Raviteja's Mass Jathara Super Duper Hit Song Released: మాస్ మహారాజ రవితేజ ఆర్ఫీఎఫ్ ఆఫీసర్‌గా రాబోతోన్న లేటెస్ట్ పవర్ ఫుల్ మాస్ ఎంటర్టైనర్ 'మాస్ జాతర'. ఆయన సరసన యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్‌గా నటించారు. ఈ నెల 31న మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా... ఇప్పటికేే రిలీజ్ అయిన మాస్, లవ్ సాంగ్స్ ఓ ఊపు ఊపేస్తున్నాయి. తాజాగా మరో మాస్ బ్లస్టర్‌ను రిలీజ్ చేశారు.

Continues below advertisement

సూపర్ డూపర్ హిట్ సాంగ్

'ఈ పాటకు రిథమ్ లేదు కదం లేదు పదం లేదు అర్థం లేదు పర్థం లేదు స్వార్థం గీర్థం అస్సలు లేదు సూపర్ డూపర్ హిట్ సాంగ్' అంటూ మాస్ లిరిక్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. రవితేజ, శ్రీలీల ఫుల్ జోష్, ఎనర్జీతో వేసిన స్టెప్పులు అదిరిపోయాయి. 'సిగ్నేచర్ స్టెప్పు ఉంటేనే బ్లాస్ట్ అవుతుందా?', 'ఏదో సిట్యువేషన్ ఉంటేనే హిట్ అవుతుందా?', 'పబ్లిసిటీ ఉంటేనే ట్రెండ్ అవుతుందా?' అంటూ ప్రస్తుత సిచ్యువేషన్‌కు తగ్గట్లుగా సాగిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. ఈ పాటకు సురేష్ గంగుల లిరిక్స్ అందించగా... మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ సిసిరోలియో, రోహిణి కలిసి పాడారు.

Continues below advertisement

Also Read: సిల్వర్ స్క్రీన్‌పై 'గుమ్మడి నర్సయ్య' లైఫ్ స్టోరీ - లీడ్ రోల్ ఎవరో తెలుసా?... ఫస్ట్ తెలుగు డెబ్యూమూవీతోనే...

ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి 3 సాంగ్స్ రిలీజ్ చేశారు. మేరా లవర్, హుడియో హుడియో, ఓలే ఓలే సాంగ్స్ ఓ ఎత్తైతే... తాజాగా విడుదలైన సూపర్ డూపర్ హిట్ సాంగ్ మరో ఎత్తు అనేలా ఉంది. టైటిల్‌కు తగ్గట్లుగానే రవితేజ అభిమానులకు, మాస్ ఆడియన్స్‌కు ఫుల్ ట్రీట్ అందించేలా మూవీ ఉండబోతోందని అర్థమవుతోంది. లాస్ట్‌గా వచ్చిన మిస్టర్ బచ్చన్ నిరాశపర్చగా... చాలా రోజుల తర్వాత రవితేజ హిట్ కొట్టడం కన్ఫర్మ్ అంటూ ఆయన అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. 

ఈ మూవీకి భాను భోగవరపు దర్శకత్వం వహిస్తుండగా... రవితేజ కెరీర్‌లో ఇది 75వ మూవీ. రవితేజ, శ్రీలీల కాంబోలో రెండో మూవీ. ఇంతకు ముందు వచ్చిన 'ధమాకా' బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకుంది. ఆ మూవీకి కూడా భీమ్స్ సూపర్ హిట్ మ్యూజిక్ అందించారు. మాస్ పల్స్‌కు తగ్గట్లుగా ఆయన బీజీఎం, సాంగ్స్ వేరే లెవల్‌లో ఉన్నాయి. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ కావాల్సిన మూవీ వివిధ కారణాలతో వాయిదా పడింది. ఈ నెల 31న ప్రేక్షకుల ముందుకు రానుంది.