Maadhav Bhupathiraju's Maremma Glimplse Out: మాస్ మహారాజ ఫ్యామిలీ నుంచి మరో మాస్ హీరో ఎంట్రీ అదిరిపోయింది. హీరో రవితేజ సోదరుడు, నటుడు రఘు కుమారుడు మాధవ్ భూపతి రాజు రూరల్ రస్టిక్ మూవీ 'మారమ్మ'తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ఆకట్టుకోగా ఆయన బర్త్ డే సందర్భంగా టీం గ్లింప్స్ రిలీజ్ చేస్తూ సర్ ప్రైజ్ ఇచ్చారు.
మాస్ లుక్‌లో...
ఈ మూవీతో మాధవ భూపతిరాజు హీరోగా ఎంట్రీ ఇస్తుండగా... మాస్ రగ్డ్ లుక్‌లో అదరగొట్టారు. పొడవాటి జుట్టు, గుబురు గెడ్డంతో కబడ్డీ ఆడుతున్నట్లుగా ఎంట్రీ అదిరిపోయింది. గ్రామీణ నేపథ్యంలో పవర్ ఫుల్ మాస్ యాక్షన్ డ్రామాగా మూవీని రూపొందిస్తున్నారు. ఈ మూవీకి మంచాల నాగరాజ్ దర్శకత్వం వహిస్తుండగా... మోక్ష ఆర్ట్స్ బ్యానర్‌పై మయూర్ రెడ్డి బండారు నిర్మిస్తున్నారు.
Also Read: సౌందర్యతో పాటు నేనూ వెళ్లాల్సింది - భర్త చనిపోయిన వారానికే రెండో పెళ్లి ప్రచారం చేశారన్న మీనా
మాధవ్ భూపతి రాజు ఇంతకు ముందు 'మిస్టర్ ఇడియట్' మూవీలో నటించారు. ఇప్పుడు హీరోగా 'మారెమ్మ'తో ఎంట్రీ ఇస్తున్నారు. మూవీలో దీపా బాలు హీరోయిన్‌గా నటిస్తుండగా... వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, దయానంద్ రెడ్డి, రూపా లక్ష్మి తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రశాంత్ విహారి మ్యూజిక్ అందిస్తున్నారు.