Ramya Krishna Joins In Dulquer Salmaan dq41 Movie: 'మహానటి', 'లక్కీ భాస్కర్' వంటి మూవీస్‌తో టాలీవుడ్‌లో ఫుల్ క్రేజ్ సంపాదించుకున్నారు మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్. రీసెంట్‌గా వచ్చిన 'కొత్త లోక చాప్టర్ 1: చంద్ర' హిట్ కావడంతో నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అందుకున్నారు. ఆయన డైరెక్ట్‌గా తెలుగులో బుట్ట బొమ్మ పూజా హెగ్డేతో 'DQ41' మూవీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీకి సంబంధించి బిగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
శివగామి ఎంట్రీ
ఈ మూవీలో సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించనున్నారు. సోమవారం ఆమె పుట్టిన రోజు సందర్భంగా మూవీ టీం అఫీషియల్‌గా అనౌన్స్ చేసింది. 'తన నటనతో తరతరాలుగా సిల్వర్ స్క్రీన్‌ను పాలించి ఎంతో మంది హృదయాలను గెలుచుకున్నారు. రమ్యకృష్ణ గారికి టీమ్ DQ41 తరఫున పుట్టిన రోజు శుభాకాంక్షలు. ఈ అందమైన కథలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని ప్రకటించడానికి చాలా సంతోషంగా ఉంది.' అంటూ ట్వీట్ చేశారు.
Also Read: 'మిరాయ్' చూసి నన్ను నేనే కొట్టుకున్నా - అడ్వెంచర్‌పై RGV రివ్యూ... మంచు మనోజ్ రియాక్షన్
రోల్ ఏంటంటే?
మూవీలో రమ్యకృష్ణ రోల్ ఏంటి అనే దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది. త్వరలోనే దీనిపై అప్డేట్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటే ఇతర వివరాలు వెల్లడి కానున్నాయి.
ఇక దుల్కర్ సల్మాన్‌కు ఇది 41వ సినిమా కాగా ఆయన సరసన బుట్ట బొమ్మ పూజా హెగ్డే నటిస్తున్నారు. ఓ అందమైన లవ్ స్టోరీ అని అనౌన్స్‌మెంట్ వీడియో బట్టి తెలుస్తుండగా... ఈ మూవీతోనే రవి నేలకుడిటి డైరెక్టర్‌గా పరిచయం అవుతున్నారు. SLV సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి మూవీని నిర్మిస్తున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్ అందిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, కన్నడ, తమిళం, మలయాళ భాషల్లో మూవీ రిలీజ్ కానుంది.