మాస్ మహారాజా రవితేజ (Ravi Teja), తెలుగు చిత్రసీమలో వరుస సినిమాలు నిర్మిస్తూ అగ్ర నిర్మాణ సంస్థగా ఎదిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ (People Media Factory)ది సూపర్ డూపర్ హిట్ కాంబినేషన్! 'ధమాకా' ఈ కలయికలో వచ్చింది. ఇప్పుడు ఆ సంస్థలో రవితేజ మరో సినిమా చేస్తున్నారు. అది సంక్రాంతికి విడుదల చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు.
జనవరి 13న 'ఈగల్' విడుదల
'ధమాకా' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత రవితేజ కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ ప్రొడ్యూస్ చేసిన సినిమా 'ఈగల్' (Eagle Telugu Movie). టీజీ విశ్వ ప్రసాద్ నిర్మాత. ఈ చిత్రానికి యంగ్ అండ్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. దీని కంటే ముందు నిఖిల్ సిద్ధార్థ హీరోగా ఆయన 'సూర్య వర్సెస్ సూర్య' చేశారు.
'ఈగల్' సినిమాను సంక్రాంతి బరిలో విడుదల చేస్తామని చాలా రోజుల క్రితమే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వెల్లడించింది. ఇవాళ ఆ మాటను మరోసారి చెప్పింది. అంతే కాదు... 'మొండోడు పండగ తీసుకుని పదమూడున వస్తున్నాడు' అంటూ విడుదల తేదీ కూడా వెల్లడించింది. జనవరి 13న థియేటర్లలోకి సినిమాను తీసుకు వస్తున్నట్లు స్పష్టం చేసింది.
Also Read : 'టైగర్ 3'తో సల్మాన్ 1000 కోట్లు కొడతాడా? - ఇండియాలో వెయ్యి కోట్ల హీరోలు ఎవరో తెలుసా?
ప్రస్తుతానికి సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ మహేష్ బాబు 'గుంటూరు కారం', 'ది' విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమాతో పాటు తేజా సజ్జా 'హను - మాన్' సినిమాలు ఉన్నాయి. ప్రభాస్ 'కల్కి' సైతం సంక్రాంతికి విడుదల అవుతుందని అనౌన్స్ చేశారు. కానీ, విడుదల కావడం అనుమానమే.
'ఈగల్' సినిమాలో రవితేజ మల్టీ షేడ్స్ ఉన్న క్యారెక్టర్లో నటిస్తున్నారు. ఆయనకు జోడీగా అనుపమా పరమేశ్వరన్ (Anupama Parameswaran) నటిస్తున్నారు. ఆమె మొదటి కథానాయికగా నటిస్తుండగా... 'ఏక్ మినీ కథ' ఫేమ్ కావ్య థాపర్ (Kavya Thapar) మరో కథానాయికగా నటిస్తున్నారు. నవదీప్, అవసరాల శ్రీనివాస్, మధు బాల ఇతర ముఖ్య తారాగణం.
Also Read : డైనోసార్ ప్రభాస్ ముందు వెంకటేష్, నాని, నితిన్ నిలబడతారా?
ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత : సుజిత్ కుమార్ కొల్లి, ప్రొడక్షన్ డిజైనర్ : శ్రీనాగేంద్ర తంగాల, స్టైలిస్ట్ : రేఖ బొగ్గరపు, కూర్పు : కార్తీక్ ఘట్టమనేని, మాటలు : మణిబాబు కరణం, స్క్రీన్ ప్లే : కార్తీక్ ఘట్టమనేని - మణిబాబు కరణం, పాటలు : చైతన్య ప్రసాద్, రెహమాన్ & కళ్యాణ్ చక్రవర్తి, యాక్షన్: రామ్ లక్ష్మణ్, రియల్ సతీష్ & టోమెక్, సంగీతం : దవ్‌జాంద్ (Davzand), నిర్మాణ సంస్థ : పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, సహ నిర్మాత: వివేక్ కూచిభొట్ల, నిర్మాత : టిజి విశ్వ ప్రసాద్, రచన & దర్శకత్వం : కార్తీక్ ఘట్టమనేని.
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial