Megastar Nayanthara Romantic Song In Anil Ravipudi Mega157 Movie: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌పై భారీ హైప్ క్రియేట్ అవుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... మూవీ గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా క్షణాల్లోనే ట్రెండ్ అవుతోంది. తాజాగా మరో లేటెస్ట్ బజ్ వైరల్ అవుతోంది.

Continues below advertisement


ఫస్ట్ టైం రొమాంటిక్ సాంగ్?


ఈ సినిమాలో చిరంజీవి సరసన నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా... వీరిద్దరిదీ ఓ రొమాంటిక్ సాంగ్ ఉన్నట్లు తెలుస్తోంది. గతంలో 'సైరా నరసింహారెడ్డి', 'గాడ్ ఫాదర్' మూవీస్‌లో ఇద్దరూ కలిసి నటించారు. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకుంటుండగా... ఫస్ట్ టైం రొమాంటిక్ సాంగ్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది.


ఇప్పటికే కొన్ని షెడ్యూల్స్ కంప్లీట్ కాగా... కొత్త షెడ్యూల్‌లో ఈ రొమాంటిక్ మెలోడి సాంగ్ షూట్ చేయనున్నారని తెలుస్తోంది. కేరళలో ఈ పాట షూటింగ్ చేయనుండగా... భాను మాస్టర్ దీనికి కొరియోగ్రఫీ చేయనున్నారని సమాచారం. అయితే, దీనిపై మూవీ టీం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ప్రస్తుతం షూటింగ్ షెడ్యూల్ ఈ నెల 23 నాటికి పూర్తవుతుండగా... కాస్త గ్యాప్ తీసుకుని ఆగస్టులో మళ్లీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుందని తెలుస్తోంది. డైరెక్టర్ అనిల్ హైదరాబాద్‌లో నెక్స్ట్ షెడ్యూల్ షూట్ ప్లాన్ చేస్తుండగా... అక్టోబర్ నాటికి షూటింగ్ పూర్తి చేయాలని ఆయన భావిస్తున్నారట.


Also Read: అతనితో లవ్‌లో బ్యూటీ తాన్య రవిచంద్రన్ - లిప్ లాక్‌తో కన్ఫర్మ్ చేసేసిందిగా...


టైటిల్ అదేనా?


ఈ మూవీలో మెగాస్టార్ చిరంజీవి తన ఒరిజినల్ నేమ్ శివశంకర్ వరప్రసాద్ పేరుతోనే కనిపించనుండగా... 'మన శంకర్ వరప్రసాద్ గారు...' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. చిరు డ్రిల్ మాస్టర్ రోల్‌లో కనిపించనున్నట్లు సమాచారం. విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్ చేయనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. చిరుతో పాటు కేథరిన్, వీటీవీ గణేష్, 'బలగం' మురళీధర్ గౌడ్ కీలక పాత్రలు పోషించారు. భీమ్స్ సిసిరోలియే మ్యూజిక్ అందిస్తున్నారు.


ఓటీటీ డీల్ క్లోజేనా?


ఓ వైపు షూటింగ్ జరుగుతుండగానే... మరోవైపు ఈ మూవీ ఓటీటీ డీల్ కూడా క్లోజ్ అయిపోయిందనే టాక్ ఫిలింనగర్ వర్గాల్లో వినిపిస్తోంది. ప్రముఖ ఓటీటీ 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఈ మూవీ కోసం బిగ్ డీల్ కుదుర్చుకుందని తెలుస్తోంది. హిట్ కాంబో కావడంతో దాదాపు రూ.55 కోట్ల నుంచి రూ.60 కోట్ల మధ్య డీల్ కుదిరిందని సమాచారం. దీనిపై మెగా ఫ్యాన్స్ సంబర పడుతున్నారు. 


వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ మూవీని రిలీజ్ చేయాలని డైరెక్టర్ అనిల్ రావిపూడి భావిస్తున్నారు. అందుకు అనుగుణంగానే షూటింగ్ షెడ్యూల్స్, ప్రమోషన్స్ డిఫరెంట్‌గా ప్లాన్ చేస్తున్నారు. అటు, చిరంజీవి 'విశ్వంభర'లోనూ నటిస్తున్నారు. రాబోయే రోజుల్లో మెగా ఫ్యాన్స్‌కు బిగ్ ట్రీట్ ఖాయమని సినీ వర్గాలు అంటున్నాయి.