్ర చేస్తూనే ఉంటారు. ఒకప్పుడు ఆయన సినిమాలో సబ్జెక్ట్ ఉండేది. కానీ, ఇప్పుడు ‘సబ్జెక్ట్’లే ఆయనకు సినిమాలవుతున్నాయి. ఇప్పటికే ఆయన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును విలన్‌గా చూపిస్తూ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ తీసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల ‘కొండ’ సినిమాతో మరోసారి అందరినీ ఆకట్టుకున్నారు. ఆయన అంతటితో ఆగకుండా తాజాగా మరో ప్రకటన చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బయోపిక్‌ను త్వరలోనే తెరకెక్కిస్తానని ప్రకటించారు. 


మరో సంచలన చిత్రం ‘డేంజరస్’ (తెలుగులో ‘మా ఇష్టం’) సినిమా ప్రమోషన్‌లో రామ్ గోపాల్ వర్మ బిజీగా ఉన్నారు. ఇటీవలే ఈ సినిమాలోని హీరోయిన్లు నయనా గంగూలీ, అప్సర రాణిలో కలిసి బెంగళూరు వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ దివంగత నటుడు పునీత్ రాజ్‌కుమార్ సమాధిని సందర్శించారు. తాజాగా ఆర్జీవీ ఈ చిత్రం ప్రమోషన్ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ కీలక ప్రకటన చేశారు. త్వరలోనే కేసీఆర్ జీవితం ఆధారంగా బయోపిక్ చేయనున్నానని వెల్లడించారు. వివరాలను త్వరలోనే చెబుతానన్నారు. తనకు ‘ది కశ్మీర్ ఫైల్స్’ చిత్రం బాగా నచ్చిందన్నారు. అయితే, వర్మ చెప్పే చిత్రాలు ప్రకటనలకే పరిమితం అవుతాయి. కొన్ని విడుదలకు కూడా నోచుకోవు. ఈ నేపథ్యంలో కేసీఆర్‌తో వర్మ చిత్రం నిజంగా ఉంటుందో లేదో చెప్పడం కష్టమేనని ఆయన అభిమానులే అంటున్నారు.


Also Read: చిరంజీవి హీరోయిన్‌కు టోకరా, నాలుగు కోట్లు కొట్టేసిన కేటుగాడు!


ఎందుకంటే వర్మ 2019లోనే కేసీఆర్ బయోపిక్ తీస్తున్నామని వర్మ ప్రకటించారు. ఆ చిత్రానికి ‘టైగర్ కేసీఆర్’ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు. దానికి ‘The aggressive Gandhi’ అనే ట్యాగ్‌లైన్ ఇచ్చారు. దాని కింద ‘ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు’ అనే మరో తెలుగు ట్యాగ్‌లైన్ పెట్టాడు ఆర్జీవి. అయితే, కొన్ని పెండింగ్ ప్రాజెక్టుల వల్ల ఈ సినిమాను తెరకెక్కిచడం ఆలస్యమవుతోందని ఆర్జీవీ అప్పట్లో వెల్లడించారు. ఒకవేళ వర్మ ఈ సినిమా తీస్తే తప్పకుండా దాన్ని వివాదాస్పదం చేస్తాడని, ఈ చిత్రం కోసం వెయిట్ చేస్తున్నామని తెలుపుతున్నారు. మరి, వర్మ ఏం చేస్తారో చూడాలి. 


కేసీఆర్ పాత ట్వీట్: 






Also Read: పునర్నవి కావాలని చేసిందా? పొరపాటు జరిగిందా?