Prabhas Hanu Raghavapudi Movie Fauji First Look Out: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, స్టార్ డైరెక్టర్ హను రాఘవపూడి అవెయిటెడ్ పీరియాడికల్ డ్రామా నుంచి బిగ్ అప్డేట్ వచ్చేసింది. ఈ మూవీకి 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేయగా ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ లుక్ భారీ హైప్ క్రియేట్ చేసింది. ప్రభాస్ బర్త్ డే సందర్భంగా తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ గూస్ బంప్స్ తెప్పిస్తోంది.
మిలిటరీ బ్యాక్ డ్రాప్... వారియర్ ప్రభాస్
'ఫౌజీ' అంటేనే సైనికుడు అని అర్థం. ఈ టైటిల్ ద్వారానే మూవీ స్టోరీని చెప్పకనే చెప్పేశారు డైరెక్టర్ హను. యుద్ధం బ్యాక్ డ్రాప్‌తో పాటు పవర్ ఫుల్ యోధుడిగా ప్రభాస్ కనిపించనున్నట్లు అర్థమవుతోంది. భారతదేశానికి స్వాతంత్ర్యం రాక ముందే జరిగిన కథ సమరయోధుల పోరాటాన్ని ఇందులో చూపించనున్నట్లు తెలుస్తోంది. 'చరిత్రలో దాగి ఉన్న అధ్యాయాల నుంచి ఓ సైనికుడు అత్యంత ధైర్యవంతమైన కథ' అంటూ రాసుకొచ్చారు మేకర్స్.
'పద్మవ్యూహ విజయ పార్థః పాండవపక్షే స్థాపించిన కర్ణః గురు రహిత ఏకలవ్యః జన్నైవ చ యోద్ధ ఏషః ||' అంటూ తెలపగా... మహాభారతంలో 'పార్థ, కర్ణ, ఏకలవ్య' అందరి యోధులను మించి ఉండే యోధుడు అని అర్థం వచ్చేలా... 1930వ దశకంలో జరిగిన ఘటనల ఆధారంగా స్టోరీని రూపొందించనున్నట్లు అర్థమవుతోంది. సైనికుడిగా ప్రభాస్ లుక్ అదిరిపోయింది.
ప్రీ లుక్ హింట్స్ ఇవే...
ఈ మూవీ అనౌన్స్‌మెంట్ వచ్చినప్పటి నుంచి భారీ హైప్ క్రిియేట్ అవుతుండగా... ఇప్పటివరకూ ఎలాంటి అప్డేట్స్ కూడా లేవు. రీసెంట్‌గా ప్రీ లుక్ రిలీజ్ చేయగా... స్టోరీపై మేకర్స్ కొన్ని హింట్స్ ఇచ్చినట్లు అర్థమవుతోంది. 'A Batalion who walks alone', 'most wanted since 1932' అంటూ మెన్షన్ చేయగా... ఓ బెటాలియన్‌కు నాయకుడు ప్రభాస్ అని తెలుస్తోంది. ఇక 1932 నుంచి మోస్ట్ వాంటెడ్ అని రాయగా... రెండో ప్రపంచ యుద్ధం టైంలో బ్యాక్ డ్రాప్‌తో పాటు స్వాతంత్ర్య సమరయోధులను చూపించనున్నట్లు సమాచారం.
ప్రీ లుక్‌లో కొన్ని సంస్కృత పదాలు కూడా రాయగా... మహాభారతానికి లింక్ పెట్టినట్లు తెలుస్తోంది. పద్మవ్యూహాన్ని ఛేదించిన అర్జునుడితో ప్రభాస్‌ను పోల్చినట్లు అర్థమవుతోంది. ప్రీ, ఫస్ట్ లుక్ హైప్ పదింతలు పెంచేశాయి. ఈ మూవీని ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా? అంటూ డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
మూవీలో ప్రభాస్ సరసన ఇమాన్వీ హీరోయిన్‌గా నటిస్తుండగా ఆమెకు ఇదే ఫస్ట్ మూవీ. వీరితో పాటే అనుపమ్ ఖేర్, జయప్రద, భానుచందర్, మిథున్ చక్రవర్తి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ చిత్ర నిర్మాణ సంస్థ 'మైత్రీ మూవీ మేకర్స్' భారీ బడ్జెట్‌తో మూవీని తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది ఆగస్టులో మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు.
Also Read: 'మాస్ జాతర' సూపర్ డూపర్ హిట్ సాంగ్ అదిరిపోయింది - రవితేజ, శ్రీలీల మాస్ బ్లస్టర్