Jr NTR: సౌత్ ఇండియన్ మాస్ దర్శకుడు ప్రశాంత్ నీల్ కు ఎలాంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ‘కేజీఎఫ్’ సినిమాతో ప్రశాంత్ పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. ప్రస్తుతం ప్రశాంత్ పలు భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. జూన్ 4 న ప్రశాంత్ నీల్ పుట్టినరోజు వేడుకలు జరిగిన విషయం తెలిసిందే. సినిమాలతో సంబంధం లేకుండా చాలా మంది సెలబ్రెటీలు ఆయనకు బర్త్ డే విసెష్ చెప్పారు. హీరో ప్రభాస్ ‘సలార్’ సెట్స్ లో జరిగిన బర్త్ డే వేడుకల్లో ప్రశాంత్ కు కేక్ తినిపించి శుభాకాంక్షలు తెలిపాడు. అలాగే రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కూడా ప్రశాంత్ కు విసెష్ చెప్పారు. అయితే ఎన్టీఆర్ విసెష్ తో సరిపెట్టకుండా ప్రశాంత్ కు ఓ సర్ఫ్రైజ్ గిఫ్ట్ పంపాడు. అందుకు సంబంధించిన ఫోటోలను ప్రశాంత్ భార్య సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.
నాటుకోడి పులుసు పంపిన ఎన్టీఆర్..
దర్శకుడు ప్రశాంత్ నీల్ పుట్టిన రోజు సందర్భంగా ఎన్టీఆర్ ప్రత్యేకంగా ఇంటి నుంచి తయారు చేయించిన నాటు కోడి పులుసును ప్రశాంత్ కు గిఫ్ట్ గా పంపాడు. ఈ విషయాన్ని ప్రశాంత్ భార్య లిఖిత రెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. ఎన్టీఆర్ పంపిన నాటుకోడి పులుసు ఫోటోలను పోస్ట్ చేసింది. ఆ ఫోటోలకు ‘థ్యాంక్యూ అన్నయ్య’ అంటూ రాసుకొచ్చింది. ప్రస్తుతం లిఖిత పోస్ట్ చేసిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన ఎన్టీఆర్ అభిమానులు హర్షం వ్యక్తం చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు.
త్వరలో పట్టాలెక్కనున్న ‘ఎన్టీఆర్ 31’..
ప్రస్తుతం ఎన్టీఆర్ దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో ‘దేవర’ సినిమా చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా పూర్తి చేసుకొని ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ ప్రాజెక్టులో భాగం కానున్నాడు. అలాగే అటు ప్రశాంత్ నీల్ కూడా ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ తో ‘సలార్’ సినిమా తీస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా వేగంగానే జరుగుతోంది. ఈ మూవీ షూటింగ్ పూర్తవగానే ఎన్టీఆర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడు ప్రశాంత్. అలాగే ఇటీవల ప్రశాంత్ ఎన్టీఆర్ తో మూవీ గురించి మాట్లాడుతూ.. తాను గత ఇరవై ఏళ్లుగా ఎన్టీఆర్ కే అభిమానినని అన్నాడు. ఈ సినిమా గురించి మాట్లాడకముందు తాను ఎన్టీఆర్ ను పలు సార్లు కలిశానని, గత రెండేళ్లుగా నుంచి ఎన్టీఆర్ తో స్నేహం మరింత బలపడిందని అన్నారు. తన కథ ఎన్టీఆర్ నచ్చిందని ఇప్పుడు తాము ఆ సినిమా కోసం పనిచేస్తున్నామని చెప్పాడు. ఇప్పటికే ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా గతంలో ‘ఎన్టీఆర్ 31’ మూవీ కు సంబంధించి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. అందులో ఎన్టీఆర్ వీరమాస్ లుక్ లో కనిపించడంతో ఈ మూవీపై ఫ్యాన్స్ లో మరింత ఉత్కంఠ మొదలైంది. ఈ సినిమా కు సంబంధించిన మరిన్ని అప్డేట్ లను త్వరలోనే రివీల్ చేయనున్నారు మేకర్స్.