''నువ్వు నా టైప్ కాదు''... 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్‌లో హీరో దీక్షిత్ శెట్టి డైలాగ్. 'హూ ఈజ్ యువర్ టైప్?' అని మరొక క్వశ్చన్ కూడా! ఇంతకు ముందు ఒక ప్రమోషనల్ వీడియోలో ''విక్రమ్... అందరికీ ఒక టైపు ఉంటుంది కదా! నేను నీ టైప్ యేనా?'' రష్మిక అడుగుతుంది. 'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ రిలీజ్ ఈవెంట్‌లో రష్మికను యాంకర్ మంజూష ఒక ప్రశ్న అడిగింది. 'మీ టైప్ ఎవరు?' అని! అప్పుడు ఏం సమాధానం వచ్చిందో తెలుసా?
రష్మిక టైప్ ఎవరు... రౌడీ!విజయ్ దేవరకొండకు అభిమానులు, ప్రేక్షకులు ముద్దుగా 'రౌడీ బాయ్' అని ఒక క్యాప్షన్ ఇచ్చారు. అది కొంచెం 'రూడ్'గా ఉందని విజయ్ తీసేశారు అనుకోండి. తన పేరు ముందు రౌడీ బాయ్ అని వేసుకోవడం లేదు. కానీ అభిమానులు మాత్రం ఆయన్ను అలా పిలవడం ఆపడం లేదు. నేషనల్ క్రష్ రష్మికతో విజయ్ దేవరకొండ ప్రేమలో ఉన్నారని, ఈ మధ్య వాళ్ళిద్దరికీ నిశ్చితార్థం జరిగిందనేది అందరికీ తెలుసు. అయితే ఆ విషయం బయటకు చెప్పడం లేదు. కానీ నిశ్చితార్థపు ఉంగరంతో ఆవిడ కనిపిస్తున్నారు.
Also Read: రష్మిక vs దీపిక... బాలీవుడ్ బ్యూటీకి నిర్మాత ఎస్కేఎన్ కౌంటర్
'ది గర్ల్ ఫ్రెండ్' ట్రైలర్ లాంచ్‌లో 'మీ టైప్ ఎవరు?' అని యాంకర్ మంజూష అడగ్గా 'రౌడీ' అంటూ ఆడిటోరియం నుంచి పెద్దగా సమాధానం వినిపించింది అభిమానుల నుంచి! రౌడీ అంటే విజయ్ దేవరకొండ అనేది తెలిసిందే. రష్మికకు కూడా ఆ సంగతి తెలుసు. అందుకని విజయ్ దేవరకొండ పేరు చెప్పగానే... 'అందరికీ తెలుసు' అని రష్మిక నవ్వేశారు. దాంతో తన బాయ్ ఫ్రెండ్, తన టైప్ విజయ్ దేవరకొండ అని కన్ఫర్మ్ చేసినట్టు అయ్యింది.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఇద్దరి పెళ్లి!?Vijay Deverakonda Rashmika Mandanna Wedding Date: నిశ్చితార్థం జరిగిన సంగతి అధికారికంగా చెప్పలేదు విజయ్ దేవరకొండ & రష్మిక. ఈ తరుణంలో తమ పెళ్లి కబురు అందరికీ చెబుతారని ఆశించడం అత్యాశే.
ఫిల్మ్ నగర్ వర్గాల సమాచారం ప్రకారం... వచ్చే ఏడాది (2026) ఫిబ్రవరిలో వాళ్లిద్దరూ పెళ్లి చేసుకోవాలని ప్లాన్ చేశారట. 'గీత గోవిందం'లో విజయ్ దేవరకొండ, రష్మిక తొలిసారి జంటగా నటించారు. ఆ తర్వాత 'డియర్ కామ్రేడ్' చేశారు. ఆ రెండు సినిమాల టైంలో ప్రేమలో పడ్డారు. పెద్దలను ఒప్పించి పెళ్లి వరకు తమ బంధాన్ని తీసుకొచ్చారు.
Also Read: నేషనల్ క్రష్ రష్మిక ఫేస్‌కు ఏమైంది? ట్రీట్మెంట్ ఎందుకు?