Raviteja's Mass Jathara Movie Release Postponed: మాస్ మహారాజ రవితేజ ఫ్యాన్స్‌కు ఇది నిజంగా బ్యాడ్ న్యూస్. ఆయన ఫుల్ మాస్ ఎంటర్‌టైనర్‌ 'మాస్ జాతర'ను ఎప్పుడెప్పుడు చూద్దామా? అంటూ ఆసక్తిగా ఎదురు చూస్తోన్న వారికి మళ్లీ నిరాశే ఎదురైంది. ఈ నెల 27న మూవీ రిలీజ్ కావాల్సి ఉండగా మళ్లీ వాయిదా వేశారు. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడిన మూవీ వివిధ కారణాలతో మళ్లీ పోస్ట్ పోన్ అయ్యింది.

అసలు రీజన్ ఏంటంటే?

ఇటీవల పరిశ్రమ వ్యాప్తంగా జరిగిన సమ్మెలు, కీలకమైన కంటెంట్ పూర్తి చేయడంలో ఊహించని జాప్యం కారణంగా మూవీని అనుకున్న టైంకు రెడీ చేయలేకపోయినట్లు నిర్మాతలు అధికారికంగా తెలిపారు. కంగారుగా సినిమాని రిలీజ్ చేయడం కంటే.. కాస్త టైం తీసుకొని అత్యుత్తమ చిత్రంగా మలిచి, ప్రేక్షకులకు గొప్ప ఎక్స్‌పీరియన్స్ అందించాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు.

'మాస్ జతార చిత్రాన్ని అసలైన పండుగ సినిమాగా తీర్చిదిద్దడానికి ప్రతి విభాగం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. ప్రస్తుతం చిత్రానికి సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి. కొత్త విడుదల తేదీ ఇంకా ఖరారు కానప్పటికీ, త్వరలోనే ప్రకటన వస్తుంది. అభిమానులు నిరీక్షణకు బహుమానంగా త్వరలో ఆశ్చర్యకర కంటెంట్ రాబోతుంది.' అంటూ నిర్మాతలు హామీ ఇచ్చారు.

Also Read: దేవుణ్ణి మోసం చేయలేరు... ప్రియురాలితో హీరో రవి తిరుమల దర్శనంపై భార్య సెటైర్లు

భాను భోగవరపు దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీలో రవితేజ సరసన టాలీవుడ్ బ్యూటీ శ్రీలీల నటిస్తుండగా... 'ధమాకా' తర్వాత వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో మూవీ ఇది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు మూవీని రూపొందిస్తుండగా... సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్స్, లుక్స్, టీజర్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. మూవీలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా రవితేజ కనిపించనున్నారు. టైటిల్‌కు తగ్గట్లుగానే ఫ్యాన్స్‌కు ఫుల్ మాస్ ఎంటర్‌టైన్‌మెంట్ ట్రీట్ అందనుందనే కామెంట్స్ కూడా వచ్చాయి. అయితే, అనుకోని కారణాలతో పలుమార్లు వాయిదా పడుతుండడంతో ఫ్యాన్స్ నిరాశ చెందుతున్నారు. 

'మాస్ జాతర'తో మాస్ మహారాజ రవితేజ మళ్లీ హిట్ కమ్ బ్యాక్ ఇవ్వాలంటూ ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. 'క్రాక్' తర్వాత అంతటి స్థాయిలో ఆయన ఖాతాలో హిట్ పడలేదు. రీసెంట్‌గా వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది. రవితేజ, శ్రీలీల జంటగా నటించిన 'ధమాకా' మంచి హిట్ సాధించింది. ఈ మూవీ కూడా అదే రిజల్ట్ రిపీట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఆయన కెరీర్‌లో ఇది 75వ సినిమా కావడం మరో విశేషం.