Rashmika Mandanna The Girlfriend Nadhive Song Released: నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'ది గర్ల్‌ఫ్రెండ్'. ఈ మూవీని రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తుండగా... దీక్షిత్ శెట్టి కీలక పాత్ర పోషిస్తున్నారు. మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఫస్ట్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్.

డిఫరెంట్‌గా రష్మిక డ్యాన్స్

'వెలుగారినా... నిశి పూసినా... వెలి వేసినా... మది వీడునా... నదివే' అంటూ సాగే సాంగ్ ఆకట్టుకుంటోంది. రష్మిక, దీక్షిత్‌ల డ్యాన్స్ డిఫరెంట్‌గా ఆకట్టుకుంటోంది. లవ్, ఎమోషన్ కలగలిసేలా స్లోగా సాగే మెలోడి పాటలో అద్భుతమైన ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తూ రష్మిక, దీక్షిత్ సరికొత్త డ్యాన్స్‌తో హైప్ క్రియేట్ చేశారు. రాకేందు మౌళి లిరిక్స్ అందించగా... హేషమ్ అబ్దుల్ వహాబ్ ఈ పాటను పాడారు. ఆయనే మ్యూజిక్ కూడా అందించారు.

Also Read: చిరంజీవి అనిల్ రావిపూడి మూవీపై బిగ్ అప్డేట్! - ఫస్ట్ టైం నయనతారతో చిరు రొమాంటిక్ సాంగ్?

ఈ మూవీని ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్‌టైన్మెంట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. రష్మిక నటిస్తోన్న ఫస్ట్ ఫీమేల్ ఓరియెంటెడ్ మూవీ కాగా... హైప్ క్రియేట్ అవుతోంది. సెప్టెంబర్ 5న ఈ మూవీని రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

లేడీ ఓరియెంటెడ్ మూవీస్

వరుసగా బ్లాక్ బస్టర్ హిట్లతో దూసుకెళ్తున్నారు నేషనల్ క్రష్ రష్మిక మందన్న. 'యానిమల్', 'పుష్ప 2', 'ఛావా' ఇలా బ్లాక్ బస్టర్ హిట్లతో సూపర్ క్రేజ్ అందుకున్నారు. తాజాగా లేడీ ఓడియెంటెడ్ ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. రీసెంట్‌గా 'మైసా' మూవీ అనౌన్స్ చేయగా వారియర్ లుక్‌లో భయపెట్టేశారు. ఇదివరకు ఎన్నడూ లేని విధంగా రక్తంతో నిండిన ముఖం, చేతిలో ఆయుధం, ముక్కు పుడకతో షాకింగ్ లుక్‌లో కనిపించారు. దీంతో భారీ హైప్ క్రియేట్ అవుతోంది.

'మైసా' అంటే అమ్మ అని అర్థం కాగా... స్వేచ్ఛా ఆలోచనల నుంచి వచ్చిన ఓ సహజ నాయకురాలి పాత్రలో ఆమె కనిపించనున్నట్లు తెలుస్తోంది. గోండు తెగల బ్యాక్ డ్రాప్ ప్రధానాంశంగా మూవీ తెరకెక్కించనుండగా... ఆ తెగలకు అండగా ఓ వారియర్‌గా రష్మిక కనిపించనున్నట్లు సమాచారం.