Renu Desai Shared Aadhya With Prime Minister Photos: ఆంధ్ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌వ‌న్ క‌ల్యాన్ ఘ‌న విజ‌యం సాధించిన విష‌యం తెలిసిందే. చంద్ర‌బాబు 4.0 కేబినెట్ లో ఆయ‌న మంత్రిగా కూడా ప్ర‌మాణ‌స్వీకారం చేశారు. అయితే, ఎన్నిక‌ల ఫ‌లితాల రోజు నుంచి రేణుదేశాయ్, ప‌వ‌న్ క‌ల్యాణ్ కొడుకు అకీరా నంద‌న్ ప‌వ‌న్ క‌ల్యాణ్ తోనే ఉంటున్నాడు. దానికి సంబంధించి ఫొటోలు, వీడియోలు రేణుదేశాయ్ ఇన్ స్టాలో పోస్ట్ చేస్తూనే ఉన్నారు. నిజానికి ఎన్నిక‌ల ఫ‌లితాలు వ‌చ్చిన రోజు నుంచి ఆమె ఇన్ స్టాలో చాలా యాక్టివ్ గా క‌నిపిస్తున్నారు. ప‌వ‌న్ క‌ల్యాణ్, త‌న కొడుకు, కూతురి గురించి విష‌యాల‌ను షేర్ చేస్తూ ఉన్నారు. భారీ విజ‌యం త‌ర్వాత ప‌వ‌న్ క‌ల్యాణ్ తో పాటు అకీరా మోడీని క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేసిన ఆమె త‌న ఆనందాన్ని వ్య‌క్త‌ప‌రిచారు. అప్పుడు ఆద్య వాళ్ల‌తో లేదు. దానికి రీజ‌న్ చెప్తూ ఇప్పుడు ఆద్య ప్ర‌ధాని మోడీని క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేశారు రేణు. 


చాలా ఆనందంగా ఉంది.. 


ఆద్య‌, అకీరా మెగా ఫ్యామిలీతో క‌లిసి ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌మాణ‌స్వీకారానికి హాజ‌ర‌య్యారు. దానికి సంబంధించిన వీడియో కూడా రేణు దేశాయ్ ఇన్ స్టా స్టోరీలో పెట్టారు. అకీరా, ఆద్య ఇద్ద‌రు ట్రెడిష‌న‌ల్ లుక్ లో క‌నిపించారు. ఇక ఇప్పుడు రేణు దేశాయ్.. వాళ్లిద్ద‌రు ప్ర‌ధాని మోడీని క‌లిసిన ఫొటోల‌ను షేర్ చేశారు. అకీరా నంద‌న్ ఆద్య‌ను ప్ర‌ధానికి ప‌రిచ‌యం చేస్తూ క‌నిపించాడు ఆ ఫొటోలో. దీంతో త‌న‌కు చాలా ఆనందంగా ఉంది అంటూ ఆమె క్యాప్ష‌న్ రాసుకొచ్చారు. 


నాన్న ద్వారా కోరిక తీరింది.. 


"అకీరా వాళ్ల నాన్న‌తో క‌లిసి ప్ర‌ధాని మోడీని క‌లిసిన‌ప్పుడు ఆద్య వెళ్ల‌లేక‌పోయింది. ఆ రోజే స్కూల్ ఓపెన్ అవ్వడం వల్ల సాధ్యం కాలేదు. కానీ, ప్ర‌ధానిని క‌ల‌వాలి అనే త‌న కోరిక మాత్రం తీరింది. నిన్న వాళ్ల నాన్న ఫంక్ష‌న్ లో అకీరా ప్ర‌ధాని మోడీకి ఆద్య‌ను ప‌రిచ‌యం చేశాడు. నేను బీజేపీకి చాలా పెద్ద ఫ్యాన్. కనీసం నా పిల్ల‌లు ఇద్ద‌రు క‌లిసినందుకు చాలా హ్యాపీగా ఉంది. వాళ్ల నాన్న కష్టం వ‌ల్ల నా పిల్ల‌లు ఇద్ద‌రు బీజేపీ ప్ర‌ధాని న‌రేంద్ర మోడీని గారిని క‌లిశారు" అని ఫొటోలు పోస్ట్ చేశారు రేణుదేశాయ్. 






నాన్న‌తోనే అకిరా..


పిఠాపురంలో ఎమ్మెల్యేగా ఘ‌న విజ‌యం సాధించిన రోజు నుంచి అకీరా త‌న తండ్రి ప‌వ‌న్ క‌ల్యాణ్ వెంటే ఉన్నారు. ఆయ‌న‌తో పాటు ప్ర‌ధాని మోడీని క‌లిశారు. ఆ త‌ర్వాత ఢిల్లీ నుంచి చిరంజీవి ఇంటికి వ‌చ్చిన‌ప్పుడు కూడా ప‌వ‌న్ వెంటే ఉన్నాడు అకీరా. ఇక ప‌వ‌న్ క‌ల్యాణ్ మంత్రిగా ప్ర‌మాణ‌స్వీకారం చేసిన రోజు కూడా త‌న చెల్లితో, మెగా ఫ్యామిలీతో క‌లిసి వేడుక‌ల్లో పాల్గొన్నాడు. పంచ క‌ట్టుతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. అకీరా, ఆద్య ఇద్ద‌రు రెడీ అయ్యి రేణు దేశాయ్ కి వీడియో కాల్ చేయ‌గా.. ఆ వీడియోను పోస్ట్ చేశారు రేణు దేశాయ్. ఈసంద‌ర్భంగా పవన్ కళ్యాణ్‌కు కూడా విషెస్ తెలిపారు ఆమె. "ఏపీ రాష్ట్రానికి, సమాజానికి మంచి చేయాలి అనుకుంటున్న ప‌వ‌న్ కళ్యాణ్ గారికి మంచి జరగాలని కోరుకుంటున్నాను" అని విష్ చేశారు రేణు.


Also Read: రేణు దేశాయ్ ఇన్‌స్టా స్టోరీలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం - మరి పవన్ కళ్యాణ్? అందుకే అలా చేసిందా?