Rashmika Mandanna: మళ్లీ రష్మిక గ్లామర్ షో షురూ... సల్మాన్ భాయ్ 'సికిందర్'తో
Salman Khan's Sikandar Song: హిందీ సినిమా 'ఛావా' 500 కోట్లు వసూలు చేసింది. అందులో రష్మిక పద్ధతిగా కనిపించారు. ఆ సినిమా తర్వాత ఆవిడ చేస్తున్న 'సికిందర్'తో మరోసారి గ్లామర్ జోన్ లోకి వచ్చేశారు.

బాక్సాఫీస్ క్వీన్ బిరుదు సొంతం చేసుకుంటోంది రష్మిక మందన్న (Rashmika Mandanna). రణబీర్ కపూర్ సరసన నటించిన 'యానిమల్', ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 'పుష్ప 2', విక్కీ కౌశల్ 'ఛావా'... బ్యాక్ టు బ్యాక్ ఆవిడ నటించిన మూడు సినిమాలు బాక్సాఫీస్ బరిలో భారీ అంటే భారీ విజయాలు సాధించాయి. ఇప్పుడు ఆవిడ రంజాన్ పండక్కి సల్మాన్ ఖాన్ 'సికిందర్' సినిమాతో మరోసారి ప్రేక్షకులు ముందుకు రానుంది. దీంతో గ్లామర్ జోన్ లోకి మళ్లీ వచ్చేసినట్టు ఉన్నారు.
'సికిందర్' ఫస్ట్ సాంగ్... రష్మిక గ్లామర్ హైలైట్!
Rashmika Mandanna In Salman Khan's Sikandar Song: ఈ రోజు 'సికిందర్' సినిమాలో ఫస్ట్ సాంగ్ విడుదల చేశారు. అందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్న గ్లామర్ హైలైట్ అవుతోంది. రష్మికను మళ్లీ కమర్షియల్ హీరోయిన్ చేసే సినిమా 'సికిందర్' అవుతుందని ఆవిడ టీం నమ్ముతోంది.
'యానిమల్' భారీ హీట్. అయితే, రష్మిక గుండెల మీద రణబీర్ తల వాల్చే సీన్ విమర్శల పాలైంది. అదే విధంగా 'పుష్ప 2'లో పీలింగ్స్ సాంగ్, దాని ముందు వచ్చే సీన్ మీద కూడా కొంత మంది అభ్యంతరం వ్యక్తం చేశారు. మితిమీరిన స్కిన్ షో జరిగిందని విమర్శించారు. అయితే ఆ సినిమాలలో రష్మిక క్యారెక్టర్ గ్లామరస్ కాదు. మెజారిటీ సన్నివేశాల్లో ఆవిడ చాలా పద్ధతైన వస్త్రాధారణలో ఉంటుంది. న్యూ ఏజ్ గ్లామర్ గర్ల్ రోల్స్ కాదు. వికీ కౌశల్ 'ఛావా' విషయానికి వస్తే... ఛత్రపతి శంభాజీ మహారాజ్ భార్య ఏసు బాయిగా అవుట్ అండ్ అవుట్ ట్రెడిషనల్ రోల్ చేశారు. ఆ సినిమా తర్వాత 'సికిందర్' ఆవిడకు ఛేంజ్ ఓవర్ రోల్ అని చెప్పవచ్చు.
'సికిందర్' సినిమా ట్రైలర్ చూస్తే ఆవిడ మళ్ళీ గ్లామరస్ హీరోయిన్ కింద కనిపించారు. సినిమా ఫస్ట్ సాంగ్ 'జోహ్రా జబీన్' చూస్తే... రష్మిక చాలా గ్లామర్ లుక్కులో కనిపించారు. ఆవిడ మళ్ళీ కమర్షియల్ జోన్ సినిమాలు చేసేందుకు రెడీగా ఉన్నారని దీంతో చెప్పవచ్చు. ఫ్యాన్స్, నార్త్ ఇండియన్ ఆడియన్స్ అందర్నీ అట్రాక్ట్ చేస్తారని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు.
Also Read: నాని, దేవరకొండ మధ్యలోకి అనసూయ... బూతు మాట్లాడితే బయటకు రాలేదే?
మార్చిలో 'సికిందర్' విడుదల
Sikandar Release Date: 'సికిందర్' సినిమాకు ఏఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. స్టార్ హీరోతో కొంత విరామం తర్వాత ఆయన సినిమా చేస్తున్నారు. ట్రైలర్ విడుదలైన తర్వాత మురుగదాస్ అభిమానుల నుంచి మిశ్రమ స్పందన లభించింది. సల్మాన్ ఖాన్ హీరోగా నటించే కమర్షియల్ సినిమాల తరహాలోనే 'సికిందర్' ట్రైలర్ కనిపించింది తప్ప మురుగదాస్ మార్క్ ఏమీ లేదని విమర్శలు కూడా వచ్చాయి. కొంతమంది ఒక అడుగు ముందుకు వేసి మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేసిన 'స్టాలిన్' కథను తిప్పి తిప్పి మళ్లీ సల్మాన్ ఖాన్ హీరోగా రీమేక్ చేశారా? అనే సందేహాలు కూడా కలుగుతున్నాయి. సినిమా విడుదల అయితే తప్ప ఎలా ఉంటుందో చెప్పలేం. ఆ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే మార్చి 28 వరకు వెయిట్ చేయాలి.
Also Read: కోలీవుడ్ హీరో కార్తీకి గాయాలు... 'సర్దార్ 2' సెట్స్‌లో మరోసారి ప్రమాదం