నేషనల్ క్రష్ రష్మిక మందన్న (Rashmika Mandanna) పెళ్లి గురించి పలు కథనాలు రావడం పాఠకులూ చదువుతూనే ఉన్నారు. ఎంతో మంది ప్రేక్షకుల మనసులో ఆవిడ ఉంది. మరి ఆవిడ మనసులో ఎవరు ఉన్నారు? అంటే విజయ్ దేవరకొండ ఇండస్ట్రీ నుంచి వినపడుతుంది. అయితే... ఈ ప్రశ్నకు రష్మిక నోటి నుంచి సమాధానం తెలుసుకోవాలని చాలా మందికి ఉంది. చెన్నైలో జరిగిన పుష్ప ది రూల్ వైల్డ్ ఫైర్ ఈవెంట్ ద్వారా ఆ ప్రశ్నకు నేషనల్ క్రష్ స్పష్టమైన సమాధానం ఇచ్చారు. 


మీరు ఎవరిని పెళ్లి చేసుకుంటారు?
ఆ విషయం అందరికీ తెలుసుగా - రష్మిక!
'పుష్ప 2 ది రూల్' వైల్డ్ ఫైర్ ఈవెంట్ నుంచి రష్మికకు ఒక ప్రశ్న ఎదురైంది. 'మీరు ఇండస్ట్రీలో వ్యక్తిని ఎవరినైనా పెళ్లి చేసుకుంటారా? లేదా?' అని అడిగితే... ''everyone knows about it (ప్రతి ఒక్కరికి ఆ విషయం తెలుసు)' అనే రష్మిక చెప్పారు. యాంకర్ అంతటితో ఆగలేదు.‌ ఆ వ్యక్తి ఎవరో మాకు చెబుతారా? అని మళ్లీ ఇంకో ప్రశ్న వేశారు. వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఈ విషయం డిస్కస్ చేద్దామని అంతటితో ఆ సంభాషణకు ముగింపు పలికింది రష్మిక.


Also Readనన్ను లేట్ అనొద్దు, నాది ఆన్ టైమ్... పుష్ప 2 మ్యూజిక్ ఇష్యూస్‌పై నిర్మాతకు క్లాస్ పీకిన దేవి శ్రీ ప్రసాద్


నాగశౌర్య హీరోగా నటించిన 'ఛలో' సినిమాతో రష్మిక తెలుగు తెరకు పరిచయం అయింది. ఆ తరువాత విజయ్ దేవరకొండకు జంటగా 'గీత గోవిందం' చేసింది. ఆ సినిమా చిత్రీకరణలో వాళ్ళిద్దరి మధ్య జరిగిన పరిచయం తర్వాత కాలంలో ప్రేమ చిగురించడానికి దారి తీసిందని, 'డియర్ కామ్రేడ్' చిత్రీకరణ సమయానికి ఆ బంధం మరింత బలపడిందని ఇండస్ట్రీలో వినపడుతుంది. అయితే... ఇటు రష్మిక గాని, అటు విజయ్ దేవరకొండ గాని 'అవును, మేం ప్రేమలో ఉన్నాం' అని ఎప్పుడూ చెప్పలేదు.


ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో 'మీరు సింగిలేనా?' అనే విజయ్ దేవరకొండను అడిగితే... 'ఇంకా సింగిల్ అని అనుకుంటున్నారా?' అనే అర్థం వచ్చేలా సమాధానం ఇచ్చారు. ఇప్పుడు 'పుష్ప 2: ది రూల్' వేడుక సాక్షిగా తన పెళ్లి వేడుక గురించి రష్మిక ఓపెన్ అయ్యారు. అందరికీ తెలుసుగా అని ఆవిడ చెబుతున్న సమయంలో శ్రీ లీల క్లాప్స్ కొడుతూనే ఉన్నారు.


Also Read: సంక్రాంతి రేసు నుంచి తమిళ్ సినిమా అవుట్ - అజిత్ రావడం లేదని కన్ఫర్మ్ చేసిన నిర్మాత



ఇంటర్నెట్ అంతటా విజయ్, రష్మిక లేటెస్ట్ ఫోటోలే!
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఒక రెస్టారెంట్ దగ్గర ఫుడ్ తింటున్న ఫోటోలు కొన్ని గంటలుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాళ్ళిద్దరూ కలిసి డేట్ కి వెళ్లినపుడు ఎవరో ఫోటోలు తీసారని అర్థం అవుతోంది. దీపావళి సందర్భంగా రష్మిక పోస్ట్ చేసిన ఫోటోలు చూస్తే... విజయ్ దేవరకొండ ఇంటిలో దిగారని ప్రేక్షకులు అందరూ ముక్త కంఠంతో కామెంట్ చేశారు. ఇన్నాళ్లు ఒకే ప్రాంతంలో ఉండి విడివిడిగా ఫోటోలు దిగారు. ఇప్పుడు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న కలిసి ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి. త్వరలో పెళ్లి చేసుకునే ఆలోచనతో 'అందరికీ తెలుసు' అన్నారో? లేదంటే ఫోటోలు లీక్ అయ్యాయి కనుక 'తెలుసు' అని చెప్పారో రష్మికకే ఎరుక.