రవితేజకు కొన్నాళ్లుగా సరైన విజయాలు లేవు. 'వాల్తేరు వీరయ్య' తర్వాత నికార్సైన సక్సెస్ రాలేదు. 'రావణాసుర' నుంచి 'భర్త మహాశయులకు విజ్ఞప్తి' వరకు ప్రతి సినిమా బోల్తా కొట్టింది. ఈ తరుణంలో మాస్ మంత్రం పక్కన పెట్టి... కంటెంట్ బేస్డ్ సినిమా చేస్తున్నారు మాస్ మహారాజా. అదే 'ఇరుముడి'. ఆ సినిమా విడుదలపై లేటెస్ట్ అప్డేట్ ఏమిటంటే?

ఆగస్టులో 'ఇరుముడి' విడుదల!?రవితేజ 'ఇరుముడి' చిత్రానికి శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఇందులో ప్రియా భవానీ శంకర్‌ హీరోయిన్. అయ్యప్ప స్వామి మాలధారణతో ఉన్న రవితేజను ఫస్ట్ లుక్‌ పోస్టర్‌గా విడుదల చేశారు. అది ఆడియన్స్ అందరిలోనూ క్యూరియాసిటీని పెంచింది. ఈ సినిమా చిత్రీకరణ చివరి దశకు వచ్చిందని తెలిసింది. 

ఆగస్టులో 'ఇరుముడి'ని విడుదల చేయడానికి మైత్రి మూవీ మేకర్స్ అధినేతలు నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతానికి ఆగస్టులో ఎక్కువ సినిమాలు లేవు. ఆగస్టు 21న నాని 'ది ప్యారడైజ్', 28న శర్వానంద్ 'భోగి' ఉన్నాయి. ఆగస్టు మొదటి రెండు వారాలు ప్రస్తుతానికి ఖాళీ. ఆ టైంలో 'ఇరుముడి' విడుదల చేసే అవకాశం ఉంది.

Also Read: Peddi Japan Release Update - రామ్ చరణ్ జపాన్ ఫ్యాన్స్‌కు నిరాశ... 'పెద్ది' విడుదలలో పెద్ద ట్విస్ట్

'ఇరుముడి'లో రవితేజ స్వామి మాల ధరించినప్పటికీ... ఇందులో యాక్షన్ కూడా ఉందట. అద్భుతమైన కథ, కంటెంట్ సహా అభిమానులు ఆశించే యాక్షన్, ఫ్యామిలీ ఎమోషన్స్ కూడా ఉన్నాయటని చిత్ర బృందం చెబుతోంది. రవితేజ ఇంతకు ముందు పోషించిన పాత్రలు అన్నింటిలోనూ ఈ సినిమాలో భిన్నమైన పాత్రను పోషిస్తున్నారని చెబుతున్నారు. రవితేజ కుమార్తెగా నటించిన 'బేబీ' నక్షత్ర కనిపించనుంది. ఈ సినిమాతో రవితేజ గ్యారెంటీగా కమ్ బ్యాక్ ఇస్తారని, అందులో మరో డౌట్ లేదని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి.

Also Read: Mouni Roy Disha Patani Relationship - ఎఫైర్ కాదు... దిశాతో రిలేషన్షిప్ గురించి మౌనీ రాయ్ క్లారిటీ

Irumudi Movie Cast And Crew List: రవితేజ, ప్రియా భవానీ శంకర్, 'బేబీ' నక్షత్ర ప్రధాన పాత్రలు పోషిస్తున్న 'ఇరుముడి' సినిమాలో సాయి కుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక, మీసాల లక్ష్మణ్, రాజ్ కుమార్ కసిరెడ్డి, రమణ భార్గవ్, కిషోర్ కంచెరపాలెం, కార్తీక్ అడుసుమల్లి, మహేష్ ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి కథ - స్క్రీన్‌ ప్లే - మాటలు - దర్శకత్వం: శివ నిర్వాణ, నిర్మాతలు: నవీన్ యెర్నేని - వై రవిశంకర్, నిర్మాణ సంస్థ: మైత్రీ మూవీ మేకర్స్, సంగీత దర్శకుడు: జీవీ ప్రకాష్ కుమార్, ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, ప్రొడక్షన్ డిజైనర్: సాహి సురేష్, కూర్పు: ప్రవీణ్ పూడి, స్క్రిప్ట్ కో-ఆర్డినేటర్: నరేష్ బాబు పి, స్టంట్స్: అనల్ అరసు - రియల్ సతీష్.

Also Read: Drishyam 3 Collections Day 6 - మంగళవారం పర్వాలేదు... స్టడీగా మోహన్ లాల్ 'దృశ్యం 3' కలెక్షన్లు - టోటల్ ఎన్ని కోట్లు వచ్చాయంటే?