Prabhas Best Screen Looks : అందగాడు.. అందరివాడు.. అందుబాటు బంధువు వీడు.. ప్రభాస్​కి యాప్ట్ లిరిక్స్ ఇవి. ఎందుకంటే ప్రభాస్​ ఫ్యాన్సే కాదు.. అందరి ఫ్యాన్స్​కి ఇష్టమైన వ్యక్తి ఈ రెబల్ స్టార్. అంతేనా హీరోలు, హీరోయిన్లు కూడా ఎన్నోసార్లు ప్రభాస్​పై ఉన్న ప్రేమను వ్యక్తం చేశారు. అతని మంచితనానికి, ప్రేమకి పాన్​ ఇండియా లెవెల్​లో ఎందరో డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు. అలాగే అతని లుక్స్​కి కూడా సోషల్ మీడియాలో మంచి క్రేజ్ ఉంది.

ఈశ్వర్ నుంచి మొదలుపెడితే ఇప్పటివరకు చేసిన ప్రతి సినిమాలోనూ ప్రభాస్ కొత్త లుక్స్​తో అభిమానులను ఎంటర్​టైన్ చేస్తూనే ఉన్నాడు. ఏమున్నాడ్రా బాబు.. అనే రేంజ్​లో తన లుక్స్​ మారుస్తూ ఫ్యాన్స్​కు ఫీస్ట్ ఇస్తున్నాడు ఈ రెబల్ స్టార్. మరి ప్రభాస్ కెరీర్​లో టాప్ 10 స్క్రీన్ లుక్స్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. 

వర్షం (2004)

ఈశ్వర్, రాఘవేంద్ర సినిమాల్లో అందంగా కనిపించినా.. మొదటిసారి లవర్​బాయ్​గా కనిపించిన వర్షం లుక్స్​కి అప్పట్లో చాలామంది ఫిదా అయ్యారు. 

ఛత్రపతి (2005)

ప్రభాస్​కి రెబల్ లుక్​ ఇచ్చిన మూవీగా ఛత్రపతి చెప్పొచ్చు. యాక్షన్ హీరో లుక్​లో ప్రభాస్ మూవీకే హైలెట్​గా నిలిచాయి. 

బిల్లా (2009)

బిల్లా ప్రభాస్ డార్క్, గ్యాంగ్‌స్టర్ లుక్​లో స్టైలిష్​గా ఆకట్టుకున్నాడు. డ్యూయల్ రోల్​లో.. స్టైలిష్, క్రోకెడ్ లుక్​తో అలరించారు. 

మిస్టర్ పర్​ఫెక్ట్ (2011)

మిస్టర్ పర్​ఫెక్ట్ సినిమాలో ప్రభాస్ సాఫ్ట్ రొమాంటిక్ హిరోగా కనిపించాడు. ఈ సినిమాలో ఫ్యాషన్ ఫార్వార్డ్ లుక్​లో కొత్తగా కనిపించారు. 

మిర్చి (2013)

ప్రభాస్ బెస్ట్ స్టైలిష్ లుక్​లో ఈ సినిమాలో కనిపించాడు. అబ్రాడ్​ లుక్​కి, ఇండియా లుక్​కి చాలా డిఫరెన్స్ చూపించాడు. 

బాహుబలి (2015)

ఈ సినిమాలో రాజుగా కనిపించిన ప్రభాస్​ని చూస్తే నిజంగానే కింగ్​ అనుకుంటారు.

సాహో (2019)

ప్రభాస్ మోస్ట్ స్టైలిష్ లుక్​లో కనిపించిన చిత్రం సాహో. మునుపెన్నడూ చూడని విధంగా కనిపించారు. 

సలార్ (2023)

సలార్ సినిమాకి.. మాస్​ హీరోగా రఫ్​ లుక్​లో కనిపించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 

రాజాసాబ్ 

రాజాసాబ్ లుక్స్​ కూడా అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఫస్ట్ లుక్, ట్రైలర్, విజువల్స్​లో వింటేజ్ ప్రభాస్ కనిపించాడు అంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. 

డార్లింగ్ సినిమాలో కూడా ఎవరూ ట్రై చేయని ఫ్యాషన్ లుక్​లో కనిపించాడు ప్రభాస్. తను చేసిన  ప్రతి సినిమాలో లుక్​ని మార్చి అభిమానులు అలరించాడు. కల్కీ, రాధే శ్యామ్, ఆది పురుష్​ ఇలా ప్రతి సినిమాల్లోనూ వైవిధ్యంగా కనిపించాడు.