Rashmika Mandanna: సౌత్ ఇండియన్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నకు ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో తెలిసిందే. ఇటీవల స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా చేసిన ‘పుష్ప’ సినిమాలో హీరోయిన్ గా నటించి మరింత గుర్తింపు తెచ్చుకుంది. ఈ మూవీతో రష్మిక పేరు దేశవ్యాప్తంగా వినిపించింది. మూవీలో ఆమె నటనకు అంతర్జాతీయంగా ప్రశంసలు వెల్లువెత్తాయి. ఇటీవల కాలంలో రష్మిక మందన్న పేరు ఎక్కువ సార్లు వార్తల్లో వినిపిస్తూ వచ్చింది. ఆమె తన కన్నడలో‘కిరాక్ పార్టీ’ మూవీతో తెరగేట్రం చేసింది. ఈ సినిమాకు రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. రక్షిత్ శెట్టి మెయిన్ లీడ్ రోల్ లో కనిపించాడు. ఈ మూవీ తర్వాత రష్మిక మందన్న, రక్షిత్ శెట్టి ప్రేమలో పడ్డారు. తర్వాత వీరిద్దరికీ నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే వ్యక్తిగత కారణాల వలన కొన్నాళ్లకు ఇద్దరూ బ్రేకప్ చెప్పుకున్నారు. అయితే చాలా కాలం తర్వాత రక్షిత్-రష్మిక బ్రేకప్ గురించి రష్మిక తల్లి సుమన్ మందన్న స్పందించింది. 


రక్షిత్-రష్మికల బ్రేకప్ ఆందోళనకు గురిచేసింది: సుమన్ మందన్న


‘కిరాక్ పార్టీ’ సినిమా తర్వాత రక్షిత్-రష్మిక లు జులై 3, 2017 న నిశ్చితార్థం చేసుకున్నారు. ఈ వేడుక చాలా గ్రాండ్ గా నిర్వహిచారు. అందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అయితే తర్వాత 2018 లో వారు తమ నిశ్చితార్థాన్ని విరమించుకుంటున్నట్లు ప్రకటించారు. అయితే కొంత కాలం తర్వాత రక్షిత్, రష్మిక ల బ్రేకప్ పై రష్మిక తల్లి సుమన్ మందన్న స్పందిస్తూ.. ఆ వార్త తమను ఎంతగానో ఆందోళనకు గురిచేసిందని చెప్పింది. దాని నుంచి మెల్లగా కోలుకునే ప్రయత్నం చేస్తున్నామని తెలిపింది. ఇతరులను ఇబ్బంది పెట్టాలని ఎవరూ కోరుకోరని ఎవరికైనా వారి జీవితం వారికి ముఖ్యమని చెప్పింది. అయితే ఈ విషయంలో రష్మిక చాలా మానసిక సంఘర్షణకు గురైనట్లు తెలిపింది. కుటుంబ సభ్యులు, స్నేహితులతో చర్చించిన తర్వాత ఆమె బలమైన నిర్ణయం తీసుకుందని తెలపింది. పూర్తిగా కెరీర్ పై దృష్టి పెట్టిన తర్వాత తెలుగు, కన్నడలో పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిందని చెప్పింది.


ఎవరి లైఫ్ వాళ్లది, అవన్నీ నేను పట్టించుకోను: రక్షిత్ శెట్టి


రష్మిక తో బ్రేకప్ అయిన తర్వాత చాలా కాలం రక్షిత్ శెట్టి తన అభిప్రాయాన్ని వెల్లడించాడు. గతేడాది ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ప్రపంచంలో కొన్ని కోట్ల మంది ఉన్నారని, ప్రతి ఒక్కరికీ ఒక మైండ్ సెట్ ఉంటుందన్నారు. వాళ్లంతా తనను ఇష్టపడతారని లేదా ద్వేషిస్తారని అనుకోనని, అవన్నీ తాను పట్టించుకోనని అన్నాడు. బయట అంతా తన గురించి ఏమనుకుంటున్నారు అని అన్వేషించాల్సిన అవసరం తనుకు లేదని, తన పని తాను చేసుకుంటున్నానని చెప్పుకొచ్చాడు రక్షిత్. 


అయితే రష్మిక గతంలో కన్నడ ఇండస్ట్రీ గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు విమర్శలకు దారితీసాయి. తర్వాత కొన్నాళ్లు అవి కొనసాగినా తర్వాత రష్మిక తప్పు తెలుసుకొని తన వ్యాఖ్యలను సరిచేసుకుంది. ప్రస్తుతం రష్మిక అల్లు అర్జున్ తో ‘పుష్ప 2’ సినిమాలో నటిస్తోంది. దానితో పాటు పలు భారీ ప్రాజెక్టులలో భాగం కానుంది రష్మిక.


Also Read ఉదయ భాను రీ ఎంట్రీ - 'ఆగస్టు 6 రాత్రి' ఏం జరిగింది?