'ఉరికే నా సిలికా... నీ చక్కనైన పాట మెలిక' అంటున్నారు విశ్వక్ సేన్. ఆయన హీరోగా నటించిన సినిమా 'అశోక వనంలో అర్జున కళ్యాణం'. రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. ఈ సినిమాలో 'రాంసిలకా...' పాటను ఈ రోజు విడుదల చేశారు. ఇదొక బ్రేకప్ సాంగ్. అయితే... రెగ్యులర్ లవ్ ఫెయిల్యూర్ సాంగ్ తరహాలో కాకుండా ఫోక్ జానర్‌లో కొత్తగా ట్రై చేశారు.
'గట్టు దాటి... పుట్ట దాటి... ఏడేడు ఏర్లు దాటి...
కొండ దాటి... కోన దాటి... కోసు కోస్లు దార్లు దాటి...
సీమసింత నీడకు వచ్చానే! రంగు రంగు రాంసిలకా'
అంటూ సాగే ఈ గీతాన్ని రవి కిరణ్ కోలా రాశారు. జై క్రిష్ సంగీతంలో ఆయనే ఆలపించారు కూడా! ఈ సినిమా కథ కూడా ఆయనే రాశారు.
విద్యా సాగర్ చింతా దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్పణలో... ఎస్‌విసిసి డిజిటల్ పతాకంపై ఆయన తనయుడు బాపినీడు, సుధీర్ ఈదర సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఆల్రెడీ సినిమాలో తొలి పాట 'ఓ ఆడపిల్ల... నువ్వు అర్థం కావా?'ను కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు బ్రేకప్ సాంగ్ విడుదల చేశారు.
Also Read: చిరంజీవి హీరోయిన్‌కు టోకరా, నాలుగు కోట్లు కొట్టేసిన కేటుగాడు!
మూడు పదుల వయసు వచ్చినా... పెళ్లి కాని ఓ అబ్బాయి కథాంశంతో ఈ సినిమా రూపొందుతోంది. ప్రస్తుతం పెళ్లి కాని అబ్బాయిల ఇబ్బందులు ఏమిటి? అమ్మాయిల ఆలోచన ఏ విధంగా ఉందనే విషయాలను సినిమాలో చూపించబోతున్నారట. ఏప్రిల్ 22న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
Also Read: ఓలా క్యాబ్ ఎక్కిన హీరోయిన్, ఏసీ ఆపేసిన డ్రైవర్