మాస్ మహారాజా అంటే మాస్ సినిమాలకు‌ పెట్టింది పేరు. రవితేజ అంటే సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఆయనకు సపరేట్ కామిడీ టైమింగ్ ఉంది. రవితేజ నుంచి ప్రేక్షకులు ఆశించే మాస్ అంశాలతో పాటు ఆయన వినోదాన్ని మాస్ జాతర అందిస్తుందని చెప్పాలి.

రవితేజ పుట్టినరోజు కానుకగా 'మాస్ జాతర' గ్లింప్స్!మాస్ మహారాజ రవితేజ (Ravi Teja) కథానాయకుడు నటిస్తున్న ప్రతిష్టాత్మక 75వ సినిమా 'మాస్ జాతర' (Mass Jathara). భాను భోగవరపు దర్శకుడు. ఈ చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌, ఫార్చూన్‌ ఫోర్‌ సినిమాస్‌ సంస్థలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రొడ్యూస్ చేశారు. 

ఈ రోజు (జనవరి 26వ తేదీన) రవితేజ పుట్టినరోజు సందర్భంగా 'మాస్ జాతర' గ్లింప్స్ విడుదల చేశారు. వింటేజ్ రవితేజ అంటూ ఒకప్పటి రవితేజను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. అసలు సిసలైన మాస్ మహారాజాను గుర్తు చేసేలా ఉంది. మాస్ మూమెంట్స్, కామెడీ టైమింగ్, 'మనదే ఇదంతా' అని చెప్పిన తీరు గానీ ఆకట్టుకునేలా ఉంది.

మాస్ ప్రేక్షకులు మెచ్చేలా, అభిమానులు విజిల్స్ అండ్ క్లాప్స్ కొట్టేలా దర్శకుడు భాను బోగవరపు 'మాస్ జాతర'ను తెరకెక్కిస్తున్నారని నిర్మాతలు తెలిపారు. సంగీత సంచలనం భీమ్స్ సిసిరోలియో 'మాస్ జాతర' గ్లింప్స్‌కు అందించిన నేపథ్య సంగీతం రవితేజ ఎనర్జీకి ఏమాత్రం తగ్గలేదు. వేసవి సందర్భంగా మే 9న సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

Also Read: ప్రజల నాయకుడిగా దళపతి విజయ్... 'భగవంత్ కేసరి' రీమేక్ Thalapathy 69 ఫస్ట్ లుక్ చూశారా?

బ్లాక్ బస్టర్ 'ధమాకా' తర్వాత రవితేజ సరసన మరోసారి యువ సంచలనం, తెలుగు అమ్మాయి శ్రీ లీల కథానాయికగా నటిస్తున్నారు. 'ధమాకా' తరహాలో ఈ 'మాస్ జాతర' కూడా బ్లాక్ బస్టర్ అందుకోవడం ఖాయమని చిత్ర బృందం నమ్మకంగా ఉంది. గ్లింప్స్ అయితే 'మాస్ జాతర'పై అంచనాలను రెట్టింపు చేసింది.

Also Readఅక్కినేని ఫ్యామిలీ విషెస్ చెప్పడమే బ్యాలెన్స్... ఏపీ సీఎం to మెగాస్టార్ - బాలకృష్ణకు పద్మభూషన్ వచ్చాక ఎవరెవరు కంగ్రాట్స్ చెప్పారంటే?

మాస్ మహారాజా రవితేజ, శ్రీ లీల జంటగా నటిస్తున్న 'మాస్ జాతర' సినిమాకు ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఫణి కె. వర్మ, కళ: శ్రీ నాగేంద్ర తంగాల, ఛాయాగ్రహణం: విధు అయ్యన్న, కూర్పు: నవీన్ నూలి, సంగీతం: భీమ్స్ సిసిరోలియో, రచన: భాను బోగవరపు - నందు సవిరిగాన, సమర్పణ: శ్రీకర స్టూడియోస్, బ్యానర్స్: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ - ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌, నిర్మాతలు: సూర్యదేవర నాగవంశీ - సాయి సౌజన్య, దర్శకత్వం: భాను బోగవరపు.