Actress Sai Pallavi : సౌత్ నాచురల్ బ్యూటీ సాయి పల్లవి రామ్ చరణ్ కి జోడిగా నటిస్తోందా? అంటే అవుననే అంటున్నాయి సినీ వర్గాలు. ప్రస్తుతం ఈ న్యూస్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారింది. ఇంతకీ రామ్ చరణ్, సాయి పల్లవి జోడిగా ఏ సినిమాలో నటిస్తున్నారు? అనే వివరాల్లోకి వెళితే.. గ్లామర్ రోల్స్ దూరంగా ఉంటూ క్యారెక్టర్ ఇంపార్టెన్స్ రోల్స్ లో నటిస్తూ అగ్ర హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది సాయి పల్లవి. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశం వచ్చినా, తన పాత్రకి ప్రాధాన్యత ఉంటే మాత్రమే ఓకే చెబుతుంది. అలా ఇప్పటికే మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో ఛాన్స్ వచ్చినా కథ విని తన పాత్రకి ఎటువంటి గుర్తింపు లేకపోవడంతో నో చెప్పేసింది.


అందుకే ఆమె దగ్గరికి వెళ్లే కథలు, కథ చెప్పే దర్శకులు కూడా ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సాయి పల్లవి కమర్షియల్ సినిమాలు చేయదు. ఒకవేళ చేసినా అందులో తన క్యారెక్టర్ కు మంచి స్కోప్ ఉండాలి. టాలీవుడ్ లో ఈ మధ్య అలాంటి స్కోప్ ఉన్న క్యారెక్టర్స్ ఏమీ దొరకలేదేమో? అందుకే కొంత గ్యాప్ తీసుకుంది ఈ ముద్దుగుమ్మ. 'గార్గి' మూవీ తర్వాత సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చిన సాయి పల్లవి రీసెంట్ గా కోలీవుడ్లో శివ కార్తికేయన్ తో ఓ సినిమా చేస్తోంది. ఇక తాజాగా టాలీవుడ్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో జోడి కట్టబోతుందని ఓ న్యూస్ బయటకు వచ్చింది. 'ఉప్పెన' మూవీ ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే.


ఈ సినిమాలోనే సాయి పల్లవి హీరోయిన్ గా నటించబోతుందని అంటున్నారు. ఈ సినిమాలో హీరోయిన్ గా రకరకాల పేర్లు వినిపించాయి. ఇప్పటికే కొంతమంది పేర్లు కూడా బయటకు వచ్చాయి. కానీ అఫీషియల్ గా కన్ఫర్మ్ కాలేదు. ఇందులో మొదటగా మృణాల్ ఠాకూర్ పేరు వినిపించింది. ఆ తర్వాత జాన్వి కపూర్ పేరు కూడా బయటికి వచ్చింది. ఇక ఇప్పుడు సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుందని ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా సాగే ఈ మూవీకి హీరోయిన్ గా సాయి పల్లవి అయితే బాగుంటుందని బుచ్చిబాబు భావించారట. కథ ప్రకారం హీరోయిన్ పల్లెటూరి అమ్మాయి పాత్ర కావడం, నటనకు ప్రాధాన్యత ఉండడంతో సాయి పల్లవి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని అంటున్నారు.


అంతేకాదు త్వరలోనే షూటింగ్ కూడా మొదలు కాబోతున్న ఈ మూవీలో కోలీవుడ్ విలక్షణ నటుడు విజయ్ సేతుపతి కీలకపాత్రలో కనిపించబోతున్నారట. ప్రస్తుతానికి హీరోయిన్ విషయమై మూవీ టీం నుంచి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ త్వరలోనే దీనిపై అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇస్తారేమో చూడాలి. మైత్రి మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమా, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై సంయుక్తంగా రూపొందుతున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారు.


Also Read : డ్రస్సు కారణంగా అనసూయ పాట్లు - కానీ ఫ్యాన్స్‌ను డిజప్పాయింట్ చేయకుండా - పుష్ప 2 అప్‌డేట్ కూడా!