Ravi Kishan On Allu Arjun Arrest: ఫిల్మ్ ఇండస్ట్రీకి చీకటి రోజు... అల్లు అర్జున్ అరెస్టుపై ఘాటుగా స్పందించిన బీజేపీ ఎంపీ
Allu Arjun Bail - Release: అల్లు అర్జున్ అరెస్టు అనే వార్త చిత్రసీమ ఉలిక్కిపడేలా చేసింది. ఓ జాతీయ అవార్డు గ్రహీతను ఈ విధంగా తీసుకువెళ్తారని ఎవరు ఊహించలేదని నటుడు బిజెపి ఎంపీ రవి కిషన్ వ్యాఖ్యానించారు.

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) అరెస్టు రాజకీయ కోణం తీసుకుంది. 'పుష్ప 2' పెయిడ్ ప్రీమియర్ సందర్భంగా సంధ్య థియేటర్ దగ్గరకు అల్లు అర్జున్ వెళ్లడం, అక్కడ జరిగిన ఘటనల కారణంగా ఒక మహిళ మృతి చెందడం, ఆ కేసు మీద బన్నీని అరెస్ట్ చేయడం తెలిసిన సంగతులే. దీని మీద కొంతమంది రాజకీయ నాయకుల స్పందిస్తున్న తీరు కాంగ్రెస్ వర్సెస్ ఇతర పార్టీలు అనే రీతిలో ఉంది. తెలుగులో కొన్ని సినిమాలలో నటించిన భోజ్ పురి నటుడు, భారతీయ జనతా పార్టీకి ఎంపీ రవి కిషన్ స్పందించారు.
ఫిలిం ఇండస్ట్రీకి ఇది చీకటి రోజు
అల్లు అర్జున్ అరెస్టు కావడం అనేది చలనచిత్ర పరిశ్రమకు చీకటి రోజు అని రవి కిషన్ వ్యాఖ్యానించారు. ఇదొక దురదృష్టకరమైన ఘటనగా ఆయన అభివర్ణించారు.
అల్లు అర్జున్ అరెస్టు గురించి రవికిషన్ మాట్లాడుతూ... ''అతను (అల్లు అర్జున్) నాకు మంచి స్నేహితులు. నా కో యాక్టర్ కూడా! (రేసు గుర్రం సినిమాలో రవికిషన్ విలన్ రోల్ చేసిన సంగతి తెలిసిందే). ఉత్తమ నటుడిగా జాతీయ పురస్కారం అందుకున్న ఒక హీరోతో ఈ విధంగా ప్రవర్తిస్తారా? నటీనటులు అందరికీ, చలన చిత్ర పరిశ్రమకు ఇది ఒక చీకటి రోజు. కాంగ్రెస్ ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పాలి. వ్యక్తిగతమైన కారణాల చేత అల్లు అర్జున్ అరెస్టు జరిగినట్లు కనబడుతోంది. ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరించాలి'' అని చెప్పారు.
Also Read: ఒక్కర్నే బాధ్యుణ్ణి చేస్తే ఎలా? అల్లు అర్జున్ అరెస్టుపై స్పందించిన సెలబ్రిటీలు వీళ్లే
తెలంగాణ రాజకీయ నాయకులు, బిఆర్ఎస్ పార్టీ నేత కల్వకుంట్ల తారక రామారావు (కేటీఆర్) సహా పలువురు రాజకీయ నాయకులు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన నటీనటులు దర్శక నిర్మాతలు ఈ అరెస్టు మీద స్పందించిన సంగతి తెలిసిందే. అల్లు అర్జున్ బెయిల్ ఉత్తర్వులు వచ్చినప్పటికీ... ఇంకా కొన్ని గంటలు ఆయన జైలులో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం రాత్రి అయితే విడుదల అయ్యే అవకాశం లేదని తెలుస్తోంది. మరిన్ని లైవ్ అప్డేట్స్, తాజా న్యూస్ కోసం ఏబీపీ దేశం ఫాలో అవ్వండి.
Also Read: మిస్ యు రివ్యూ - సిద్ధార్థ్ సినిమాకు ఆడియన్స్ వస్తారా? వచ్చేలా ఉందా? పుష్ప 2 ఎఫెక్ట్ ఉంటుందా?