Renu Desai Shares Daughter Video: సంక్రాంతి నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొడుకు అకిరా నందన్, కూతురు ఆద్యలు హాట్‌టాపిక్ అయ్యారు. సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన వారి ఫొటోలు, వీడియోలో దర్శనం ఇస్తున్నాయి. మెగా సంక్రాంతి సెలెబ్రేషన్స్‌లో అకిరా, ఆద్యలు కూడా భాగమయ్యారు. వారిద్దరిని మెగా ఫ్యామిలీతో కలిపి చూసి ఇటూ ఫ్యాన్స్, అటూ పవర్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ అవుతున్నారు. ఈ ఫొటో షేర్ చేసిన చిరంజీవి మెగా ఫ్యామిలీ మెంబర్స్‌కి థ్యాంక్స్ చెబుతున్నారు. అప్పటి నుంచి అకిరా లుక్, కటౌట్‌పైనే అందరి దృష్టి పడింది. వింటేజ్ పవన్ దొరికాడంటూ అంతా చర్చించుకుంటున్నారు.
ఓవైపు కూతురు కొడుకు మెగా ఫ్యామిలీతో కలిసి సందడి చేస్తుంటే మరోవైపు పవన్ మాజీ భార్య, నటి రేణు దేశాయ్ కేరళలోని అందాలను ఆస్వాధించారు. సంక్రాంతికి కేరళకు వెళ్లిన ఆమె తరచూ ఫొటోలు షేర్ చేస్తూ మురిసిపోయారు. అలా ఈ మధ్య ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటున్న రేణు దేశాయ్ తాజాగా తన కూతురు ఆద్యకు సంబంధించిన ఆసక్తికర వీడియోను షేర్ చేశారు. ఈ సందర్భంగా ట్రోలర్లకు ఆమె గట్టి వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆద్య పంచ్‌లు విసురుతున్న వీడియోను షేర్ చేశారు. ఈ పోస్ట్‌కు క్యూట్ క్యాప్షన్ జత చేశారు ఆమె. "ఇకపై నన్ను ఎవరైనా ఇబ్బంది పెడితే.. నా పర్సనల్ సెక్యూరిటీ మీ తాట తీస్తుంది. జాగ్రత్త" ట్రోలర్స్‌కు ఇన్‌డైరెక్టర్‌గా వార్నింగ్ ఇచ్చారు. కాగా ఆద్య కరాటే నేర్చుకున్నట్టు గతంలో రేణు దేశాయ్ చెప్పిన సంగతి తెలిసిందే.
Also Read: వేణుస్వామితో ఇనయ ప్రత్యేక పూజ - వీడియో వైరల్, ట్రోలర్స్‌కు గట్టి కౌంటరిచ్చిన బ్యూటీ
అందుకే ఇలా వార్నింగ్?
భర్తతో (పవన్ కళ్యాణ్) విడిపోయిన అనంతరం రేణు దేశాయ్ తన కూతురు, కొడుకుతో సింగిల్ జీవిస్తోంది. మెగా ఫ్యామిలీకి దూరంగా మహారాష్ట్రలో నివసిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అప్పుడప్పుడు పవన్‌ను ఉద్దేశిస్తూ తరచూ పోస్ట్స్ షేర్ చేస్తుంది. ఆయన సినీ, రాజకీయ జీవితం గురించి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్, పోస్ట్స్ షేర్ చేస్తూ ఉంటారు. భార్యగా తాను ఎన్నో విషయాల్లో తగ్గి ఉన్నానని, అయినా ఓ భర్తగా ఎప్పుడు ఆయన లేరంటూ ఎన్నో సందర్భాల్లో నోరు విప్పారు. అంతేకాదు తన ఒంటరి లైఫ్, ఎదుర్కొంటున్న సమస్యలపై మాట్లాడుతూ ఎమోషన్ అయ్యేది. అంతేకాదు ఇన్‌డైరెక్ట్ పోస్ట్స్‌తో పవన్‌ను టార్గెట్ చేస్తుండేవారు. కానీ ఆయన రాజకీయ జీవితానికి మాత్రం ఆమె ఎప్పుడూ సపోర్టు చేస్తూనే వస్తున్నారు.
ఈ క్రమంలో పవన్ ఫ్యాన్స్ నుంచి ఆమె తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొనేది. తమ అభిమాన హీరో గురించి మాట్లాడిదే బాగుండదంటూ ఓ వర్గం ఆడియన్స్ హెచ్చరిస్తే.. మరికొందరు వదినా మీ పని మీరు చూసుకోండు అంటూ రెక్వెస్ట్ చేసేవారు. ఇలా తనని ట్రోల్ చేసే వారిని ఉద్దేశిస్తూ రేణు దేశాయ్ ఆద్యతో వార్నింగ్ ఇచ్చారా? అభిప్రాయపడుతున్నారు కొందరు నెటిజన్లు. కాగా రేణూ దేశాయ్ చివరగా టైగర్ నాగేశ్వరరావు అనే చిత్రంలో కనిపించారు. హేమలతా లవణం అనే పాత్రలో చక్కగా, హుందాగా కనిపించి మెప్పించారు. ఇక భవిష్యత్తులో ఇలాంటి ప్రత్యేకమైన, ప్రాధాన్యత ఉన్న పాత్రల వస్తే తప్పకుండ నటిస్తానని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు వెబ్ సిరీస్‌ల్లోనూ నటించేందుకు ఆమె సిద్ధంగా ఉన్నట్టు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం.